ముగ్గురు యువతులు…కార్ లో మాధురీదీక్షిత్ పాటలకు అదరగొట్టారు.( Watch Video)

ఏక్ దో తీన్… చార్ పాంచ్ ఛే… సాత్ ఆఠ్ నౌ… , ధ‌క్ ధ‌క్‌… , ఛోళీ కే పీఛే క్యా హై… , చ‌న్నే కే ఖేత్‌… ఏంటివ‌న్నీ అనుకుంటున్నారా..? అవేనండీ ప్ర‌ముఖ హిందీ సినిమా పాట‌లివి. అయితే వీటి గురించి ఇప్పుడెందుకు అంటారా..? అవును, మీరు అడుగుతోంది క‌రెక్టే. అయితే నిజంగా ఈ పాటల గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఉంది. అదేమిటంటే… ఈ పాట‌లన్నింటినీ ఒక సారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించారా..? గ‌మ‌నిస్తే మీకో విష‌యం అర్థ‌మ‌వుతుంది. అదేనండీ, ఈ పాట‌ల‌న్నింటిలోనూ ఒకే హీరోయిన్ కామ‌న్‌గా ఉంటుంది. ఆమె ఎవ‌రో ఇప్ప‌టికైనా తెలుసుకున్నారు క‌దా..! ఆమే… మాధురీ దీక్షిత్‌.

madhuri-dixit-mime

ఇప్పుడంటే చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్‌ను ఏలుతున్నారు కానీ, ఒక‌ప్పుడు మాధురీ దీక్షిత్ ఆ ఇండ‌స్ట్రీలో పెను సంచ‌న‌ల‌న‌మే సృష్టించింది. ఆమె న‌టించిన అనేక చిత్రాలు హిట్ అవ‌డంతో మంచి న‌టిగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. న‌ట‌నే కాదు, డాన్స్ చేయ‌డంలోనూ ఈమెది అందెవేసిన చేయి. అంత అద్భుతంగా నర్తిస్తుంది. అందుకే చాలా మంది ఈమెకు ఫ్యాన్లుగా మారిపోయారు. అయితే ఇప్పుడు ఆమె సినిమాల్లో న‌టించ‌కపోయినా నేటికీ ఆమె డ్యాన్స్ చేసిన పాట‌లు చాలా వ‌ర‌కు ప్ర‌చారంలో ఉన్నాయి. అనేక మంది వాటికి ఫిదా అయిపోయి ఇప్ప‌టికీ వాటిని ఏదో ఒక సంద‌ర్భంలో వింటూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు యువ‌తులు ఆమె పాట‌ల‌తో ఓ బాలీవుడ్ మైమ్ త్రూ చేసి యూట్యూబ్‌లో పెట్టారు.

పైన కొన్ని పాట‌లు చెప్పాం కదా, వాటితోపాటు మ‌రికొన్ని మాధురీ దీక్షిత్ పాట‌ల‌ను జ‌త చేసి వాట‌న్నింటినీ వ‌రుస క్ర‌మంలో ప్లే చేస్తూ అందుకు త‌గిన విధంగా గెట‌ప్‌లను కూడా మార్చుకుంటూ కారులో త‌మ‌దైన శైలిలో షీలా, నేహా, స‌హ్లీన్ అనే ముగ్గురు యువ‌తులు డ్యాన్స్ చేస్తూ ఓ బాలీవుడ్ మైమ్ త్రూ వీడియోను చేశారు. దాన్ని యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేశారు. ఇప్పుడా వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చల్ సృష్టిస్తోంది. దానిపై మీరూ ఓ లుక్కేయండి..!

Comments

comments

Share this post

scroll to top