ఈ ల‌క్ష‌ణాలు ఉంటే డ‌యాబెటిస్ ఉంద‌ని సుల‌భంగా చెప్ప‌వ‌చ్చు..!

డ‌యాబెటిస్‌… నేటి త‌రుణంలో ఇదొక సైలెంట్ కిల్ల‌ర్ వ్యాధిగా మారింది. ఎందుకంటే ఎప్పుడో, ఏదో ఒక సంద‌ర్భంలో తెలియ‌డ‌మే త‌ప్ప‌, దాదాపుగా ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు చాలా మందికి తెలియ‌నే తెలియ‌దు. త‌మ‌కు ఏమీ కాలేద‌ని, త‌మ‌కు ఏ జ‌బ్బూ లేద‌నే అనుకుంటారు. అయితే కింద ఇచ్చిన ప‌లు ల‌క్ష‌ణాల‌ను ఒక‌సారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి. ఇవి గ‌నుక మీకు ఉన్నా, లేదంటే మీ కుటుంబంలో ఎవ‌రికైనా మ‌ధుమేహం ఉన్నా, ఒక‌వేళ మీరు స్థూల‌కాయులైనా ఒక సారి షుగ‌ర్ టెస్ట్ చేయించుకోవ‌డం మంచిది. లేదంటే దీని వ‌ల్ల అనేక ఇత‌ర అనారోగ్యాలు క‌లిగేందుకు అవ‌కాశం ఉంటుంది.

diabetes-signs

మ‌ధుమేహం ఉంద‌ని తెలియ‌జేసే ప‌లు కామ‌న్ ల‌క్ష‌ణాలు ఇవే…

1. మ‌ధుమేహం ఉన్న వారు త‌ర‌చూ మూత్రానికి ఎక్కువ‌గా వెళ్తుంటారు. ఎందుకంటే ర‌క్తంలో ఎక్కువ‌గా ఉన్న గ్లూకోజ్ బ‌య‌టికి వెళ్లే క్ర‌మంలో నీటితోపాటు బ‌య‌టికి వ‌స్తుంది. దీంతో త‌ర‌చూ మూత్రానికి వెళ్లాల్సి వ‌స్తుంది. ఈ ల‌క్ష‌ణం గ‌న‌క మీకు ఉంటే వెంట‌నే టెస్ట్ చేయించుకోండి. నిర్ల‌క్ష్యం చేయ‌కండి.

2. మ‌ధుమేహం ఉంటే ఆకలి ఎక్కువ‌గా అవుతుంది. అప్పుడే తిన్నా స‌రే, వెంట‌నే ఆక‌లి అవుతుంది. కాబ‌ట్టి ఇలా అనిపించినా వెంట‌నే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించండి.

3. శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు త్వ‌ర‌గా మాన‌క‌పోతే డ‌యాబెటిస్ ఉంద‌ని గుర్తించాలి. వెంట‌నే త‌గిన చికిత్స తీసుకోవాలి.

4. మ‌ధుమేహం ఉన్న వారికి దృష్టి స‌రిగా ఆన‌దు. అంటే పూర్తిగా క‌నిపంచ‌ద‌ని కాదు, కాక‌పోతే చుట్టూ ఉన్న‌వ‌న్నీ మ‌స‌క మ‌స‌క‌గా క‌నిపిస్తుంటాయి.

5. మ‌ధుమేహం ఉన్న వారు వేగంగా బ‌రువు త‌గ్గుతారు. అలాంటి ల‌క్ష‌ణం క‌నిపిస్తే అశ్ర‌ద్ధ చేయ‌కుండా డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్లడం మంచిది.

6. మ‌ధుమేహం ఉన్న వారి మూడ్ కూడా చీటికీ మాటికీ మారుతుంటుంది. వీరు స‌హ‌జంగా ఒక‌సారి కోపంతో ఉంటారు. మ‌రొక సారి విచారంగా ఉంటారు.

7. డ‌యాబెటిస్ ఉంటే దాహం ఎక్కువ‌గా అవుతుంది. ఎందుకంటే మూత్రం ద్వారా ఎక్కువ మోతాదులో నీటిని కోల్పోతారు కాబ‌ట్టి దాహం ఎక్కువ‌గా అవుతుంది.

8. మ‌ధుమేహం ఉన్న‌వారు ఎప్పుడూ నీర‌సంగా ఉంటారు. ఏ ప‌ని చేసినా, చేయ‌క‌పోయినా నీర‌సంగానే ఉంటుంది.

9. చేతులు, కాళ్ల‌లో సూదుల‌తో గుచ్చిన ఫీలింగ్ ఉంటుంది.

10. నీటిని ఎక్కువ‌గా కోల్పోవ‌డం వ‌ల్ల చ‌ర్మం ఎప్పుడూ పొడిగా, దుర‌ద‌గా ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top