తల్లి కాబోతున్నా… అని తెలిస్తే చాలు, అలాంటి మహిళలకు ఎంతగానో ఆనందం కలుగుతుంది. అయితే కడుపులో పెరిగే బిడ్డ ఆడో, మగో తెలుసుకోవాలన్న కుతూహలం కూడా వారికి ఉంటుంది. వారికే కాదు, ఆ మహిళల భర్తలకు, ఇంట్లో ఉన్నవారికి క్యూరియాసిటీగానే ఉంటుంది. అయితే గర్భస్థ శిశువు లింగ నిర్దారణ పరీక్షలు చేయడం మన దగ్గర నిషేధం. కానీ అలా సైంటిఫిక్గా టెస్ట్ చేయకుండానే పలు విధానాల్లో గర్భస్థ శిశువు ఆడో, మగో తెలుసుకోవచ్చు. ఆడపిల్ల, మగపిల్లవాడు ఎవరైనా మాకు ఓకే, కేవలం కుతూహలం కోసమే తెలుసుకోవాలనుకుంటున్నాం… అని అనుకునే వారు కింది విధానాల ద్వారా తమకు పుట్టబోయే బిడ్డ ఆడో, మగో ఇట్టే తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..!
బిడ్డ హార్ట్ రేట్…
గర్భాశయంలో ఉన్న శిశువు అమ్మాయి అయితే హార్ట్ రేట్ ఒకలా అబ్బాయి అయితే ఒకలా ఉంటుంది. దీంతో కడుపులో పెరుగుతున్నది మగబిడ్డా ? ఆడబిడ్డా ? అని ఈజీగా కనిపెట్టేయవచ్చు. గర్భంలో ఉన్న బిడ్డకి నిమిషానికి 140 కంటే తక్కువ బీట్స్ ఉంటే మగ బిడ్డ అని, అంతకంటే ఎక్కువ ఉంటే ఆడ పిల్ల అవుతారట.
చైనీస్ జెండర్ చార్ట్ …
దీన్ని సరిగ్గా లెక్కిస్తే 90 శాతం వరకు కచ్చితమైన ఫలితం వస్తుంది. 700 సంవత్సరాల క్రితం రూపొందించిన ఈ చైనీస్ చార్ట్ గర్భంలో ఉన్న బిడ్డ లింగాన్ని నిర్దారిస్తుంది. గర్భం దాల్చిన నెలను, తల్లి పుట్టిన సంవత్సరాన్ని బట్టి ఈ చైనీస్ చార్ట్ ద్వారా మగబిడ్డా ? ఆడబిడ్డా ? అనేది తెలుసుకోవచ్చు.
వెడ్డింగ్ రింగ్ టెస్ట్…
ఇది చాలా వింతైన టెస్ట్. వెడ్డింగ్ రింగ్ తీసి ఒక తాడుకు వేలాడదీయాలి. దీన్ని పొట్టపై వేలాడదీయాలి. ఈ రింగ్ పొట్టపై గుండ్రంగా తేలుతూ ఉంటే మగబిడ్డ అని, వెనక్కి, ముందుకూ కదులుతూ ఉంటే అమ్మాయి పుడుతుందని అర్థం.
ముక్కు…
ముక్కుని బట్టి కూడా పుట్టబోయే బిడ్డ ఆడా ? మగా ? అని చెప్పవచ్చు. గర్భంతో ఉన్న మహిళ ముక్కు రూపం, సైజ్ లో మార్పులు కనిపించాయంటే మగబిడ్డ అని సూచిస్తుంది. నాసికా ద్వారాలు పెద్దవిగా, వెడల్పుగా తయారై ఉంటే అబ్బాయి పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇవి తాత్కాలిక మార్పులే. బిడ్డ పుట్టిన తర్వాత అవి మామూలు స్థితికి వచ్చేస్తాయి.
చర్మం…
మహిళ గర్భిణీగా ఉన్నప్పుడు చర్మంపై మొటిమలు, స్కిన్ పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతూ ఉంటే వారికి పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుస్తుంది. అయితే ఎలాంటి చర్మ సమస్యలు లేకపోతే అబ్బాయి పుడతాడని అర్థం.
కాళ్లు…
పాదాల వాపులు ప్రెగ్నెన్సీ సమయంలో కామన్. అయితే గర్భం దాల్చిన మొదట్లో పాదాలపై వాపులు కనిపిస్తూ ఉంటే పొట్టలో ఉన్నది అమ్మాయి. అదే ముందు నుంచి పాదాల వాపు సమస్య లేకుండా చివరి రోజుల్లో అంటే డెలివరీకి ముందు నుంచి పాదాల వాపులు కనిపిస్తూ ఉంటే కడుపులో ఉన్నది అబ్బాయి అని తెలుస్తుంది.
చేతులు…
గర్భంలో ఉన్న బిడ్డ జెండర్ ని చేతుల చర్మం తెలుపుతుంది. తల్లి చేతుల చర్మం స్మూత్ గా, సాఫ్ట్ గా ఉంది అంటే తన కడుపులో ఆడపిల్ల ఉందని, అదే చర్మం పొడిబారిపోయి, పగుళ్లు కనిపిస్తూ ఉంటే అబ్బాయి పెరుగుతున్నట్లు అర్థం.
శరీరం…
శరీరమంతా ఆమె ప్రెగ్నెంట్ అని తెలిపేలా రూపంలో మార్పులు కనిపిస్తే ఆమె గర్భంలో ఉన్నది అమ్మాయి అని, అదే కొన్ని భాగాల్లో మాత్రమే గర్భవతిగా కనిపిస్తూ ఉంటే అబ్బాయి అని తెలుపుతుంది.
స్ర్టెచ్ మార్క్స్…
ప్రెగ్నెన్సీ సమయంలో పొట్టపై స్ర్టెచ్ మార్క్స్ కామన్ గా కనిపిస్తాయి. అయితే వీటి ద్వారా కూడా గర్భంలో పెరుగుతున్నది మేల్ బేబీనా, ఫీమేల్ బేబీనా అని తెలుసుకోవచ్చు. ఎడమ చేతి వైపు పొట్టమీద ఎక్కువ స్ర్టెచ్ మార్క్స్ కనిపిస్తూ ఉంటే కడుపులో ఉన్నది అబ్బాయి అని, అదే కుడివైపు ఎక్కువ స్ర్టెచ్ మార్క్స్ ఉంటే అమ్మాయి అని తెలుస్తుంది.
పొట్ట ఆకారం…
బేబీ ఆడా ? మగా ? అని పొట్ట ఆకారాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. పొట్ట పొడుచుకున్నట్లు ముందుకు సాగినట్టు ఉంటే గర్భంలో ఉన్నది అబ్బాయి అని, పొట్ట వెడల్పుగా ఉంటే గర్భంలో పెరుగుతున్నది అమ్మాయి అని తెలుపుతుంది.
పొట్ట…
గర్భధారణ సమయంలో పొట్ట ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొందరికి పైభాగంలో పొట్ట కనిపిస్తుంది. మరికొందరికి కింది భాగంలో పొట్ట కనిపిస్తుంది. అయితే దీన్ని బట్టి కూడా గర్భంలోని బిడ్డ జెండర్ తెలుసుకోవచ్చు. పై పొట్ట ఉంటే అబ్బాయి అని, కిందివైపుగా పొట్ట ఉంటే.. అమ్మాయిని సూచిస్తుంది.
వజైనల్ డిశ్చార్జి…
ప్రెగ్నెన్సీ సమయంలో కొంచెం కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటే పుట్టబోయేది మగబిడ్డ. అదే చిన్న చిన్న డ్రాప్స్ రూపంలో అప్పుడప్పుడు బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటే పుట్టబోయేది ఆడపిల్ల అని అర్థం.