వ్యాసుడు చెప్పిన కాలజ్ఞానం గురించి మీకు తెలుసా? ఇంట్రస్టింగ్.

యుగాంతం… ఈ పేరు చెబితే చాలు జ‌నాలు ఎంతో ఆస‌క్తిగా వింటారు. ఈ భూమికి ఎప్పుడు ఎలా ప్ర‌ళ‌యం ముంచుకు వ‌స్తుందోన‌ని, అది ఏ రూపంలో వ‌స్తుందోన‌నే విష‌యాల‌ను తెలుసుకోవ‌డం కోసం ఎవ‌రైనా ఆస‌క్తి చూపిస్తారు. ఈ క్ర‌మంలో కొన్ని సంవ‌త్స‌రాల నుంచి యుగాంతానికి సంబంధించిన పుకార్లు కూడా వ‌చ్చాయి. అయితే అవి నిజం కాలేద‌నుకోండి. అది వేరే విష‌యం. కానీ ఎనాటికో ఓ నాటికీ భూమి మొత్తం అంతం కాక త‌ప్ప‌దని, దానిపై ఉండే జీవ‌జాతి మొత్తం న‌శిస్తుంద‌ని చాలా మంది విశ్వ‌సిస్తున్నారు. అయితే యుగాంతానికి సంబంధించిన పుకార్లు ఎలా ఉన్నా క‌లియుగంలో జ‌రిగే ప‌లు సంఘ‌ట‌న‌లు, విష‌యాల గురించి మాత్రం వేద వ్యాస మ‌హ‌ర్షి ఎప్పుడో చెప్పాడ‌ట‌. వాటిలో ఇప్ప‌టికే కొన్ని సంఘ‌ట‌న‌లు జ‌రిగిపోయాయ‌ని, మిగ‌తావి కూడా క‌చ్చితంగా జ‌రుగుతాయ‌ని పండితులు చెబుతున్నారు. అలా జ‌ర‌గ‌నున్న సంఘ‌ట‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

veda-vyas-predictions

  • హిందువులు అత్యంత ప‌విత్రంగా భావించే ఓ పుణ్యస్థ‌లం మొత్తం నీటితో నిండిపోతుంద‌ట‌. హెయిర్‌స్టైల్‌ను బ‌ట్టే అందం నిర్దార‌ణ‌కు వ‌స్తార‌ట‌. కేవ‌లం తమ సొంత క‌డుపు నిండ‌డ‌మే ల‌క్ష్యంగా మాన‌వులు జీవిస్తార‌ట‌. కుటుంబ క‌ష్టాల‌ను, సంసారాన్ని ఈదే మ‌నుషులు గొప్ప‌వార‌వుతార‌ట‌. మ‌త విశ్వాసాల‌ను పాటించే వారు, పూజ‌లు చేసే వారు కేవ‌లం వాటిని మొక్కుబ‌డి కోస‌మే చేస్తార‌ట‌.
  • దేవుడి గురించే కాదు, ప్ర‌పంచంలోని ఏ విష‌యం గురించి తెలియ‌కున్నా అలాంటి వారే గొప్ప స‌న్యాసులుగా, యోగులుగా, స్వామీజీలుగా కీర్తించ‌బ‌డ‌తార‌ట‌. ప్ర‌జ‌లు, నాయ‌కులు, బ‌డాబాబులు, ధ‌న‌వంతులు వారిన పూజిస్తార‌ట‌.
  • విప‌రీత‌మైన చ‌లి, గాలులు, ఎండ‌, వ‌ర్షాలు, మంచు వంటి ప్ర‌కృతి భీభ‌త్సాలే కాక మ‌నుషులు గొడ‌వ‌లు, ఆక‌లి, దాహం, వ్యాధులు వంటి కార‌ణాల వ‌ల్ల ఎక్కువగా న‌శిస్తార‌ట‌.
  • స్త్రీ, పురుషులు ఇద్ద‌రూ వివాహం చేసుకోకుండానే స‌హ‌జీవ‌నం చేయ‌డం ప్రారంభిస్తార‌ట‌. వ్యాపారాలు చేసే వారికి మోస‌పూరిత‌మైన బుద్ధి బాగా పెరిగిపోతుంద‌ట‌. కేవ‌లం జంధ్యం వేసుకుంటే చాలు, అలాంటి వారిని బ్రాహ్మ‌ణుల‌ని అంటార‌ట‌.
  • మ‌నుషుల మ‌ధ్య తార‌త‌మ్యాలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయ‌ట‌. ఈర్ష్య‌, అసూయ‌, ద్వేషాలు పెరిగిపోతాయ‌ట‌. ప‌క్క వారే కాదు సొంత బంధువులు, కుటుంబ స‌భ్యులే చిన్న గొడ‌వ‌ల‌కే ఒక‌ర్ని ఒక‌రు చంపుకుంటార‌ట‌.
  • ధ‌న‌వంతులుగా పుట్టిన వారికే ఎక్కువ మ‌ర్యాద ద‌క్కుతుంద‌ట‌. పేద వాడికి న్యాయం జ‌ర‌గ‌ద‌ట‌. డ‌బ్బున వారిదే శ‌క్తిగా, వారు ఆడిందే ఆట‌గా మారుతుంద‌ట‌.
  • మనుషులు త‌మ పెద్ద‌వారిని, త‌ల్లిదండ్రుల‌ను అస్స‌లు గౌర‌వించ‌ర‌ట‌. వారిని వృద్ధాప్యంలో దూరం చేస్తార‌ట‌.
  • క‌లియుగంలో క‌లి ప్ర‌భావం వ‌ల్ల మ‌తం, నిజాయితీ, నీతి, శుభ్ర‌త‌, స‌హ‌నం, ఓర్పు, ద‌య‌, జీవిత ప్ర‌మాణ కాలం, శారీర‌క శ‌క్తి, జ్ఞాప‌క‌శ‌క్తి వంటివ‌న్నీ రోజు రోజుకీ త‌గ్గిపోతాయ‌ట‌. చివ‌ర‌కి మ‌నిషి ప‌త‌న‌మ‌వుతాడ‌ట‌.
  • దొంగ‌ల‌దే సామ్రాజ్యం అవుతుంద‌ట‌. వారు అన్ని ప్ర‌దేశాల‌ను పంచుకుంటార‌ట‌. రాజ‌కీయ నాయ‌కుల్లో అవినీతి పెచ్చ‌రిల్లుతుంద‌ట‌. వారు ప్ర‌జ‌ల‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోర‌ట‌. వారు కేవ‌లం బాబాజీల‌ను మాత్ర‌మే న‌మ్ముతార‌ట‌.
  • ఎవ‌రు ఏ మ‌తానికి చెందుతారో తెలుసుకోవ‌డం కోసం ప్ర‌త్యేకంగా గుర్తులు, చిహ్నాలు ధ‌రించాల్సి వ‌స్తుంద‌ట‌. మ‌నిషి త‌న జీవితం గ‌డ‌వ‌డం కోసం ధ‌నం సంపాదించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంద‌ట‌. బాగా మేథ‌స్సు ఉన్న‌వారు గొప్ప‌వారిగా పేరు తెచ్చుకుంటార‌ట‌.

Comments

comments

Share this post

scroll to top