నీటిని నిల్వ చేసేందుకు మ‌న పూర్వీకులు వాడిన అద్భుత‌మైన టెక్నిక్స్ ఇవి..!

ఇప్పుడంటే మ‌న‌కు అధునాత‌న సాంకేతిక ప‌రిజ్ఞానం అందుబాటులో ఉంది కాబ‌ట్టి ఎంతో పెద్ద‌వైన, దృఢ‌వైన ఆన‌క‌ట్టలు, రిజ‌ర్వాయ‌ర్ల‌ను నిర్మించుకుని నీటి కొర‌త లేకుండా చూసుకుంటున్నాం. కానీ కొన్ని వంద‌ల ఏళ్ల క్రితం ప‌రిస్థితి అలా లేదుగా. మ‌రి అలాంటప్పుడు అప్ప‌టి వారు నీటి నిల్వ కోసం ఎలాంటి ప‌ద్ధ‌తుల‌ను ఉప‌యోగించారో తెలుసా..? వాటిని చూస్తే మీకు ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. అలాంటి నిర్మాణాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఝ‌లారా

jhalaraభూమి లోప‌లికి పెద్ద పెద్ద గుంత‌ల‌ను తవ్వి వాటి చుట్టూ లోప‌ల నాలుగు వైపులా వ‌రుస వెంట వ‌రుస మెట్లు వచ్చేలా ఝ‌లారాల‌ను నిర్మిస్తారు. ఇవి వాటి ఎగువ‌న ఉండే స‌ర‌స్సులు, కాలువ‌ల నుంచి నీటిని గ్ర‌హిస్తాయి. అనంత‌రం వాటిని నిల్వ ఉంచుకుంటాయి. అవ‌స‌రం ఉన్న‌ప్పుడు ఆ నీటిని ప్ర‌జ‌లు ఉపయోగించుకునేవారు. ఇవి క్రీస్తు శ‌కం 1660 సంవ‌త్స‌ర కాలం నాటికి చెందిన నిర్మాణాలు.

2. తాలాబ్ / బ‌ందీ

talabబుందేల్‌ఖండ్‌, ఉద‌య్‌పూర్ వంటి ప్రాంతాల్లో ఈ నిర్మాణాలను ఎక్కువ‌గా చేప‌ట్టేవారు. ఇవి దీర్ఘ‌చ‌తుర‌స్రాకారంలో అత్యంత పొడ‌వుగా ఉంటాయి. వీటిల్లో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేసే వారు. అలా నిల్వ ఉంచిన నీటిని గృహాలు, వ్య‌వ‌సాయ అవ‌స‌రాల కోసం ఉప‌యోగించుకునే వారు.

3. బ‌వారి

bawariరాజ‌స్థాన్‌లో బ‌వారి నిర్మాణాల‌ను చేప‌ట్టారు. వీటిల్లోకి దిగేందుకు అడుగు భాగం వ‌ర‌కు మెట్ల వంటి ఏర్పాటు ఉంటుంది. వ‌ర్ష‌పు నీటిని వీటిల్లో నిల్వ చేసుకుని ఉపయోగించుకునేవారు. ఈ నిర్మాణాల‌కు కింది భాగం వెడ‌ల్పుగా, పై భాగం ఇరుగ్గా ఉంటుంది. అందుకు కార‌ణ‌మేమిటంటే, అలా నిర్మించ‌డం వ‌ల్ల నీరు త‌క్కువ‌గా ఆవిర‌వుతుంది.

4. తాంకా

tankaరాజ‌స్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో తాంకాలను ఎక్కువ‌గా నిర్మించేవారు. వ‌ర్షం వ‌ల్ల వ‌చ్చిన నీరు వీటిల్లో నిల్వ ఉండేది. అలా నిల్వ ఉండే నీరు ఒక కాలం పాటు ఓ కుటుంబం మొత్తానికి స‌రిపోయేది.

5. ఆహార్ పైన్స్

బీహార్ వంటి రాష్ట్రాల్లో ముందుగా ఆహార్ పైన్స్ నిర్మాణాల‌ను చేప‌ట్టారు. ఇవి పిల్ల కాలువ‌ల‌ను పోలి ఉంటాయి. స‌మీపంలో ఉన్న న‌దుల‌ను, స‌ర‌స్సుల‌ను, గ్రామాల్లో ఉన్న పొలాల‌ను ఇవి క‌లుపుతాయి. వీటిలో పారే నీటిని జ‌నాలు వాడుకునేవారు.

ahar-pynes-johads

6. జోహాద్స్‌
క‌ర్ణాట‌క‌, ఒడిశా రాష్ట్రాల్లో వీటిని ముందుగా నిర్మించారు. మ‌నం ఇప్పుడు పిలుస్తున్న చెక్ డ్యాం లాంటి నిర్మాణాల‌నే ఇవి క‌లిగి ఉంటాయి. మూడు వైపులా ఎత్తుగా, ఓ వైపు వంపుగా ఉండే ప్రాంతంలో చాలా లోతుకు త‌వ్వితే, వ‌ర్షం ప‌డిన‌ప్పుడు ఆ ప్రాంతంలో నీరు నిలిచేది. ఈ క్ర‌మంలో వంపు ఉన్న ప్రాంతాన్ని గోడ‌తో మూసి అవ‌స‌రం అనుకున్న‌ప్పుడు దాని తెరుస్తూ నీటిని వాడుకునేవారు.

7. ప‌నాం కెని

panam-keniఓ ర‌క‌మైన వృక్షానికి చెందిన 4 అడుగుల ఎత్తున్న పెద్ద పెద్ద కాండాల‌ను తీసుకుని వాటి లోప‌లి భాగాల‌ను తీసేసి డ్ర‌మ్ములుగా త‌యారు చేసి ఇలాంటి నిర్మాణాల‌ను చేప‌డుతారు. మ‌న దేశంలో ప‌లు ప్రాంతాల్లో, అడ‌వుల్లో నివాసం ఉండే కొన్ని తెగ‌ల‌కు చెందిన వారు వీటిని త‌యారు చేసేవారు. అడ‌వుల్లో వీటిని త‌యారుచేసి ఏదైనా ఒక ప్రాంతంలో వీటిని పెట్ట‌గానే వ‌ర్షం ప‌డిన‌ప్పుడు అందులోకి నీరు వ‌చ్చి చేరుతుంది. అలా చేరిన నీటిని ఆ తెగల ప్ర‌జ‌లు తాగి దాహం తీర్చుకునేవారు.

8. ఖాదిన్

khadin15వ శ‌తాబ్దంలో జై స‌ల్మీర్‌కు చెందిన ప్ర‌జ‌లు ఇలాంటి నిర్మాణాల‌ను చేప‌ట్టేవారు. కొండ వాలుకు దిగువ‌న ఉన్న ప్రాంతంలో నీరు నిల్వ ఉండేట్టుగా ఆ ప్ర‌దేశాన్ని తవ్వేవారు. దీంతో వ‌ర్షం ప‌డ‌గానే అందులోకి నీరు వ‌చ్చి చేరేది. ఆ నీటిని వ్య‌వ‌సాయం కోసం ఉప‌యోగించుకునేవారు.

9. కుండ్

kund1607వ సంవ‌త్స‌రంలో రాజస్థాన్‌, గుజ‌రాత్ ప్రాంతాల్లో కుండ్‌ల‌ను నిర్మించుకునేవారు. వీటిలో వ‌ర్ష‌పు నీరు నిలిచి ఉండేది. వ్య‌వ‌సాయం, తాగునీటి కోసం ఆ నీటిని ఉప‌యోగించుకునేవారు.

10. బవోలి

baoliగ్రామాల‌కు, వ్య‌వ‌సాయానికి నేరుగా నీటిని స‌ర‌ఫ‌రా చేసేందుకు బ‌వోలిల‌ను ఒక‌ప్పుడు నిర్మించేవారు. స‌మీపంలో ఉన్న చెరువులు, న‌దులు, కాలువ‌ల‌కు ఇవి అనుసంధాన‌మై ఉండేవి.

11. న‌ది

nadiరాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ ప్రాంతంలో ఉండే లోత‌ట్టు ప్ర‌దేశాల్లో వ‌ర్ష‌పు నీటిని ఒడిసి ప‌ట్టేందుకు గాను ఇలాంటి నిర్మాణాల‌ను చేప‌ట్టేవారు. వీటిని గ్రామ స‌ర‌స్సులుగా పిలిచేవారు.

12. భండారా ఫాద్

bhandara-phadమ‌హారాష్ట్ర‌లోని నాసిక్ త‌దిత‌ర ప్రాంతాల్లో వీటిని కొన్ని వందల ఏళ్ల కింద‌ట నిర్మించ‌డం ప్రారంభించారు. ఇవి కాలువ‌ల‌ను పోలి ఉంటాయి. న‌దులు, స‌ర‌స్సులు, చెరువుల నుంచి వ‌చ్చే నీరు వీటి ద్వారా గ్రామాల‌కు వెళ్లేది.

13. జింగ్

zingజమ్మూ కాశ్మీర్‌లోని ల‌దాక్ ప్రాంతంలో ఒకప్పుడు వీటిని ఎక్కువ‌గా నిర్మించారు. హిమాల‌యాల నుంచి క‌రుగుతూ వ‌చ్చిన నీటిని ఒడిసి ప‌ట్టుకునేందుకు గాను చిన్న‌పాటి స‌ర‌స్సుల‌ను ఏర్పాటు చేసేవారు. అవే జింగ్‌లు. వీటిలోకి వ‌చ్చే నీటిని జ‌నాలు వాడుకునేవారు.

14. కుల్స్

kuhlsహిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో వీటిని ఎక్కువ‌గా నిర్మించారు. హిమానీ న‌దాల నుంచి కరిగి వ‌చ్చే నీటిని స‌ర‌స్సుల్లోకి పంపేందుకు గాను వీటిని నిర్మించుకునేవారు. వీటి ద్వారా ప్ర‌వ‌హించే నీటిని వ్య‌వ‌సాయం, తాగునీటి అవ‌సరాల కోసం ఉప‌యోగించుకునేవారు.

15. జాబో

zaboనాగాలాండ్‌లో వీటిని నిర్మించేవారు. కొండ ప్రాంతంపై బ‌ల్ల ప‌రుపుగా ఉన్న ప్ర‌దేశంలో భూమిని త‌వ్వి వీటిని నిర్మించేవారు. అలా త‌వ్వ‌గా ఏర్ప‌డ్డ పెద్ద గుంత‌లో నీరు నిల్వ ఉండేది. దాన్ని పాయ‌లుగా చేసి నెమ్మ‌దిగా కింద‌కు దింపుతూ వ్య‌వ‌సాయం, ప‌శువుల పెంప‌కం, మొక్క‌ల పెంప‌కం కోసం వాడుకునేవారు.

16. బాంబూ డ్రిప్ ఇరిగేష‌న్‌

bamboo-irrigationఇప్పుడున్న డ్రిప్ ఇరిగేష‌న్ లాంటిదే ఈ ప‌ద్ధ‌తి కూడా. కాక‌పోతే అప్పుడు లోహాలు, ప్లాస్టిక్, మోటార్లు లేవు క‌దా. అందుకోసం వారు వెదురు బొంగుల‌ను ఉప‌యోగించి మొక్క‌ల‌కు నెమ్మ‌దిగా నీరు అందేలా డ్రిప్ ఇరిగేష‌న్ ప‌ద్ధ‌తిని ఏర్పాటు చేసుకునే వారు.

17. జాక్‌వెల్స్‌

jackwellsఅండ‌మాన్ నికోబార్ దీవుల్లో ఇలాంటి నిర్మాణాల‌ను ఎక్కువ‌గా చేప‌ట్టేవారు. పెద్ద పెద్ద బావుల‌ను త‌వ్వి వాటిలోకి వెదురు బొంగుల‌ను పెట్టేవారు. ఆ బొంగుల రెండో చివ‌ర్ల‌ను చెట్ల కింద ఉంచేవారు. చెట్లపై ప‌డ్డ వ‌ర్షపు నీరు వెదురు బొంగుల ద్వారా బావుల్లోకి వ‌చ్చి చేరేది. ఒక వేళ ఆ బావి నిండితే దాన్నుంచి మ‌రో వెదురు బొంగు ద్వారా ఇంకో బావికి నీటిని పంపే ఏర్పాటు చేసేవారు.

18. రామ్‌టెక్ మోడ‌ల్

ramtek-modelమ‌హారాష్ట్ర‌లో ఇలాంటి నిర్మాణాల‌ను చేప‌ట్టేవారు. ప‌ర్వ‌త ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొల‌నుల‌ను ఏర్పాటు చేసి వాటిలో చేరే వ‌ర్ష‌పు నీటిని సేక‌రించేవారు. అలా వ‌చ్చి చేరిన నీరు ప‌ర్వ‌త ప్రాంతం కింద‌కు ప్ర‌వ‌హించేది. దీంతో ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీరేవి.

19. పాట్ ప‌ద్ధ‌తి

pat-systemకొండ ప్రాంతాల నుంచి కింద‌కు వ‌చ్చే నీటిని అనేక ప‌ద్ధ‌తులు, మార్గాల్లో దారి మ‌ళ్లిస్తూ ఆ నీటిని ఎట్ట‌కేల‌కు గ్రామం స‌మీపంలోకి తెచ్చేవారు. అలా వ‌చ్చి చేరే నీటిని మ‌ళ్లీ నిల్వ చేసి వాడుకునేవారు.

20. ఎరి

eriమ‌న దేశంలో అత్యంత పురాత‌న మైన నీటిని నిల్వ చేసే ప‌ద్ధ‌తిగా ఇది పేరు గాంచింది. త‌మిళ‌నాడులో ఇప్ప‌టికీ కొన్ని ఎరి నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో పెద్ద ఎత్తున వ‌ర్ష‌పు నీరు చేరుతుంది. అలా చేరిన నీటిని కాలువ‌ల ద్వారా మ‌ళ్లించి గ్రామాల్లో వాడుకునేవారు.

ఇవే కాదు, ఇంకా చాలా ర‌కాల నీటి నిల్వ ప‌ద్ధ‌తులు మ‌న దేశంలో ఉన్నాయి. అందులో మన ద‌గ్గ‌ర ఉన్న చెరువులు కూడా ఒక‌టి. క‌ర్ణాట‌క‌లో వీటినే కిరిస్ అని పిలుస్తారు. అస్సాంలోనైతే వీటిని డోంగ్స్ అని అంటారు. ఇవ‌న్నీ మ‌న దేశంలో ఉన్న అత్యంత పురాత‌న‌మైన నీటి నిల్వ ప‌ద్ధ‌తులు. ఇప్ప‌టికీ అనేక చోట్ల ఇలాంటి ప‌ద్ధ‌తులు అమ‌లులో ఉన్నాయి.

Comments

comments

Share this post

scroll to top