వివాహేత‌ర సంబంధాలకు ప్ర‌ధాన కార‌ణాలు ఇవేన‌ట‌…

వివాహేతర సంబంధాలు దంప‌తుల జీవితాల‌ను ఏ విధంగా నాశ‌నం చేస్తాయో మ‌నం ప్ర‌త్య‌క్షంగా చూస్తూనే ఉన్నాం. నిత్యం ఈ విష‌యానికి సంబంధించిన వార్త‌ల‌ను వింటూనే ఉన్నాం. ఈ సంబంధాల‌కు ధ‌నం, సంపాద‌న‌, భాష‌, ప్రాంతం వంటి అంశాలు అడ్డు కానే కావు. ఎక్క‌డి వారిలోనైనా ఇలాంటి సంబంధాలు ఉండ‌వ‌చ్చు. అది వేరే విష‌యం. అయితే వివాహేత‌ర సంబంధాలు పెట్టుకునే వారిని అందు కోసం పురికొల్పే ప్ర‌ధాన కార‌ణాలు కొన్ని ఉంటాయి. అవేంటంటే…

extra-marital-affair

* 20 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు పెళ్లి చేసుకునే వారు 30 ఏళ్లు వ‌చ్చే స‌రికి దాదాపుగా సెటిల్ అయి ఉంటారు. వారికి మంచి సోష‌ల్ స్టేట‌స్‌, ఇమేజ్‌, డ‌బ్బు వ‌చ్చి ఉంటాయి. ఈ క్ర‌మంలో అలాంటి స్థితిలో ఉన్న‌వారు ఏమ‌నుకుంటారంటే త‌మ‌కు త్వ‌ర‌గా పెళ్లి జ‌రిగిపోయింద‌ని, జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయ‌లేద‌ని భావిస్తార‌ట‌. దీంతోనే ఆ వ‌య‌స్సులో అక్ర‌మ సంబంధాలు పెట్టుకుంటార‌ట‌.

* ఇంట్లో ఉన్న కుటుంబ స‌భ్యుల బ‌ల‌వంతం వ‌ల్లో, లేదైనా ఇత‌ర కార‌ణాల వ‌ల్లో బ‌ల‌వంతంగా, ఏదో మొక్కుబ‌డిగా పెళ్లి చేసుకునే వారు అనంత‌రం వివాహ జీవితంలో త‌మ జీవిత భాగ‌స్వామి ప‌ట్ల కొద్దిగా నిరాస‌క్త‌త చెందుతార‌ట‌. ఈ క్ర‌మంలో కొంద‌రు త‌మ భాగ‌స్వామి క‌న్నా ఆక‌ర్షితులుగా క‌నిపించే వారితో స్నేహం చేసి అనంత‌రం వారితో వివాహేత‌ర సంబంధం కూడా పెట్టుకుంటార‌ట‌.

* ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌కు ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డం, ఆక‌స్మికంగా ఎవ‌రైనా చ‌నిపోవ‌డం, లేదంటే ఉద్యోగం పోవ‌డం, ఆర్థిక ప‌రిస్థితి బాగా లేక‌పోవ‌డం వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల దంప‌తుల్లో ఎవ‌రైనా వివాహేత‌ర సంబంధం పెట్టుకుంటార‌ట‌.

* భార్య‌లు గ‌ర్భంతో ఉండి పిల‌ల్ని క‌నేట‌ప్పుడు చాలా ఎక్కువ స‌మ‌యం గ్యాప్ వ‌స్తుంది. దీని వ‌ల్ల భ‌ర్త‌లు వేరే మ‌హిళ‌ల‌తో వివాహేత‌ర సంబంధాలు పెట్టుకుంటార‌ట‌.

* దంప‌తుల్లో ఒక‌రితో ఒక‌రు సుఖంగా లేక‌పోయినా, దాంప‌త్య జీవితం బాగా అనుభ‌వించ‌క‌పోయినా, శృంగారంలో అంతగా ప‌స లేకపోయినా దంప‌తుల్లో ఎవ‌రైనా ఇత‌రుల‌తో వివాహేత‌ర సంబంధాలు పెట్టుకుంటార‌ట‌.

* దంప‌తుల‌న్నాక కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో ఏ విష‌యం ప‌ట్ల‌యినా భావోద్వేగాల‌కు గుర‌వుతుంటారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రూ క‌ల‌సి కూర్చుని మాట్లాడుకుంటే స‌రిపోతుంది. కానీ చాలా మంది అలా చేయరు. దీంతో అలాంటి దంప‌తుల్లో ఎవ‌రైనా వివాహేత‌ర సంబంధాలు పెట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

* భార్య‌, భ‌ర్త ఇద్ద‌రికీ కొన్ని సార్లు కొన్ని విష‌యాల్లో ఏకాభిప్రాయం కుద‌ర‌దు. దీంతో కొంద‌రు స‌ర్దుకుపోలేక‌పోతారు. అయితే ఇలాంటి వారు కూడా వివాహేత‌ర సంబంధాలు పెట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

* భార్య‌, భ‌ర్త ఇరువురిలో త‌మ త‌మ జీవితాల‌పై ఎవ‌రి వ్య‌క్తిగ‌త అభిప్రాయాలు వారికి ఉంటాయి. అయితే ఒక‌రి అభిప్రాయాన్ని గౌరవించి మ‌రొక‌రు ముందుకు సాగితే బాగానే ఉంటుంది, కానీ అలా గౌర‌వించ‌క‌పోతేనే దాని వ‌ల్ల అలాంటి దంప‌తులు వివాహేత‌ర సంబంధాల‌ను పెట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

* ప్ర‌తి వ్య‌క్తికి జీవితంలో కొత్త‌గా ఏదైనా చేయాల‌నే ఆలోచ‌న ఉంటుంది. అయితే ఈ విష‌యంలో అంద‌రికీ ఒకేలాంటి అభిప్రాయాలు ఉండ‌వు క‌దా. అలాంటి వారు వివాహేత‌ర సంబంధాల‌ను పెట్టుకుని ఎంజాయ్ చేయాల‌ని చూస్తార‌ట‌.

* ఉద్యోగాలు చేసే భార్యా భ‌ర్త‌ల్లో ఎవ‌రైనా త‌మ కెరీర్ ఇంకా ఫాస్ట్‌గా ముందుకు దూసుకెళ్ల‌డం కోసం వివాహేత‌ర సంబంధాల‌ను పెట్టుకుంటార‌ట‌.

Comments

comments

Share this post

scroll to top