ఆ ఇడ్లీల‌ను మీరు ఒక‌సారి టేస్ట్ చేస్తే… ఇక ఎప్పటికీ అవే కావాలంటారు..!

వేడి వేడిగా అప్పుడే దించిన ఇడ్లీలు… అందులోకి కొద్దిగా కారంపొడి, దాంట్లో కొంచెం నెయ్యి, కొద్దిగా కొబ్బ‌రి ప‌చ్చ‌డి లేదా ప‌ల్లీల చ‌ట్నీ. కొంచెం సాంబార్‌..! ఇవి ఉంటే చాలు… ఇడ్లీల‌ను ఎవ‌రైనా ఎంజాయ్ చేస్తారు. వేడి వేడిగా ఈ ప‌దార్థాల‌న్నీ నోరు ద్వారా గొంతు దిగుతుంటే… అబ్బో… వారెవ్వా… ఆ మ‌జాయే వేరు క‌దా..! మ‌రి… ఇలాంటి సాధార‌ణ ఇడ్లీల‌కే మీకు నోరు అంత ఊరుతుంటే… ఇక ఆ ప్రాంతంలో స్పెష‌ల్‌గా వండే ఇడ్లీల పేరు చెబితే… మీరు వాటి కోస‌మే అంత దూరం వెళ్లి తిని వ‌స్తారు..! అవును, మేం చెబుతోంది నిజ‌మే. అంత‌టి ప్ర‌త్యేక‌త ఆ ఇడ్లీల్లో ఉంది మ‌రి..! ఇంత‌కీ ఆ ఇడ్లీలు ఎక్క‌డ దొరుకుతాయో తెలుసా..?

palakkad-idli

saraswathy-tea-stall
అది కేర‌ళ రాష్ట్రంలోని పాల‌క్క‌డ్ జిల్లా రామ‌స్సెరి గ్రామం. అక్క‌డే స‌ర‌స్వ‌తి టీ స్టాల్ అని ఓ చిన్న‌పాటి హోట‌ల్ ఉంటుంది. అది పేరుకే టీ స్టాల్ కానీ, అందులో పైన చెప్పిన విధంగా ఉండే నోరూరించే ఇడ్లీలు దొరుకుతాయి. వాటిని ఆ హోట‌ల్ వారు ఎలా త‌యారు చేస్తారో తెలుసా..? ప‌్ర‌త్యేకంగా త‌యారు చేసిన పిండిని వ‌స్త్రంపై కొద్దిగా ఎడంగా పోసి అనంత‌రం ఆ వ‌స్త్రాల‌న్నింటినీ ఒక పాత్ర‌లో ఉంచుతారు. దానిపై మ‌రో పాత్ర‌ను బోర్లిస్తారు. ఆ పాత్ర‌లు మ‌ట్టితో చేసిన‌వే. అనంత‌రం వాటిని పొయ్యిపై ఉంచి ఉడికిస్తారు. పొయ్యిలో వారు చింత చెట్టు క‌ల‌ప‌ను మంట కోసం వాడుతారు. దీంతో ఆ ఇడ్లీలు త‌యార‌వుతాయి. అలా త‌యారైన ఇడ్లీల‌తో ఆ హోట‌ల్ వారు కారంపొడి, కొబ్బ‌రి చ‌ట్నీ, సాంబారు ఇస్తారు. అలా ఆ ఇడ్లీల‌ను ఎంచ‌క్కా ఎవ‌రైనా ఆర‌గించ‌వ‌చ్చు. అయితే వాటి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా..?  పైనే చెప్పాం క‌దా..! వాటి కోసం మీరు అంత దూరం వ‌ర‌కైనా వెళ్తార‌ని, అవును, ఆ ఇడ్లీల టేస్ట్ అంత బాగుంటుంది మ‌రి..!

idli-making

idli-making-1
నిజానికి ఆ హోట‌ల్ వారిది ఒక‌ప్పుడు త‌మిళ‌నాడు రాష్ట్రమ‌ట‌. వారు బ్ర‌తుకు దెరువు నిమిత్తం కేర‌ళ‌కు వ‌చ్చి అలా ప్ర‌త్యేక‌మైన రెసిపి స‌హాయంతో ఇడ్లీల‌ను వండ‌డం స్టార్ట్ చేశారు. దీంతో వారి బిజినెస్ దిన దిన ప్ర‌వ‌ర్థ‌మానం ఎదిగిపోయింది. ఇప్పుడు వారికి ఆ గ్రామం చుట్టు ప‌క్క‌ల అలాంటివే మ‌రో నాలుగు స్టాల్స్ ఉన్నాయి. అన్నింట్లోనూ వారు ఇడ్లీల‌ను అచ్చం ఇలాగే ఏ మాత్రం టేస్ట్ పోకుండా, సేమ్ సైజ్‌తో వండి పెడ‌తారు. అయితే వారి ఇడ్లీల్లో వాడే ప‌దార్థాలేంటో ఇప్ప‌టికీ ర‌హ‌స్య‌మే. దాన్ని ఎవ‌రూ చెప్ప‌లేరు, క‌నుక్కోలేరు. ఈ క్ర‌మంలో వారు రోజుకు ఒక్కో స్టాల్ ద్వారా దాదాపుగా 500 నుంచి 2వేల వ‌ర‌కు ఇడ్లీల‌ను అమ్ముతారు. పండుగ రోజుల్లో అయితే ఆ సంఖ్య 15వేల వ‌ర‌కు ఉంటుందంటే న‌మ్మ‌గ‌ల‌రా..! చాలా మంది ఆర్డ‌ర్ల ద్వారా ఫంక్ష‌న్ల కోసం కూడా ఇడ్లీల‌ను చేయించుకుంటారు. అదీ… ఆ ఇడ్లీల మ‌హిమ‌. మీలో ఎవ‌రైనా అటు వెళ్తే క‌చ్చితంగా ఓ సారి ఆ ఇడ్లీల‌ను టేస్ట్ చేయ‌డం మాత్రం మ‌రువ‌కండి..!

Comments

comments

Share this post

scroll to top