ఆ చాక్ పీసులు రాయ‌డ‌మే కాదు, చేతుల‌నూ శుభ్రం చేస్తాయి..!

నేడు మ‌న దేశంలో చిన్నారులు ఎదుర్కొంటున్న అతి పెద్ద స‌మ‌స్య‌ల్లో ఒక‌టి ప‌రిశుభ్ర‌త‌. నిత్యం వారు దూక‌డం, గెంత‌డం, మ‌ట్టిలో ఆడుకోవ‌డం అంతా స‌హ‌జమే. ఈ క్ర‌మంలో మ‌న ద‌గ్గ‌రుంటే చేతులు క‌డిగించి మ‌రీ తిన‌బెడ‌తాం. కానీ వారు మ‌న‌కు దూరంగా అంటే స్కూల్‌లో ఉంటే..? అప్పుడు శుభ్రత గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోరు. చేతులు కడ‌గ‌కుండానే ఆహారం తినేస్తారు. అలా తింటుండ‌డం వ‌ల్లే డ‌యేరియా, న్యుమోనియా వంటి అనేక వ్యాధులు పిల్ల‌ల‌కు వ‌స్తున్నాయి. ఆ కార‌ణంగా ఏటా 18 ల‌క్ష‌ల మంది మృతి చెందుతున్నారు కూడా. ఈ క్ర‌మంలో వారు కేవ‌లం చేతుల‌ను శుభ్రంగా క‌డుక్కొని ఆహారం తినేలా చూస్తే చాలు, ఇలాంటి ఎంద‌రో చిన్నారుల‌ను అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా, మృతి చెంద‌కుండా చూడ‌వ‌చ్చు.

savlon-1

 అయితే ముందే చెప్పాం క‌దా… మ‌నం ద‌గ్గ‌ర ఉంటే ఓకే కానీ వారు స్కూల్‌లో ఉంటేనే అస‌లు స‌మ‌స్య ఎదుర‌వుతుంది. అప్పుడు వారు క‌నీస శుభ్ర‌త కూడా పాటించ‌కుండానే తింటారు. అయితే అలాంటి సంద‌ర్భాల్లో కూడా వారు సుర‌క్షితంగా ఆహారం భుజించేలా చేయడానికే ఆ సంస్థ ముందుకు వ‌చ్చింది. ఆ సంస్థ పేరు సావ్లాన్‌. ఇది స్వచ్చంద సంస్థ కాదు. శానిటరీ ఉత్ప‌త్తులు, స‌బ్బుల వంటి వ‌స్తువుల‌ను త‌యారు చేస్తుంది. అయినా పిల్ల‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. అదేమిటంటే…

savlon-2

 సాధార‌ణంగా స్కూల్స్‌లో పిల్ల‌లు చాక్ పీస్ లేదా బ‌ల‌పంతో ప‌ల‌కల‌పై, బోర్డుల‌పై రాస్తారు క‌దా. అయితే ఆ చాక్ పీసుల‌ను వాడితే చేతుల‌కు అంతా సుద్ద అంటుతుంది. దాంతో ఆ సుద్ద‌ను శుభ్రంగా క‌డిగేయాల్సి ఉంటుంది. అయితే సావ్లాన్ ఏం చేసిందంటే వారు వాడే చాక్ పీసుల‌నే శానిట‌రీ ఉత్ప‌త్తిగా త‌యారు చేసింది. అంటే అవి చాక్ పీసులే. వాడినంత సేపు రాస్తాయి. అయితే వాటిని వాడాక ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టుగా సుద్ద అంటుకుంటుంది క‌దా. అదే సుద్ద ఈ చాక్‌పీసుల ద్వారా కూడా చేతుల‌కు అంటుకుంటుంది. కానీ అది పిల్ల‌ల‌కు మంచిదే. ఎందుకంటే ఆ సుద్ద‌ను అలాగే ఉంచి న‌ల్లా కింద చేయి పెడితే చాలు, దాంతో ఆ సుద్ద నీరు తాక‌గానే నురుగుగా మారి చేతుల‌ను శుభ్రం చేసేస్తుంది. సావ్లాన్ చేసిన ఆలోచ‌న భ‌లేగా ఉంది క‌దా..! ఈ సంస్థ ఇప్పుడు అలాంటి చాక్ పీస్‌ల‌ను దాదాపుగా 3 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే పిల్ల‌ల‌కు ఉచితంగా పంపిణీ చేసింది. త్వ‌ర‌లో మ‌రిన్ని పంపిణీ చేయ‌నుంది. ఏది ఏమైనా, పిల్ల‌ల ఆరోగ్యం దృష్ట్యా వారికి ఇలాంటి చాక్ పీసులు ఎంత‌గానో మేలు చేస్తాయి క‌దా..!

Comments

comments

Share this post

scroll to top