ప్ర‌భుత్వ ఉద్యోగాలు పొందిన 9 మంది ఆట‌గాళ్ళు.!

భార‌త క్రికెట్ ఆట‌గాడు ఉమేష్ యాద‌వ్ గురించి తెలుసు క‌దా. ఐపీఎల్‌లోనే కాదు, దాదాపుగా అన్ని ఫార్మాట్ల‌కు చెందిన క్రికెట్ మ్యాచ్‌ల‌లోనూ త‌న బౌలింగ్‌తో స‌త్తా చాటాడు. ప్ర‌స్తుతం త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న శ్రీ‌లంక టూర్‌లోనూ పాల్గొంటున్నాడు. అయితే ఉమేష్ యాద‌వ్ తండ్రికి ఓ కోరిక ఉండేద‌ట‌. త‌న కొడుకు ప్ర‌భుత్వ ఉద్యోగం చేయాల‌న్న‌ది ఆయ‌న కోరిక‌ట‌. అయితే ఆ కోరిక కూడా తీరింది. ఎలాగో తెలుసా..? ఇప్పుడు ఉమేష్ యాద‌వ్ స్పోర్ట్స్ కోటాలో రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో అసిస్టెంట్ మేనేజ‌ర్ అయ్యాడు. అలా ఉమేష్ యాద‌వ్ తండ్రి కోరిక నెర‌వేరింది. ఇక కొత్త ప‌ద‌విలోఉమేష్ జూలై 24, 2017 నుంచి కొన‌సాగ‌నున్నాడు. అయితే ప్ర‌స్తుతం అత‌ను శ్రీ‌లంక టూర్‌కు భార‌త జ‌ట్టుతో క‌లిసి వెళ్లాడు. కాగా ఉమేష్ యాద‌వ్ చ‌దువుకుంది ఇంట‌ర్మీడియ‌ట్ వ‌ర‌కే. ఆ త‌రువాత అత‌ను ఆర్మీలో చేరేందుకు అప్లై చేసి వెళ్ల‌లేదు. పోలీస్ కానిస్టేబుల్ ప‌రీక్ష రాసి అందులో ఫెయిల్ అయ్యాడు. అయితే మ‌రి ఇలా స్పోర్ట్స్ కోటాలో ప్ర‌భుత్వ ఉద్యోగం వ‌చ్చింది కేవ‌లం ఉమేష్‌కేనా అంటే.. కాదు.. ఆ జాబితాలో ఇంకొంద‌రు ఆట‌గాళ్లు కూడా ఉన్నారు. వారు ఎవ‌రంటే…

1. ఎంఎస్ ధోని
టీమిండియా మాజీ కెప్టెన్‌, క్రికెట‌ర్ ఎంఎస్ ధోనికి భార‌త ఆర్మీలో లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ పోస్టు ఇచ్చారు. ప్ర‌స్తుతం ధోని అదే ప‌ద‌విలో కొన‌సాగుతున్నాడు. ఇక ధోని చ‌దివింది ఇంట‌ర్ వ‌ర‌కే. కానీ ప్రైవేట్‌గా చ‌దివి ఓపెన్ యూనివ‌ర్సిటీలో డిగ్రీ సాధించాడు.

2. స‌చిన్ టెండుల్క‌ర్
మాజీ క్రికెట్ ఆట‌గాడు, రాజ్య‌స‌భ ఎంపీ స‌చిన్ టెండుల్క‌ర్ ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ ద‌ళంలో గ్రూప్ కెప్టెన్ పోస్టులో కొన‌సాగుతున్నాడు. అయితే స‌చిన్ చదివింది 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కే.

3. హ‌ర్భ‌జ‌న్‌సింగ్
టీమిండియా క్రికెట‌ర్లు ముద్దుగా భ‌జ్జీ అని పిలుచుకునే ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ పంజాబ్ పోలీస్ విభాగంలో డీఎస్‌పీ పోస్టులో ఉన్నాడు. ఇక భ‌జ్జీ చ‌దివింది సెకండరీ స్కూల్ వ‌ర‌కే.

4. మేరీ కోమ్
బాక్సింగ్ చాంపియ‌న్ మేరీ కోమ్‌కు కూడా పోలీసు విభాగంలోనే పోస్టింగ్ ఇచ్చారు. ఆమె ఇప్పుడు మ‌ణిపూర్ పోలీస్ విభాగంలో డీఎస్‌పీగా ఉన్నారు. ఇక మేరీ కోమ్ చదివింది 8వ త‌ర‌గ‌తి మాత్ర‌మే.

5. క‌పిల్ దేవ్
భార‌త మాజీ క్రికెట‌ర్ క‌పిల్ దేవ్ కూడా ఇండియ‌న్ ఆర్మీలో ఉన్నారు. ఆయ‌న ఆర్మీలో ధోనిలాగే లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ పోస్టులో కొన‌సాగుతున్నారు. ఇక క‌పిల్ చ‌దివింది హై స్కూల్ వ‌ర‌కే.

6. జోగింద‌ర్ శ‌ర్మ
2007 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ లో చివ‌రి ఓవ‌ర్ వేసి భార‌త్ ను గెలిపించిన బౌల‌ర్ జోగింద‌ర్ శ‌ర్మ పోలీసు విభాగంలో ఉన్నాడు. ఇప్పుడిత‌ను హ‌ర్యానా పోలీస్ విభాగంలో డీఎస్‌పీ పోస్టులో కొన‌సాగుతున్నాడు.

7. విజేంద‌ర్ సింగ్
బాక్సింగ్ చాంపియ‌న్ విజేంద‌ర్ సింగ్‌కు పంజాబ్ పోలీసులు డీఎస్‌పీగా పోస్టు ఇచ్చారు. ఇప్పుడు విజేంద‌ర్ ఇదే పోస్టులో ఉన్నాడు. ఇత‌ను డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నాడు.

8. అభిన‌వ్ బింద్రా
షూటింగ్ చాంపియ‌న్ అభినవ్ బింద్రా కూడా ధోని, క‌పిల్‌దేవ్‌ల‌లాగానే ఆర్మీలో ఉన్నాడు. అత‌నికి కూడా లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ పోస్టు ఇచ్చారు. ఈ పోస్టులోనే అత‌ను కొన‌సాగుతున్నాడు. ఇక అభిన‌వ్ బింద్రా కూడా డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నాడు.

Comments

comments

Share this post

scroll to top