వీరు ప్ర‌పంచంలోనే అత్యంత అదృష్ట‌వంతులైన 10 మంది వ్యక్తులు, ఎందుకో తెలుసా!?

అదృష్టం… దీని గురించి చెప్పాలంటే ఇది చాలా కొద్దిమందికి మాత్ర‌మే క‌లిగే భాగ్యం. ఈ భూప్ర‌పంచంలో ఉన్న ఎవ‌రికైనా అదృష్టం ఎప్పుడో ఒక‌సారి త‌లుపు త‌డుతుంది. దీంతో వారు అదృష్ట‌వంతులుగా మారిపోతారు. కానీ కొంద‌రికి మాత్రం అదృష్టం క‌ల‌సి రాదు. అది వేరే విష‌యం. అయితే ఎవ‌రికి అదృష్టం వ‌చ్చినా దానికీ కొంత స్థాయి అనేది ఉంటుంది. ఈ క్ర‌మంలో నిజంగా అదృష్టానికి గ‌న‌క కొల‌మానం ఇస్తే అది వీరి నుంచే ప్రారంభించాలేమో. ఎందుకంటే ఈ ప‌ది మంది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న వ్య‌క్తుల్లో అత్యంత అదృష్ట‌వంత‌మైన వారిగా పేరు గాంచారు. ఇంత‌కీ వారెవ‌రంటే..!

luckiest-people-1
లీనా పాల్స‌న్‌…
లీనా పాల్స‌న్ అనే మ‌హిళ గ‌త 16 ఏళ్ల కింద‌ట త‌న వెడ్డింగ్ ఉంగ‌రం పోగొట్టుకుంది. అయితే అది ఆశ్చ‌ర్యంగా ఈ మ‌ధ్యే బ‌య‌ట‌ప‌డింది. అది కూడా త‌న తోట‌లో. ఓ క్యారెట్ అందులో పెరిగి బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో ఉంగ‌రం కూడా బ‌య‌ట ప‌డింది. అదృష్ట‌మంటే ఆమెదే.

స్టీవ్ ఫ్లెయిగ్‌…
స్టీవ్ అనే వ్య‌క్తికి త‌న తల్లి ఎవ‌రో తెలీదు. ఆమెను తెలుసుకునే ప‌నిలోనే అత‌ను ఉండేవాడు. కాగా అత‌ను నిత్యం ప‌నిచేస్తున్న ఓ స్టోర్స్‌కు చెందిన మ‌రో బ్రాంచ్‌లోనే త‌న త‌ల్లి కూడా ప‌నిచేస్తుంద‌ని ఎట్ట‌కేల‌కు ఓ రోజు తెలుసుకున్నాడు. అంతే, అత‌ని అదృష్టానికి, ఆనందానికి అవ‌ధులు లేవు.

వ‌ర్జీనియా ఫైక్‌…
వ‌ర్జీనియా ఫైక్ అనే మ‌హిళ త‌న త‌ల్లిదండ్రులు పెళ్లి చేసుకున్న తేదీకి సంబంధించిన నంబ‌ర్ల‌తో ఓ లాట‌రీ టికెట్‌, అప్ప‌టికి వారి వ‌య‌స్సు ఎంతో ఉందో అంతే నంబ‌ర్లు క‌లిగిన మ‌రో లాట‌రీ టికెట్ మొత్తం రెండు టిక్కెట్ల‌ను ఆమె కొనుగోలు చేసింది. అయితే ఒక్కో దానికి 10 ల‌క్ష‌ల డాల‌ర్ల చొప్పున మొత్తం రెండింటికీ 20 ల‌క్ష‌ల డాల‌ర్ల లాట‌రీ ప్రైజ్ మ‌నీ ఆమెకు వ‌చ్చింది. అదృష్టం గురించి ఇప్పుడేమంటారు..!

సుటోము య‌మ‌గుకి…
హిరోషిమా, నాగ‌సాకి ప‌ట్ట‌ణాల మీద రెండు అణుబాంబులు ప‌డ్డాయి గుర్తుంది క‌దా. అయితే ఆ రెండు ఘ‌ట‌న‌ల్లోనూ త‌ప్పించుకున్న ఏకైక వ్య‌క్తి సుటోము య‌మ‌గుకినే. నిజంగా అదృష్ట‌మంటే ఇత‌నిదే క‌దా. రెండు బాంబులు, అదీ అణుబాంబుల నుంచి త‌ప్పించుకున్నాడు.

హారిస‌న్ ఒడ్జెగ్బా ఒకెనె…
ఇత‌ను ఓ షిప్‌లో కుక్ గా ప‌నిచేసేవాడు. అయితే ఒక‌సారి ఆ షిప్ స‌ముద్రంలో మునిగిపోయింది. అప్పుడుం అందులో 12 మంది సిబ్బంది ఉండేవారు. వారితో హారిస‌న్ కూడా ఉన్నాడు. కానీ షిప్ మునిగిపోతున్న స‌మ‌యంలో బాత్‌రూమ్‌లో ఉండ‌డం వ‌ల్ల 3 రోజుల‌కు అత‌న్ని కాపాడారు. ఇత‌నిది కూడా అదృష్ట‌మే క‌దా..!

luckiest-people-2
జోన్ గింత‌ర్‌…
2008వ సంవ‌త్స‌రంలో ఈమె కోటి డాల‌ర్ల లాట‌రీ గెలిచి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. అస‌లు అదృష్టం అంటే ఈమెదే..!

జూలియానె కోప్కె…
అది 1971వ సంవ‌త్సరం. అప్పుడు జూలియానెకు 17 ఏళ్లు. తాను ప్ర‌యాణిస్తున్న విమానం అమెజాన్ న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న అడ‌విలో కూలిపోయింది. కానీ జూలియానె అందులో నుంచి త‌ప్పించుకోగ‌లిగింది. త‌రువాత కొన్ని రోజుల‌కు స్థానికులు ఆమెను ర‌క్షించ‌గ‌లిగారు. అంత‌టి ద‌ట్ట‌మైన అడవిలో ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకుని త‌ప్పించుకుందంటే నిజంగా ఈమెదీ కూడా అదృష్ట‌మ‌నే చెప్పాలి..!

మార్టెన్ డి జోంగ్‌…
ఇత‌ను ప్ర‌ముఖ సైక్లిస్టు. రెండు విమాన ప్ర‌మాదాల నుంచి త‌ప్పించుకోగ‌లిగాడు. ప్ర‌యాణం చేసేందుకు టిక్కెట్లు బుక్ చేసుకున్నా చివ‌రి నిమిషంలో వాటిని క్యాన్సిల్ చేయాల్సి వ‌చ్చింది. అలా క్యాన్సిల్ చేసిన వాటిలో ఒక విమానం హిందూ మ‌హాస‌ముద్రంలో అదృశ్యం కాగా, మ‌రో విమానం కూలిపోయింది. ఇత‌న్ని మించిన అదృష్ట‌వంతులు కూడా ఎవ‌రూ ఉండ‌రు.

రేష్మా బేగం…
ఈమె రాణా ప్లాజాలో ద‌ర్జీ ప‌ని చేస్తూ జీవిస్తుంది. అలా ఒక రోజు ప‌నిలో ఉండ‌గా పెద్ద పేలుడు సంభ‌వించింది. దీంతో ఆమె రాళ్ల అడుగున ఉండిపోయింది. అనంత‌రం 17 రోజుల‌కు ఆమెను ర‌క్షించ‌గ‌లిగారు. అన్ని రోజుల పాటు ఆమె తిండి, నీరు లేకుండా జీవించ‌గ‌లిగింది. అప్ప‌టికీ ప్రాణాల‌తో ఉండ‌డం ఆమె అదృష్ట‌మే..!

ఫ్రానె సెలాక్‌…
ఇప్పుడు చెప్ప‌బోయే వ్య‌క్తి పైన చెప్పిన అంద‌రి క‌న్నా ఎంత‌గానో అదృష్ట‌వంతుడు. ఎందుకంటే ఇత‌ను అనేక ప్ర‌మాదాల నుంచి త‌ప్పించుకోగ‌లిగాడు. ఫ్రానె సెలాక్ అనే ఇత‌ను మ్యూజిక్ టీచ‌ర్‌. మొద‌ట ఓ రైలు న‌దిలో ప‌డ్డ ప్ర‌మాదంలో త‌ప్పించుకోగా, అనంత‌రం ఓ కార్ యాక్సిడెంట్ నుంచి తృటిలో సేవ్ అయిపోయాడు. మ‌ళ్లీ విమానం నుంచి కిందకి ప‌డ్డా త‌ప్పించుకున్నాడు. అనంత‌రం లాట‌రీలో 10 ల‌క్ష‌ల డాల‌ర్లు గెలుచుకున్నాడు. ఇంత‌కు మించిన అదృష్టవంతులు ఇంకెవ‌రైనా ఉంటారా..!

Comments

comments

Share this post

scroll to top