మ‌న దేశంలో వెల‌క‌ట్ట‌లేని నిధి, నిక్షేపాలు ఉన్న 5 ప్రాంతాలు ఇవే..!

ఎన్నో ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల విలువ చేసే అంతులేని సంప‌ద‌… బంగారు ఆభ‌ర‌ణాలు, వ‌జ్రాలు… ఇలా ఒక‌టేమిటి… నిధి అంటే అందులో ఉండే న‌గ‌ల‌కు లెక్క క‌ట్ట‌డం మాన‌వ మాత్రుల‌కు సాధ్యం అయ్యే ప‌ని కాదు. ఈ క్ర‌మంలో ఏదైనా ఒక ప్ర‌దేశంలో నిధి ఉంద‌ని తెలిస్తే కొంద‌రు దుండ‌గులు దాన్ని సొంతం చేసుకునే దాకా వ‌ద‌ల‌రు. ఇదే నేప‌థ్యంలో వ‌చ్చిన అనేక సినిమాల‌ను కూడా మ‌నం చూశాం. అయితే సినిమాల్లోనే కాదు… అలాంటి అంతులేని సంప‌ద ఉన్న కొన్ని ప్రాంతాలు ఇప్ప‌టికీ మ‌న దేశంలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

treasure-1

1. నాదిర్ షా నిధి…
క్రీ.శ‌.1739లో ప‌ర్షియ‌న్ రాజు నాదిర్ షా త‌న 50వేల మంది సైనికుల‌తో 30వేల మంది ప్ర‌జ‌ల‌ను దోచుకున్నాడ‌ట‌. ఎన్నో విలువైన ఆభ‌ర‌ణాల‌ను, లెక్క‌లేనన్ని వ‌జ్రాల‌ను అత‌ను దోపిడీ చేశాడ‌ట‌. అయితే ఆ ఆభ‌ర‌ణాల్లో నెమ‌లి సింహాస‌నం కూడా ఉంద‌ట‌. ప్ర‌స్తుతానికి అది ఇరాన్‌లో ఉంది. అయితే అది త‌ప్ప అత‌ను దోచుకున్న నిధిలో ఇంత వ‌ర‌కు ఒక్క ఆభ‌ర‌ణం కూడా ఎవ‌రికీ దొర‌క‌లేద‌ట‌. కొంద‌రేమో ఆ నిధి హిందు ఖుష్ లోయ‌లో ఉంద‌ని చెబుతున్నారు.

treasure-2

2. సోన్‌బంద‌ర్ గుహ‌లు, బీహార్‌…
బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న సోన్‌బంద‌ర్ గుహ‌ల్లో బింబాస‌ర అనే రాజుకు చెందిన నిధి ఉంద‌ట‌. ఆ గుహ‌ల లోప‌ల సీలింగ్‌కు బంగారు పూత ఉంటుంది. అందుకే వాటిని సోన్ బంద‌ర్ గుహ‌లు అని పిలుస్తారు. అయితే ఆ గుహ లోప‌ల ఓ ర‌హ‌స్య ద్వారం ఉంద‌ట‌. దాంట్లో నుంచి ఇంకా చాలా లోప‌లి వైపు నిధి ఉంద‌ట‌. ఈ క్ర‌మంలో ఆ ర‌హ‌స్య ద్వారాన్ని బ్రిటిషర్లు ఓసారి తెరిచేందుకు య‌త్నించార‌ట‌. కానీ అది వారికి సాధ్య‌ప‌డ‌లేద‌ట‌.

3. కృష్ణా న‌ది, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌…
ప్ర‌ఖ్యాత కోహినూర్ వ‌జ్రం గురించి తెలుసు క‌దా. అయితే ఆ వ‌జ్రం కృష్ణా న‌దిలోనే ఒక‌ప్పుడు రాజుల‌కు దొరికింద‌ట‌. ఈ క్ర‌మంలో అది ఇప్పుడు ఎక్క‌డ ఉందో అంద‌రికీ తెలుసు. అయితే నిజానికి కోహినూర్ వ‌జ్రాన్ని పోలిన ఎన్నో డైమండ్స్ ఇప్ప‌టికీ కృష్ణా న‌దిలో చాలా లోతులో ఉన్నాయ‌ట‌.

treasure-3

4. ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యం, కేర‌ళ‌…
కేర‌ళ‌లోని తిరువ‌నంతపురంలో ఉన్న ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యం గురించి ఇటీవ‌లి కాలంలో మ‌నం త‌ర‌చూ వింటూనే ఉన్నాం. అయితే ఆల‌యానికి చెందిన నేల‌మాళిగ‌ల‌లో ఎన్నో ట‌న్నుల కొద్దీ బంగారం, వ‌జ్రాలు, ఆభ‌ర‌ణాలు ఉన్నాయ‌ట‌. వాటి విలువ రూ.1 ల‌క్ష కోట్ల‌కు పైనే ఉంటుంద‌ట‌.

treasure-4

5. శ్రీ మూకాంబిక ఆల‌యం, క‌ర్ణాట‌క‌…
క‌ర్ణాట‌క‌లోని ప‌శ్చిమ క‌నుమ‌ల వ‌ద్ద కొడ‌చ‌ద్రి ప‌ర్వ‌తాల‌పై ఉన్న శ్రీ మూకాంబిక ఆల‌యంలో కింది భాగంలో ఓ ర‌హ‌స్య ద్వారం ఉంద‌ట‌. దాని గుండా వెళ్తే ప‌ర్వ‌తాల్లో నిధి ఉన్న ఓ ర‌హ‌స్య గ‌ది ఓపెన్ అవుతుంద‌ట‌. అందులో వెల క‌ట్ట‌లేని బంగారు ఆభ‌ర‌ణాలు, వ‌జ్రాలు ఇప్ప‌టికీ ఉన్నాయ‌ట‌.

Comments

comments

Share this post

scroll to top