ఉద‌యం నిద్ర‌లేవ‌గానే వేటిని చూడ‌కూడదో, వేటిని చూడాలో మీకు తెలుసా..?

అబ్బా… ఈ రోజేంట్రా బాబూ… ఇలా జ‌రుగుతోంది… ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి అంతా బ్యాడ్ టైం న‌డుస్తోంది. పొద్దున్నే ఎవ‌రి ముఖం చూశామో ఏమో..! ఇదీ… ఎవ‌రికైనా ఏదైనా రోజంతా బాగా గ‌డ‌వ‌క‌పోయినా, అన్నీ స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నా, క‌ష్టాలు ప‌డుతున్నా… ఇంకా ఏమైనా ఇబ్బందులు క‌లుగుతున్నా… అనుకునే మాట‌..! అవును మ‌రి… ఇప్ప‌టికీ ఇలాంటి వాటిని న‌మ్మేవారు చాలా మందే ఉన్నారు లెండి. అయితే ఇంత‌కీ… పెద్ద‌లు, మ‌న పురాణాలు చెబుతున్న దాని ప్ర‌కార‌మైతే అస‌లు ఉద‌యం లేవ‌గానే వేటి చూస్తే మంచిదో, వేటి వ‌ల్ల మ‌న‌కు శుభం క‌లుగుతుందో, వేటిని చూడ‌డం వ‌ల్ల క‌ష్టాలు, స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయో, అమంగ‌ళ‌క‌ర‌మో ఇప్పుడు తెలుసుకుందామా..!

things-to-see-1
1. నిద్ర‌లేవ‌గానే వేద మంత్రాలు చదువుతున్న ఉత్త‌మ బ్రాహ్మ‌ణున్ని, అదృష్ట‌వంతున్ని చూస్తే మంచిది. వారి అదృష్టం మ‌న‌కు కూడా ప‌డుతుందంటారు పెద్ద‌లు.

2. గోవును గానీ, తుల‌సి మొక్క‌ను గానీ చూస్తే చాలా శుభం జ‌రుగుతుంది. ఎందుకంటే గోవులో, తుల‌సి మొక్క‌లో దేవ‌త‌లు ఉంటారు కాబ‌ట్టి.

things-to-see-2
3. అగ్నిని చూసినా, దీపాన్ని చూసినా, య‌జ్ఞం చేసే వారిని చూసినా శుభం క‌లుగుతుంది. అవి మంగ‌ళ‌క‌రానికి చిహ్నాలుగా భావిస్తారు.

4. మ‌న‌కు అత్యంత అందుబాటులో ఉండే అద్దంలో మ‌న రూపాన్ని చూసినా, మ‌న అర‌చేతుల్ని మ‌నం చూసుకున్నా మంచే జ‌రుగుతుంద‌ని అంటారు.

5. బంగారం, సూర్యుడు, ఎర్ర చంద‌నంల‌ను చూసినా మ‌న‌కు ఆ రోజంతా మంచే జ‌రుగుతుంద‌ట‌.

things-to-see-3
6. స‌ముద్రం, గుడి గోపురం, ప‌ర్వతం వంటి వాటిని చూసినా మ‌న‌కు శుభ‌మే జ‌రుగుతుంది.

7. దూడ‌తో ఉన్న ఆవు లేదా పురుషులు త‌మ భార్య‌ల‌ను తాము చూసుకున్నా మంచే క‌లుగుతుంద‌ట‌.

ఉద‌యం లేవ‌గానే వేటిని చూడ‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.
1. పాపం చేసే వారిని, దుర‌దృష్ట‌వంతుల‌ను చూడ‌రాదు. చూస్తే మ‌న‌కు ఆ ద‌రిద్రం అంటుకుంటుంది.

2. గుడ్డి వాళ్ల‌ను, భ‌ర్తను కోల్పోయిన స్త్రీల‌ను, ముక్కు లేని వారిని చూడ‌డం అశుభానికి సంకేతంగా భావిస్తారు.

3. జుట్టు విర‌బోసుకుని ఉన్న స్త్రీల‌ను, బొట్టులేని ఆడ‌పిల్ల‌ను చూడ‌రాదు.

4. క్రూర జంతువులు లేదా వాటి చిత్ర‌ప‌టాల‌ను చూడ‌కూడ‌దు.

5. శుభ్రంగా లేని పాత్ర‌లు, గిన్నెల‌ను కూడా చూడ‌కూడ‌ద‌ని, చూస్తే అరిష్టం క‌లుగుతుంద‌ని అంటారు.

Comments

comments

Share this post

scroll to top