AirTel, Idea, BSNL, JIO…ల‌లో ఉన్న ది బెస్ట్ ప్లాన్స్ ఇవే.!!

జియో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇత‌ర టెలికాం కంపెనీల‌కు కంటి మీద కునుకు ఉండ‌డం లేదు. రోజుకో ప్లాన్ తో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తూ వారు త‌మ నెట్ వ‌ర్క్ నుంచి పోకుండా చూసుకుంటున్నాయి టెలికాం కంపెనీలు. మ‌రి నేనూరుకుంటానా అన్న‌ట్టుగా జియో కూడా అందుకు త‌గిన ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెడుతూనే ఉంది. అయితే ప్ర‌స్తుతం ప‌లు టెలికాం కంపెనీల్లో ఉన్న హాట్ ప్లాన్లు ఏంటో, ఏ ప్లాన్‌కు ఏమేం బెనిఫిట్స్ వ‌స్తాయో, ఎంత జీబీ డేటా వ‌స్తుందో చాలా మందికి క‌న్‌ఫ్యూజ‌న్‌గా ఉంది. ఈ క్ర‌మంలోనే ఆయా నెట్‌వ‌ర్క్‌ల‌లో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ప‌లు హాట్ ప్లాన్ల వివ‌రాల‌ను మీకందిస్తున్నాం. అవేమిటంటే…

ఎయిర్ టెల్‌లో…
1. రూ.349 ప్లాన్‌తో ప్రీపెయిడ్ యూజ‌ర్లు రీచార్జి చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో 28 జీబీ డేటా వ‌స్తుంది. రోజుకు 1 జీబీ డేటాను వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి.
2. రూ.449 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే 84 రోజుల వాలిడిటీతో 84 జీబీ డేటా వ‌స్తుంది. రోజుకు 1 జీబీ డేటా లిమిట్ ఉంటుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. ఈ ఆఫ‌ర్ కొత్త యూజ‌ర్ల‌కు వ‌ర్తిస్తుంది.
3. రూ.499 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో 35 జీబీ డేటా వ‌స్తుంది. రోజుకు 1.5 జీబీ డేటా వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి.

ఐడియాలో…
1. రూ.349 ప్లాన్ రీచార్జి చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో 28 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 1 జీబీ డేటా వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి.
2. రూ.344 ప్లాన్ రీచార్జి చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో 28 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 1 జీబీ డేటా వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. ఈ ఆఫ‌ర్ కొత్త వినియోగ‌దారుల‌కు వ‌ర్తిస్తుంది.
3. రూ.444 ప్లాన్ రీచార్జి చేసుకుంటే 84 రోజుల వాలిడిటీతో 84 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 1 జీబీ డేటా వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ల‌భిస్తాయి. ఈ ఆఫ‌ర్ కూడా కొత్త వినియోగ‌దారుల‌కు వ‌ర్తిస్తుంది.

బీఎస్ఎన్ఎల్‌లో…
1.రూ.339 ప్లాన్ రీచార్జి చేసుకుంటే 26 రోజుల వాలిడిటీతో 65 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి.
2.రూ.349 ప్లాన్ రీచార్జి చేసుకుంటే 26 రోజుల వాలిడిటీతో 78 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 3 జీబీ డేటా వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి.
3. రూ.395 ప్లాన్ రీచార్జి చేసుకుంటే 60 రోజుల వాలిడిటీతో 120 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి.
గ‌మ‌నిక‌: బీఎస్ఎన్ఎల్‌లో 4జీ అందుబాటులో లేదు. కేవ‌లం 3జీ డేటా మాత్ర‌మే వ‌స్తుంది.

జియోలో…
ఇందులో ఉండే ప్లాన్ల గురించి చాలా మందికి తెలుసు. అయినా మ‌రోసారి తెలియ‌జేయ‌డం జ‌రుగుతోంది.
1. రూ.309 ప్లాన్ రీచార్జి చేసుకుంటే 56 రోజుల వాలిడిటీతో 56 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 1 జీబీ డేటాను వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. జియో యాప్‌ల‌ను ఉచితంగా వాడుకోవ‌చ్చు.
2. రూ.399 ప్లాన్ రీచార్జి చేసుకుంటే 84 రోజుల వాలిడిటీతో 84 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 1 జీబీ డేటాను వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. జియో యాప్‌ల‌ను ఉచితంగా వాడుకోవ‌చ్చు.
3. రూ.509 ప్లాన్ రీచార్జి చేసుకుంటే 56 రోజుల వాలిడిటీతో 112 జీబీ డేటా ల‌భిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా వాడుకోవ‌చ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్‌, ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి. జియో యాప్‌ల‌ను ఉచితంగా వాడుకోవ‌చ్చు.

గ‌మ‌నిక‌: పైన చెప్పిన ప్లాన్లు అన్నీ 4జీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్న యూజ‌ర్ల‌కు మాత్రమే ల‌భిస్తాయి. ఇత‌ర మొబైల్స్ వాడితే పై ప్లాన్లు వ‌ర్తించ‌వు.

Comments

comments

Share this post

scroll to top