అర‌చేతిలో పుట్టు మ‌చ్చ ఎక్క‌డ ఉంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

చేతిలో ఉండే రేఖ‌ల ప్ర‌కారం ఎవ‌రైనా వ్య‌క్తి జాత‌కం చెప్పే హ‌స్త సాముద్రికం గురించి మీకు తెలుసు క‌దా. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా దాదాపుగా అలాంటిదే. కాక‌పోతే చేతిలో రేఖ‌ల‌కు బ‌దులుగా పుట్టు మ‌చ్చ‌ల‌ను చూడాలి, అంతే. అంటే… అర‌చేతిలో ఉండే ఆయా ప్రాంతాల్లో ఏర్ప‌డే పుట్టుమ‌చ్చ‌ల ప్ర‌కారం ఆ వ్య‌క్తికి ఏం జ‌రుగుతుందో చెప్ప‌వ‌చ్చ‌న్న‌మాట‌. ఆయా అంశాల్లో అత‌నికి ఏం జ‌రుగుతుందో ఆ మ‌చ్చ‌ల వ‌ల్ల చెప్పేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ క్ర‌మంలో అర‌చేతిలో ఉండే పుట్టుమ‌చ్చ‌లు మ‌న‌కు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

hand-moles-1
1. చిత్రంలో చూపిన విధంగా అరచేతిలోని ఆ ప్రాంతంలో పుట్టు మ‌చ్చ ఉంటే దాంతో అలాంటి వ్య‌క్తి ఒక‌రి క‌న్నా ఎక్కువ ప్రేమ సంబంధాల‌ను క‌లిగి ఉంటాడ‌ట‌. దాంతోపాటు అత‌ని నీతి, నిజాయితీలు, విలువ‌లు ప్ర‌శ్నించే విధంగా ఉంటాయ‌ట‌.

2. బొమ్మ‌లో ఉన్న‌ట్టుగా లైఫ్ లైన్ రేఖ వ‌ద్ద పుట్టు మ‌చ్చ ఉంటే వారు త‌మ ఆరోగ్యం ప‌ట్ల చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ట‌. లేదంటే ఆరోగ్య ప‌రంగా పెద్ద ప్ర‌మాదం సంభ‌విస్తుంద‌ట‌.

hand-moles-2
3. అర‌చేతిలో ఆ ప్రాంతంలో పుట్టు మ‌చ్చ ఉంటే వారికి అన్నీ స‌మ‌స్యలే ఎదుర‌వుతాయ‌ట‌. ప్ర‌ధానంగా ల‌క్ష్య‌సాధ‌న‌కు వైవాహిక జీవితం అడ్డుగా ఉంటుంద‌ట‌.

4. అర‌చేతిలో ఆ విధంగా పుట్టు మ‌చ్చ ఉంటే వారు స‌ముద్ర ప్ర‌యాణాలు చేయ‌కూడ‌ద‌ట‌. లేదంటే ప్ర‌మాదాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ట‌. దీంతోపాటు వారికి ఆలస్యంగా వివాహం అవుతుంద‌ట‌.

hand-moles-3
5. అర‌చేతిలో చిటికెన వేలు కింద గ‌న‌క పుట్టుమ‌చ్చ ఉంటే వారు అన్నీ న‌ష్టాల‌నే చ‌వి చూస్తార‌ట‌. ఆర్థిక ప‌ర‌మైన స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటార‌ట‌.

6. చిత్రంలో చూపిన విధంగా అర‌చేతిలో మ‌చ్చ ఉన్న‌వారు రెండు ర‌కాలుగా ఉండేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌. విధి అనుకూలిస్తే క‌ష్ట ప‌డ‌క‌పోయినా ఫ‌లితం ల‌భిస్తుంద‌ట‌. అలా కాక‌పోతే ఎంత ప‌ని చేసినా ఫలితం ద‌క్క‌ద‌ట‌.

hand-moles-4
7. చిత్రంలో ఇచ్చిన‌ట్టుగా అర‌చేతిలో చిటికెన వేలుకు ఓ వైపుగా పుట్టుమ‌చ్చ ఉంటే దాంతో వారు వైవాహిక జీవితంలో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటార‌ట‌. వారి బంధం విడాకుల‌కు దారి తీసే అవ‌కాశం ఉంటుంద‌ట‌.

8. ఉంగ‌ర‌పు వేలు కింద మ‌చ్చ ఉంటే వారికి జీవితంలో అన్నీ న‌ష్టాలే క‌లుగుతాయ‌ట‌. అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయ‌ట‌.

Comments

comments

Share this post

scroll to top