క్రికెట్ లోకి కొత్త రూల్స్….. ఓవ‌ర్ చేస్తే రెడ్ కార్డ్.!

ప్రపంచంలోని చాలా దేశాల్లో క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఫుట్‌బాల్ తరువాత అత్యంత పాపులర్ గేమ్ ఏదైనా ఉందంటే అది క్రికెట్ అనే చెబుతారు. ఎప్పటికప్పుడు ఈ ఆట కొత్త అభిమానులను సంపాదించుకుంటూనే ఉంది. ఇక ఈ మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీతోనైతే ఆ అభిమానం ఇంకా ఎక్కువగా పెరిగిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే టీములు ఓడిపోయినా క్రికెట్ ప్రేమికులకు మాత్రం ఆ ఆటపై అభిమానం, ఆసక్తి తగ్గడం లేదు. అయితే అలా ఆసక్తి తగ్గకూడదని చెప్పి ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఎప్పటికప్పుడు క్రికెట్ ఆటలో కొత్త రూల్స్ తెస్తూ, ఉన్నవాటిని మారుస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఐసీసీ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో కొన్ని రూల్స్‌ను మార్చింది. మార్చిన రూల్స్ ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. మరి ఆ రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

  • క్రికెట్ మ్యాచ్‌లలో ఎల్‌బీడబ్ల్యూ డెసిషన్‌ను ఆటగాళ్లు థర్డ్ అంపైర్‌కు డీఆర్‌ఎస్ పద్ధతిలో రివ్యూ కింద ఇచ్చినప్పుడు బాల్ ట్రాకర్ వేస్తారు కదా. బాల్ పిచ్‌పై ఎక్కడ పడింది, ఏ లైన్‌లో పడింది, వికెట్స్‌ను తాకుతుందా, మిస్ అవుతుందా, గ్రౌండ్ అంపైర్ డెసిషన్ ఏంటి, అన్న వివరాలు ఆ ట్రాకర్‌లో డిస్‌ప్లే అవుతాయి. అయితే ఈ ట్రాకర్‌లో కొన్ని సందర్భాల్లో అంపైర్స్ కాల్ అని పడుతుంది. అది ఎందుకు పడుతుందంటే బౌలర్ విసిరిన బంతి వికెట్లకు ఏ వైపునైనా ఎడ్జ్‌లో వెళ్తూ తాకుతుందా, లేదా అన్న సందేహంతో ట్రాకర్‌లో కనిపిస్తే దానికి అంపైర్స్ కాల్ అని ఇస్తారు. దీంతో గ్రౌండ్‌లో ఉన్న అంపైర్ నిర్ణయమే చెల్లుబాటు అవుతుంది. బ్యాట్స్‌మెన్‌ను ఇలాంటి సందర్భాల్లో నాటౌట్‌గా ప్రకటిస్తారు. అయితే ఒక వేళ ఇలాంటి సందర్భాల్లో రివ్యూ కోరే జట్టు ఫెయిలైతే ఆ రివ్యూను కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో ఇదే రూల్ ఉంది. అయితే ఇకపై ఈ రూల్ ఉండదు. టెస్ట్ లేదా వన్డే ఏదైనా ఏ జట్టు అయినా రివ్యూ కోరి ఫెయిలైతే రివ్యూ లాస్ అంటూ ఉండదు. రివ్యూలను కోల్పోవాల్సిన పనిలేదు.

  • ఇక మారిన రూల్స్ ప్రకారం అక్టోబర్ 1వ తేదీ ఆ తరువాత నుంచి జరిగే మ్యాచ్‌లలో నూతన బాల్ ట్రాకింగ్ మెథడ్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో బాల్ అసలు ఎటు పోతుందో చాలా కచ్చితత్వంతో తెలుస్తుంది. అలాగే బ్యాట్‌లకు బంతి ఎడ్జ్ అయ్యే టెక్నాలజీని కూడా కొత్తగా తీసుకురానున్నారు. దీంతో బ్యాట్‌కు ఎడ్జ్ అయిన బంతి గురించి చాలా క్లియర్‌గా దృశ్యాలను వీక్షించవచ్చు. బ్యాట్స్‌మెన్ ఔటా, కాదా అనేది సులభంగా నిర్ణయించవచ్చు.

  • ఆటగాళ్లు ఇకపై 108ఎంఎం వెడల్పు, 67ఎంఎం మందం, 40 ఎంఎం ఎడ్జ్ మందం ఉన్న బ్యాట్‌లను మాత్రమే వాడాల్సి ఉంటుంది. వాటికే అనుమతినిస్తారు.
  • ఆట సందర్భంగా రెండు జట్లలో ఏ జట్టుకు చెందిన ఏ ఆటగాడి ప్రవర్తన సరిగ్గా లేకున్నా అంపైర్లు ఆ ఆటగాన్ని బయటకు పంపవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఫుట్‌బాల్‌లో రెడ్ కార్డ్‌లా అన్నమాట. ఆటగాడి ప్రవర్తన సరిగ్గా లేకపోతే రెడ్ కార్డ్ చూపిస్తారు. దీంతో ఆటగాడు కచ్చితంగా గ్రౌండ్‌ను వీడాల్సిందే. అతని స్థానంలో మరో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు వస్తాడు.
  • ఇక మారిన రూల్స్ ప్రకారం రనౌట్‌లకు కూడా ఓ కొత్త రూల్ పెట్టారు. అదేమిటంటే… ఆటగాడు రన్ తీసే సందర్భంలో క్రీజ్ దాటాక బ్యాట్‌ను గ్రౌండ్‌పై పెట్టినప్పుడు బ్యాట్ మళ్లీ పైకి లేచినా వికెట్లను కొడితే ఔట్ కాదు. దానికి ఔట్ ఇవ్వరు.

Comments

comments

Share this post

scroll to top