ఈ 8 మంది పిల్లలు తమ బాల్యాన్ని గురించి ఏం చెప్పారో వినండి.! బాల్యం ఇంత భయానకమా?

ప‌సిప్రాయ‌మంటే ఎవ‌రికైనా ఇష్ట‌మే. ఆ వ‌య‌స్సులో పిల్ల‌లు చేసే అల్ల‌రి అంతా ఇంతా కాదు. వారి ముద్దు, ముద్దు మాట‌లు, అల్ల‌రి చిల్ల‌రి చేష్ట‌లు అన్నీ చూసి పెద్ద‌లు సంబ‌ర ప‌డుతుంటారు. అయితే పిల్ల‌లంద‌రి జీవితం ఒకేలా ఉండదు. కొంద‌రు ఆ వ‌య‌స్సులో త‌ల్లిదండ్రులు, బంధువులు లేదా పొరుగువారి వ‌ల్లో వివిధ ర‌కాలుగా హింస‌కు, దాడికి గుర‌వుతుంటారు. అలాంటి వారు పెరిగి పెద్ద‌య్యాక కూడా వారికి ఉన్న భ‌యాలు పోవు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా దాదాపుగా అలాంటి చిన్నారుల గురించే. వారు త‌మ ప‌సిప్రాయంలో ఎలాంటి హింస‌ల‌కు, దాడుల‌కు గుర‌య్యారో ఇది చ‌దివితే తెలుస్తుంది.

children-abuse

  • ఫియోనా అనే ఓ బాలిక అనేక ఏళ్లుగా మాన‌సిక దాడికి, హింస‌కు గురైంది. త‌న స‌వ‌తి తండ్రి త‌న త‌ల్లితోపాటు త‌న‌నూ చిత్ర హింసలు పెట్టేవాడు. దీంతో అనేక ఏళ్ల పాటు ఆమె భ‌యంతో, అభ‌ద్ర‌తా భావంతో గ‌డిపింది. త‌రువాత కొన్నేళ్ల‌కు ఓ స్వ‌చ్ఛంద సంస్థ వారు ఆమెకు విముక్తి క‌లిగించారు.
  • అలిస్ అనే మ‌రో బాలిక 10 ఏళ్ల పాటు త‌న బంధువు ఒక‌రి చేతిలో లైంగిక దాడికి గురైంది. త‌న‌కు ఏం జ‌రుగుతుందో కూడా తెలియ‌ని స్థితిలో ఆ పాప అల్లాడిపోయింది. 10 ఏళ్ల త‌రువాత ఆమె గురించి బ‌య‌ట‌కు తెలియ‌డంతో ఓ స్వ‌చ్ఛంద సంస్థ ఆమెను చేర‌దీసింది.
  • సోఫీ అనే బాలిక డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డిన త‌న త‌ల్లిదండ్రుల చేతిలో చిత్ర‌హింస‌ల‌కు గురైంది. ఆమెను వారు నిర్లక్ష్యం చేశారు. వారితో ఉన్నంత కాలం ఆమె భ‌యభ్రాంతుల‌తో జీవితం గ‌డిపింది. అనంత‌రం ఓ సంస్థ స‌హ‌కారంతో విముక్తురాలైంది.
  • క్లేర్ అనే బాలిక త‌న సొంత సోద‌రుని చేతిలోనే లైంగిక దాడికి గురైంది. తల్లిదండ్రులు విడాకులు తీసుకోవ‌డంతో సోద‌రుని వ‌ద్ద ఆమె ఉండాల్సి వ‌చ్చింది. దీంతో అత‌ను ఆమెను లైంగికంగా వేధింపుల‌కు గురి చేశాడు. ఈ క్ర‌మంలో 3 ఏళ్ల పాటు ఆమె అలా భ‌యంతో జీవ‌నం సాగించింది. అనంత‌రం ఓ స్వ‌చ్ఛంద సంస్థ ఆమెను ర‌క్షించింది.
  • రావెన్ క‌లియానా అనే బాలికను ఆమె త‌ల్లిదండ్రులే డ‌బ్బుల కోసం ఓ ఫొటోగ్రాఫ‌ర్‌కు అమ్మేశారు. అయితే ఆ ఫొటోగ్రాఫ‌ర్ ఆమెను లైంగికంగా వేధిస్తూ తాను చేస్తున్న‌దంతా కెమెరాల్లో రికార్డ్ చేసేవాడు. కాగా ఓ సంస్థ స‌హ‌కారంతో ఆమె ఎట్ట‌కేల‌కు అత‌ని చెర నుంచి త‌ప్పించుకుంది. అప్పుడు ఆమెకు 4 ఏళ్లు. అయితే ఇప్పుడామె అలాంటి లైంగిక దాడుల‌కు వ్య‌తిరేకంగా పోరాటాలు చేస్తోంది.
  • రియా అనే బాలిక కూడా 13 ఏళ్ల వ‌య‌స్సులో లైంగిక దాడికి గురైంది. ఇంటి నుంచి పారిపోయిన ఆమెను కొంద‌రు దుండ‌గులు లైంగికంగా వాడుకున్నారు. కొద్ది రోజుల‌కు ఓ సంస్థ త‌న‌ను ర‌క్షించింది.
  • పీట్ అనే బాలున్ని త‌న త‌ల్లే చిత్ర‌హింస‌లు పెట్టింది. తండ్రి ఇంట్లో లేని స‌మ‌యం చూసి ఆమె అత‌న్ని దెబ్బ‌లు కొట్టేది. త‌ల‌ను నీటిలో ముంచేది. స‌బ్బు మొత్తం నోట్లో కుక్కేది. ఓ సంస్థ ర‌క్షించిన నేప‌థ్యంలో ఆ బాలుడే స్వ‌యంగా ఈ విష‌యాల‌ను తెలియ‌జేశాడు.
  • గెమ్మా అనే బాలిక‌ను ఆమె తండ్రే లైంగికంగా వేధించాడు. కొన్నేళ్ల పాటు ఆమె అలా బాధ‌ను ఎదుర్కొంది. అనంత‌రం ఓ స్వ‌చ్ఛంద సంస్థ ఆమెను ర‌క్షించింది.

Comments

comments

Share this post

scroll to top