రెండు సార్లు మంత్రిగా ప‌నిచేశాడు…అయినా ఇప్ప‌టికీ ఆయ‌న‌కు సొంతిల్లు లేదు. #ఆయ‌న జీవిత‌మే ఓ పోరాటం.

ఈ ఫోటోలో క‌నిపిస్తున్నాయ‌న పేరు…జ‌మునా ప్ర‌సాద్ బోస్, ఉత్తర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని బాందాలో నివాస‌ముంటున్నారు. ఈయ‌న రెండు సార్లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రిగా ప‌నిచేశారు. ఒక్క‌సారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే మునిమ‌న‌వ‌ళ్లకు కూడా స‌రిపోయేంత సంపాదించి పెడుతున్న ఈ రోజుల్లో…రెండు సార్లు రాష్ట్రానికి మంత్రిగా ప‌నిచేసిన‌ప్పటికీ సొంతిల్లు కూడా క‌ట్టుకోకుండా..కేవ‌లం ప్ర‌భుత్వమిస్తున్న పింఛ‌న్ మీద జీవితం వెల్ల‌దీస్తున్న నిస్వార్థ ప్ర‌జానాయ‌కుడీయ‌న‌. ఆయ‌న జీవిత‌మంతా పోరాటాల మ‌యం….ఇప్ప‌టికీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్న బోస్ గురించి క్లుప్తంగా…..మీకోసం.

పొలిటిక‌ల్ ఎంట్రీ:
1962 లోనే స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు బోస్……అయిన‌ప్ప‌టికీ ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు బోస్, త‌ర్వాత 1967 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో…1969 శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో కూడా ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ ప‌ట్టు విడ‌వ‌కుండా…స్థానిక స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ….ప్ర‌జ‌ల్లో మంచి పేరు సంపాదించుకుంటూ…1974 లో అదే ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. 1977 లో పంచాయితీరాజ్ మంత్రిగా త‌ర్వాత ములాయం సింగ్ కేబినేట్ లో అట‌వీశాఖ మంత్రిగా ప‌నిచేశారు.

ఎన్నిక‌ల్లో గెలుపుకు స్నేహితుల స‌హాయం:

బోస్ గెలుపు కోసం అత‌ని స్నేహితులు సైకిల్ పై, గుర్ర‌పు బండిపై ప్ర‌చారం చేశారు! స్నేహితులంతా క‌లిసి గోడ‌ల‌పై స్లోగ‌న్స్ రాయ‌డం, ప‌బ్లిక్ మీటింగ్ లు ఏర్పాటు చేయ‌డం , విరాళాలు సేక‌రించ‌డం లాంటివి చేశారు.

తాత‌ల కాలం నుండి వార‌స‌త్వంగా వ‌చ్చిన రెండు గ‌దుల ఇంటిని చెల్లి పెళ్లి కోసం అమ్మారు. ప్ర‌స్తుతం బోస్ కిరాయి ఇంట్లో ఉంటున్నారు. బోస్ ఇంట్లో దేవుడి ఫోటోల‌కు బ‌దులు వినోభాభావే, సుభాష్ చంద్ర‌బోస్ ఫోటోలు ఉండ‌డం విశేషం. ముగ్గురు కొడుకులు ఉన్న‌ప్ప‌టికీ…..వారి సంసారం వారికే భారం కావ‌డంతో …బోస్ కూడా వారికి భారం కాద‌ల్చుకోలేదు. ఒక్క‌డే అదే ఇంట్లో ఉంటూ…ఇప్ప‌టికీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తూనే ఉన్నారు.

Comments

comments

Share this post

scroll to top