అపోలో ఆస్ప‌త్రిలో జ‌య చివ‌రి సారిగా మాట్లాడిన మాట‌లివే..!

ఈ ఏడాది గత సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌య‌ల‌లిత తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్ప‌త్రిలో చేరిన ద‌గ్గ‌ర్నుంచీ, మొన్నా మ‌ధ్య ఆమె మృతి చెందిన రోజు వ‌ర‌కు జ‌రిగిన అనూహ్య ప‌రిణామాల‌న్నింటినీ మ‌నం గ‌మ‌నిస్తూనే వ‌స్తున్నాం. ఈ క్ర‌మంలోనే అమ్మ మృతి ప‌ట్ల ప‌లు పుకార్లు షికార్లు కూడా చేస్తున్నాయి. వాటిలో వాస్త‌వ‌మెంతో తెలియ‌దు కానీ… ఇప్పుడు అలాంటిదే మ‌రో వార్త నెట్‌లో, ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ సృష్టిస్తోంది. నిజానికి అది వార్త కాదు. ఓ ఆడియో క్లిప్‌. జ‌య‌ల‌లిత హాస్పిట‌ల్‌లో ఉన్న‌ప్పుడు త‌మిళ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన చివ‌రి మాట‌లుగా అవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అందులో జ‌య‌ల‌లిత త‌మిళంలో మాట్లాడుతున్న‌ట్టుగా కూడా ఉంది. ఈ క్ర‌మంలో ఆ ఆడియో క్లిప్‌లో అమ్మ మాట్లాడిన మాట‌ల‌కు తెలుగు వెర్ష‌న్ ఇదే..! ఆ మాట‌ల‌ను ఇప్పుడు చూద్దాం..!

jayalalitha

‘అంద‌రికీ పాదాభివంద‌నం. న‌మ‌స్కారం. నేను మీ అమ్మ‌ను మాట్లాడుతున్నా. నా ఆరోగ్యం బాగు ప‌డాల‌ని ప్రార్థించే అంద‌రికీ హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. దేవుడు మీ మంచి మ‌న‌స్సుల కోసం న‌న్ను ఆరోగ్యంగానే ఉంచాడు. కొంత విశ్రాంతి త‌రువాత మీ ముందుకొచ్చి మాట్లాడే గుండె ధైర్యాన్ని ఆ భ‌గవంతుడు నాకు ఇచ్చాడు. నా ఆరోగ్యం గురించి వ‌చ్చే వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు. నా ఆరోగ్యం గురించి ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేస్తున్నాయి. వాటి గురించి మీరు అధైర్య ప‌డ‌వ‌ద్దు. ఎప్పటికీ మ‌న పార్టీయే అధికారంలో ఉంటుంది. నా ర‌క్తానికి ర‌క్త‌మైన అన్న అభిమానుల‌కు మ‌రియు ప్ర‌జ‌ల గుండెల్లో నా మీద ప్రేమ ఉన్నంత వ‌ర‌కు నేను ఆరోగ్యంగానే ఉంటా. నేను ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు మీ కోస‌మే నేను బ్ర‌తికి ఉంటా. ఏవిధంగా అయితే నన్ను సీఎంగా గెలిపించారో అదేవిధంగా మ‌ళ్లీ న‌న్ను గెలిపిస్తార‌ని న‌మ్ముతున్నాను. ఈ నెల 17, 19 తారీఖుల్లో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మెజార్టీ సీట్ల‌తో న‌న్ను గెలిపించుకుంటార‌ని ఆశిస్తున్నా.”

ఇవీ జ‌య ఆస్ప‌త్రిలో ఉన్న‌ప్పుడు చివ‌రి సారి జ‌నాల‌ను ఉద్దేశించి మాట్లాడిన‌ట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్ సారాంశం. అయితే వాస్త‌వానికి ఈ ఆడియో క్లిప్‌లో ఉన్నది జ‌య గొంతుకేనా, లేదా ఆమెను ఇమిటేట్ చేస్తూ ఎవ‌రైనా మిమిక్రీ చేశారా అన్న‌ది మాత్రం తెలియ‌దు. కానీ ఇది రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని జ‌య అనుకూల వ‌ర్గాలు బ‌య‌టికి రిలీజ్ చేసిన క్లిప్ అని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇందులో ఉన్న నిజం ఎంత అనేది ఆ దేవుడికే తెలియాలి..!

జ‌య మాట్లాడిన చివ‌రి మాట‌ల ఆడియో క్లిప్ ఇదే..!

Comments

comments

Share this post

scroll to top