మొబైల్ మార్కెట్ ను షేక్ చేయ‌డానికి రాబోతున్న 11 కొత్త మోడ‌ల్స్.. స్టైల్ , ఫీచ‌ర్స్ అదుర్స్.!!

స్మార్ట్‌ఫోన్లు..! నేటి త‌రుణంలో ఇవి చాలా కామ‌న్ అయిపోయాయి. రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుద‌ల‌వుతుండ‌డంతో జ‌నాలు కూడా దేన్ని కొనాలో ఇట్టే డిసైడ్ చేసుకోలేక‌పోతున్నారు. కానీ… చాలా మంది యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ఫోన్లు మాత్రం ఎప్పుడో ఒక‌సారి విడుద‌ల‌వుతుంటాయి. దీంతో అలాంటి వాటి ప‌ట్ల యూజ‌ర్లు స‌హజంగానే ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు. మ‌రి… అలా యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ఫోన్ల‌న్నీ ఒకేసారి విడుద‌లైతే..! అవును, అదే జ‌రిగింది..! అందుకు స్పెయిన్ దేశంలోని బార్సిలోనా న‌గ‌రం వేదికైంది. అక్క‌డ తాజాగా మొబైల్ వ‌ర‌ల్డ్ కాంగ్రెస్ 2017 ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. అందులో యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు క‌లిగిన అనేక స్మార్ట్‌ఫోన్ల‌ను ఆయా కంపెనీలు విడుద‌ల చేశాయి. మ‌రి వాటిలో టాప్ స్థానాల్లో నిలిచిన ఫోన్లేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

nokia-3310

నోకియా 3310…
ఒక‌ప్ప‌టి నోకియా 3310 ఫోన్‌కు అనేక మార్పులు చేర్పులు చేసి నోకియా సంస్థ దీన్ని విడుద‌ల చేసింది. ఇందులో 2.4 ఇంచ్ పోల‌రైజ్డ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 2 మెగాపిక్స‌ల్ కెమెరా, 16 ఎంబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్, 2జీ, సింగిల్‌/డ‌్యుయ‌ల్ సిమ్, నోకియా సిరీస్ 30+ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, బ్లూటూత్ 3.0, ఎఫ్ఎం రేడియో, 1200 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 31 రోజుల స్టాండ్ బై టైం, 22 గంట‌ల టాక్‌టైం, 51 గంట‌ల మ్యూజిక్ ప్లేబ్యాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధ‌ర రూ.3500.

sony-xperia-xa-1-ultra

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ1 అల్ట్రా…
సోనీ విడుద‌ల చేసిన ఈ ఫోన్‌లో 6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 2.3 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 23, 16 మెగాపిక్సల్ కెమెరాలు, 4జీ ఎల్‌టీఈ, ఎన్‌ఎఫ్‌సీ, 2700 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధరను వెల్ల‌డించ‌లేదు.

lg-g6

ఎల్‌జీ జీ6…
ఎల్‌జీ సంస్థ విడుద‌ల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0 వంటి ఫీచ‌ర్లు ఉన్నాయి. దీని ధ‌ర‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు.

moto-g5-plus

మోటో జీ5 ప్లస్…
5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, టర్బో చార్జింగ్ వంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని ధ‌ర రూ.19,630.

huawei-p10-plus

హువావే పీ10 ప్లస్…
5.5 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ కైరిన్ 960 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 20, 12 మెగాపిక్సల్ డ్యుయల్ రియర్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్లు దీంట్లో ఉన్నాయి. ధ‌ర రూ.56వేలు.

xperia-xz-premium

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జ‌డ్ ప్రీమియం…
5.5 ఇంచ్ 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్, డ్యుయ‌ల్ సిమ్‌, వాట‌ర్ రెసిస్టెన్స్‌, 19, 13 మెగాపిక్స‌ల్ కెమెరాలు, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 4జీ ఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3230 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0 వంటి ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని ధ‌రను వెల్ల‌డించ‌లేదు.

black-berry-key-one

బ్లాక్‌బెర్రీ కీ వన్…
4.5 ఇంచ్ డిస్‌ప్లే, స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, క్వర్టీ బ్యాక్‌లిట్ కీ బోర్డ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 4జీ ఎల్‌టీఈ, 12, 8 మెగాపిక్సల్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3505 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0 వంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధ‌ర రూ.36,590.

nokia-3

నోకియా 3…
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమోరీ, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, 8, 8 మెగాపిక్సల్ కెమెరాలు, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 2650 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. ధ‌ర రూ.9,780.

nokia-5

నోకియా 5…
5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 13, 8 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచ‌ర్లు నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. దీని ధ‌ర రూ.13,300.

nokia-6

నోకియా 6…
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచ‌ర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. ధ‌ర రూ.16,117.

Comments

comments

Share this post

scroll to top