వీళ్లు పిల్ల‌లు కాదు చిచ్చ‌ర పిడుగులు, ఇంత చిన్న వ‌య‌స్సులో..సొంత‌గా బ్యాండ్ ఏర్పాటు చేసుకొని త‌మ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నారు.

ఏ స్కూల్ పిల్ల‌ల‌కైనా సెల‌వులు వ‌స్తే ఏం చేస్తారు..? ముందుగా ఎగిరి గంతేస్తారు. ఆ త‌రువాత సెల‌వులు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తారు. అనంత‌రం దాని ప్ర‌కార‌మే వాటిని ఎంజాయ్ చేస్తారు. అయితే ఆ పిల్ల‌లు మాత్రం అలా కాదు. సెల‌వు దొరికిందంటే చాలు, త‌మకు వ‌చ్చిన సంగీతం అనే క‌ళ‌తో ప్ర‌దర్శ‌న‌లిస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నారు. త‌మ గ్రూప్ పేరిట ఏకంగా ఓ బ్యాండ్‌ను ఏర్పాటు చేసి సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తున్నారు. అయితే వారు ఎక్క‌డో, ఏదో రాష్ట్ర‌లో ఉంటార‌నుకుంటే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే వారు ఉండేది మ‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోనే.

music-band-kids

వారి పేర్లు కెవిన్‌, జోషువా, శామ్‌, ర్యాన్‌, రోహ‌న్‌, ఎమ్మాన్యుయ‌ల్‌, బ్లెస్సీ, ఆతిబ‌న్‌. మొత్తం 8 మంది. వీరు ఒక‌సారి ఆదివారం ఓ చ‌ర్చిలో క‌లిశారు. అయితే అనుకోకుండా అంద‌రూ క‌ల‌సి ఓ సంగీత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. దీంతో అక్క‌డి చ‌ర్చి ఫాద‌ర్ వీరిలో ఉన్న టాలెంట్‌ను చూసి ఆశ్చ‌ర్య‌పోయాడు. అనంత‌రం వారిని సంగీతం దిశ‌గా ఎంక‌రేజ్ చేశాడు. దీంతో ఆ 8 మంది ఒక బ్యాండ్‌గా ఏర్ప‌డి అప్ప‌టి నుంచి చ‌ర్చిల్లో సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే వారు సికింద్రాబాద్‌లోని సెయింట్ థామ‌స్ చ‌ర్చిలో ఓ సారి ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చారు. ఇది చాలా మందికి న‌చ్చింది. దీంతో వారు ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యారు.

అయితే స‌ద‌రు విద్యార్థులు ఎప్ప‌టి నుంచో మ్యూజిక్ బ్యాండ్‌ను ఏర్పాటు చేసినా ఇప్పుడు వారి బ్యాండ్ సిటీలోనే అత్యంత యంగెస్ట్ క‌ళాకారులు ఉన్న బ్యాండ్‌గా పేరు గాంచింది. ఈ క్ర‌మంలో వారు ఏం చెబుతున్నారంటే ఇక‌పై చ‌ర్చిల్లోనే కాకుండా, ఇత‌ర అన్ని చోట్లా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తామ‌ని చెబుతున్నారు. అత్యుత్త‌మ స్థాయి సంగీత క‌ళాకారులుగా త‌యార‌వ్వాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని అంటున్నారు. వారి ఆశ‌యాలు నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top