పేక ముక్క‌ల్లో…ఒక రాజుకు మీసాలుండ‌వ్…మ‌రో రాజుకు ఒక్క క‌న్ను మాత్ర‌మే ఉంటుంది..మీరెప్పుడైనా గ‌మ‌నించారా?

ప్లేయింగ్ కార్డ్స్‌… అవేనండీ… పేక‌ముక్క‌లు..! వీటి గురించి తెలియ‌ని వారుండ‌రు. ఎన్నో ర‌కాల ఆట‌లను పేక‌ల‌తో ఆడ‌తారు. మూడు ముక్క‌లాట‌, రమ్మీ… ఇలా చెప్పుకుంటూ పోతే పేక‌ల ద్వారా ఆడే ఆట‌లు చాలానే ఉంటాయి. చాలా మంది ప్లేయింగ్ కార్డ్స్ ఆడ‌తారు. అయితే ఏ ఆట ఆడినా… అందులో సాధార‌ణంగా ఏస్ (A), రాజు (King) ల‌ను పెద్ద ముక్క‌లుగా భావిస్తారు. కానీ మీకు తెలుసా..?  కొన్ని దేశాల్లో రాణి (Queen) పెద్ద ముక్క అయితే కొన్ని దేశాల్లో 10వ అంకె దాటిన ముక్క‌ల‌న్నింటినీ పెద్ద‌గానే భావిస్తారు. అయితే… అన్ని ముక్క‌ల‌క‌న్నా పేక‌ల్లో రాజు (King) ముక్క‌కు ప‌వ‌ర్ ఉంటుంది. ఆ ముక్క‌కు కొన్ని ప్ర‌త్యేక‌త‌లు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..!

playing-cards
పేక ముక్క‌ల్లో క్ల‌బ్స్‌, స్పేడ్స్‌, హార్ట్స్‌, డైమండ్స్ అని నాలుగు ర‌కాలు ఉంటాయి క‌దా. అలాగే ఆ నాలుగు ర‌కాల్లో ఉండే రాజుల‌కు చెందిన విష‌యాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే…

కింగ్ ఆఫ్ క్ల‌బ్స్‌…
పేక ముక్క‌ల్లో ఉండే ఈ రాజుది చాలా మంచి క్యారెక్ట‌ర్ అట‌. ఇత‌ను చాలా న‌మ్మ‌క‌స్తుడ‌ట‌. ఏది మంచో, ఏది చెడో ఇత‌నికి తెలుస్తుంద‌ట‌. పేక ముక్క‌ల్లో ఈ కార్డు చాలా ప‌వ‌ర్‌ఫుల్ కార్డు అట‌. డైమండ్స్‌లో ఉండే రాణికి, ఈ రాజుకు ద‌గ్గ‌రి సంబంధం ఉంటుంద‌ట‌. ఫ్రెంచ్ వారు త‌మ పేక ముక్క‌ల్లో రాజు అలెగ్జాండ‌ర్‌ను కింగ్ ఆఫ్ క్ల‌బ్స్ గా భావిస్తారు.

కింగ్ ఆఫ్ స్పేడ్స్‌…
క‌త్తుల‌ను ప‌ట్టుకుని ఉండే ఈ రాజు తీర్పుల‌ను ఇవ్వ‌డంలో చాలా ప‌వ‌ర్‌ఫుల్ అట‌. అందుకు ఎవ‌రికీ లొంగ‌డ‌ట‌. ఈయ‌న‌పై అధికారం ఎవ‌రూ చెలాయించ‌లేర‌ట‌. ఫ్రెంచ్ వారు త‌మ పేక ముక్క‌ల్లో ఈ రాజును కింగ్ డేవిడ్‌గా భావిస్తారు.

kings-in-cards-1
కింగ్ ఆఫ్ హార్ట్స్‌…
ఫ్రెంచ్ వారు ఈ రాజును చార్లెస్ VII రాజుగా భావిస్తారు. ఈయ‌నను సూసైడ్ కింగ్ అని పిలుస్తారు. పేక ముక్క‌ల్లో ఈ రాజుకు మాత్ర‌మే మీసాలు ఉండ‌వు.

కింగ్ ఆఫ్ డైమండ్స్‌…
ఫ్రెంచ్ వారు త‌మ పేక ముక్క‌ల్లో ఈ రాజును సీజ‌ర్‌గా భావిస్తారు. ఈయ‌న మిగ‌తా ముగ్గురు రాజుల‌క‌న్నా విభిన్న‌మైన‌వాడు. ఈయ‌న‌కు ఒక క‌న్ను మాత్ర‌మే క‌నిపిస్తుంది. ఈయ‌న ఇత‌ని ఎడ‌మ చేతితో గొడ్డ‌లి ప‌ట్టుకుని కుడి చేతిని పైకి లేపి క‌నిపిస్తాడు.

పైన చెప్పిన త‌ర‌హా రాజులు ఉన్న పేక ముక్క‌ల‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ మంది ఉప‌యోగిస్తారు. అయితే ఇట‌లీ, జ‌ర్మ‌నీ, స్పెయిన్‌ల‌లో అక్క‌డి రాజుల‌కు అనుగుణంగా పేక ముక్క‌లు ఉంటాయి.

Comments

comments

Share this post

scroll to top