కొన్ని దేశాల్లో మహిళలపై ఉంటే అరాచకాల సాంప్రదాయాలు….ఫ్యాంట్ వేసుకోవడం, జాబ్ చేయడం విరుద్దమట.!

మ‌న దేశ‌మే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల్లో పురాత‌న కాలంగా స్త్రీల‌పై వివ‌క్ష కొన‌సాగుతూనే వ‌స్తోంది. ఈ విష‌యం గురించి అంద‌రికీ తెలుసు. నిత్యం మ‌హిళ‌లు ఏదో ఒక చోట వివ‌క్ష‌కు గుర‌వుతూనే ఉన్నారు. అది ఏ ప్రాంత‌మైనా కావ‌చ్చు, వారిపై ఎల్ల‌ప్పుడూ నియంత్ర‌ణ‌, అణ‌చివేత వంటి ధోర‌ణులు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా అవి త‌గ్గ‌డం లేదు స‌రిక‌దా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ప‌లు దేశాల్లో మ‌హిళ‌ల‌పై అక్క‌డి ప్ర‌భుత్వాలు వింత వింత చ‌ట్టాలు చేస్తూ, వారిపై నిబంధ‌న‌లు విధిస్తూ వారిని ఇంకా అంధ‌కూపంలోకి నెట్టివేస్తున్నాయి. ప్ర‌పంచం ఓ వైపు ఆధునిక‌త వైపు, నూత‌న టెక్నాల‌జీ దిశ‌గా ప‌రుగులు తీస్తున్నా మ‌హిళ‌ల‌పై అలాంటి చ‌ట్టాలు, నిబంధ‌న‌లు, వివ‌క్షలు ఇంకా రూపుమాప‌డం లేదు. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

women-discrimination

1. అమెరికాలోని వెర్మాంట్ అనే రాష్ట్రంలో భార్య‌లు కృత్రిమ దంతాల‌ను ధ‌రించ‌కూడ‌దు. భ‌ర్త అనుమ‌తితోనే ఆ ప‌నిచేయాల్సి ఉంటుంది. లేదంటే శిక్ష‌కు గుర‌వుతారు.

2. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మ‌హిళ‌లు హెయిర్ క‌ట్ చేయించుకోవాలంటే ముందుగా ప్ర‌భుత్వ అనుమ‌తి తీసుకోవాల‌నే నిబంధ‌న ఉంది.

3. ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో మ‌హిళ‌లు లెద‌ర్ షూస్ ధ‌రించ‌కూడదు.

4. స్వాజిలాండ్ అనే ప్రాంతంలో మ‌హిళ‌లు ప్యాంట్లు ధ‌రించ‌కూడ‌దు.

5. ఫ్లోరిడాలో సింగిల్‌గా ఉన్న‌, డైవోర్స్ తీసుకున్న లేదా భ‌ర్త‌ను కోల్పోయిన మ‌హిళ‌లు స్కై డైవిన్ చేయ‌కూడ‌దు.

6. ఇరాన్‌లో స్టేడియంల‌లో జ‌రిగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ల‌కు స్త్రీల‌ను అనుమ‌తించ‌రు.

7. యెమెన్‌లో మ‌హిళలు త‌మ భ‌ర్త అనుమ‌తి లేకుండా ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్ల‌కూడ‌దు.

8. ట‌ర్కీలో భ‌ర్త అనుమ‌తి లేకుండా భార్య‌లు జాబ్ చేయడం చ‌ట్ట విరుద్ధం.

9. వాటిక‌న్ న‌గ‌రంలో మ‌హిళ‌ల‌కు ఓటు వేసే హ‌క్కు లేదు. అలాగే వారు సొంతంగా డైవోర్స్ ఇచ్చే హ‌క్కు కూడా లేదు.

10. వ‌ర్జీనియా వేన్స్‌బొరోలో మ‌హిళ‌లు కార్ డ్రైవింగ్ చేయ‌కూడ‌దు. భ‌ర్త ఎర్ర‌ని జెండాతో ముందుకు క‌దిలే స‌మ‌యంలో వారు డ్రైవింగ్ చేయ‌వ‌చ్చు.

11. న్యూ మెక్సికో, కారిజోజో అనే ప్రాంతాల్లో మ‌హిళ‌లు త‌మ శ‌రీరంపై ఉన్న వెంట్రుక‌ల‌ను షేవ్ చేసుకోకుండా బ‌య‌టికి రావ‌డం నిషేధం.

12. నెవాడా, యురేకా ప్రాంతాల్లో మీసాలు ఉన్న పురుషులు మ‌హిళ‌ల‌ను ముద్దు పెట్ట‌కోవ‌డం నిషేధం.

13. బొలీవియా లా పాజ్‌లో పెళ్ల‌యిన మ‌హిళ ఒక గ్లాస్ క‌న్నా ఎక్కువ వైన్ తాగ‌కూడ‌దు.

14. ఇడాహోలో 22.5 కిలోల కన్నా ఎక్కువ బ‌రువున్న క్యాండీల‌ను పురుషులు మ‌హిళ‌ల‌కు ఒక బాక్స్‌లో గిఫ్ట్ ఇవ్వ‌కూడ‌దు.

Comments

comments

Share this post

scroll to top