మ‌తం మార్చుకున్న బాలీవుడ్ సెలబ్రిటీలు వీరే తెలుసా..?

మ‌న దేశంలోనే కాదు ప్ర‌పంచంలోని ఏ ప్రాంతంలో ఉన్న వ్య‌క్తికైనా త‌న ఇష్టం మేర‌కు త‌న‌కు న‌చ్చిన మ‌తంలోకి మారేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ఇక భార‌త్‌లోనైతే రాజ్యాంగం మ‌న‌కు ఆ హ‌క్కును క‌ల్పించింది. ఈ క్ర‌మంలోనే చాలా మ‌ది త‌మకు ఇష్టమొచ్చిన మ‌తంలోకి మారుతారు. అందుకు అనేక కార‌ణాలు కూడా ఉంటాయి. అయితే సాధారణ ప్ర‌జ‌లే కాదండి, ప‌లువురు సెల‌బ్రిటీలు కూడా మ‌తం మార్చుకున్న వారి జాబితాలో ఉన్నారు. కొంద‌రు పెళ్లి కోసం మ‌తం మార్చుకుంటే కొంద‌రు దేవుడికి మొక్కామ‌ని మార్చుకున్నారు. మ‌రి వారు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. ఏఆర్ రెహ‌మాన్
ఏఆర్ రెహ‌మాన్ (అల్లా ర‌ఖా ర‌హ‌మాన్‌) అస‌లు పేరు ఏఎస్ దిలీప్ కుమార్. ఇత‌ను తొలుత హిందువే. అయితే ఇత‌ని త‌ల్లి ముస్లిం. హిందువును పెళ్లి చేసుకుని హిందూ మ‌తంలోకి మారింది. ఈ క్ర‌మంలో రెహ‌మాన్ సోద‌రికి ఒక సారి తీవ్ర‌మైన అస్వ‌స్థ‌త క‌లిగి అనారోగ్యం పాలైంది. దీంతో రెహ‌మాన్ త‌ల్లి సాయంతో ప‌విత్ర ఖురాన్ మంత్రాల‌ను ప‌ఠించాడు. అలా చేసే స‌రికి కొన్ని రోజుల‌కు రెహ‌మాన్ సోద‌రి మ‌ళ్లీ మామూలు మ‌నిషైంద‌ట‌. దీంతో రెహ‌మాన్ హిందూ మ‌తం వ‌దిలి ముస్లిం మ‌తంలోకి మారాడు. పేరు కూడా మార్చుకున్నాడు. ఆ త‌రువాత పాపుల‌ర్ అయ్యాడు.

2. ధ‌ర్మేంద్ర
న‌టి హేమ‌మాలినిని రెండో పెళ్లి చేసుకునేందుకు న‌టుడు ధ‌ర్మేంద్ర ఇస్లాంలోకి మారాడు. అయితే అలా మారినందుకు ధ‌ర్మేంద్ర మొద‌టి భార్య ఒప్పుకోలేద‌ట‌. ఆ కార‌ణంగానే ఆమెకు ధ‌ర్మేంద్ర విడాకులు ఇవ్వ‌గా, తొలుత ఆమె విడాకుల‌కు అంగీక‌రించ‌లేదు. త‌రువాత ఎలాగో అత‌ను హేమ‌మాలినిని పెళ్లి చేసుకున్నాడు.

3. నర్గిస్ ద‌త్
న‌ర్గిస్ ద‌త్ ముస్లిం కుటుంబంలో జ‌న్మించింది. న‌టుడు సునీల్ ద‌త్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆమె హిందూ మ‌తంలోకి మారింది. అలా మారిన క్ర‌మంలో ఆమె త‌న పేరును నిర్మ‌ల‌గా మార్చుకుంది. అయినా ఆ పేరును జ‌నాలు వాడ‌లేదు. ఆమెను న‌ర్గిస్ ద‌త్ అనే పిలిచారు.

4. ష‌ర్మిళా టాగోర్
ష‌ర్మిళా టాగోర్ హిందు. ఆమె అప్ప‌ట్లో క్రికెట‌ర్ మ‌న్సూర్ అలీ ఖాన్ పటౌడీని ఇష్ట‌ప‌డింది. అతన్ని పె్ళ్లి చేసుకునేందుకు ముస్లిం మ‌తంలోకి మారింది. త‌న పేరును బేగం ఆయేషాగా మార్చుకుంది.

5. అమృతా సింగ్
అమృతా సింగ్ సిక్కు కుటుంబంలో జ‌న్మించింది. న‌టుడు సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకునేందుకు ఆమె ఇస్లాంలోకి మారింది. అయితే అందుకు ఆమె త‌ల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అయినా వారు పెద్ద‌ల‌ను కాద‌ని పెళ్లి చేసుకున్నారు.

6. ఆయేషా ట‌కియా
2009వ సంవ‌త్స‌రంలో న‌టి ఆయేషా టకియా ముస్లిం యువ‌కుడు ఫ‌ర్హాన్ అజ్మీని వివాహం చేసుకుంది. అయితే అత‌న్ని వివాహం చేసుకునేందుకు గాను ఆమె ముస్లిం మ‌తంలోకి మారిన‌ట్టు తెలిసింది. కానీ ఆ వివ‌రాలు ప‌క్కాగా తెలియ‌వు.

7. సుజానె
సుజానె ముస్లిం కుటుంబంలో జన్మించింది. న‌టుడు హృతిక్ రోష‌న్‌ను వివాహం చేసుకునేందుకు హిందూ మ‌తంలోకి మారింది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రికీ పెళ్ల‌యి ఇద్ద‌రు కుమారులు కూడా క‌లిగారు. అయితే వీరు 2014 నవంబ‌ర్ 1వ తేదీన విడిపోయారు.

8. మెహ‌ర్ జెస్సియా
మెహ‌ర్ జెస్సియా పార్సీ కుటుంబంలో జ‌న్మించింది. న‌టుడు అర్జున్ రాంపాల్‌ను వివాహం చేసుకునేందుకు హిందూ మ‌తంలోకి మారింది. ఈమె 1986లో మిస్ ఇండియా యూనివ‌ర్స్‌గా ఎంపిక‌వ‌డం విశేషం.

Comments

comments

Share this post

scroll to top