అక్క‌డి విద్యార్థులు చ‌ద‌వుకోసం….జీవితాల‌నే ప‌ణంగా పెడ‌తారు.! ఫోటోలు చూస్తే మీరే ఆశ్చ‌ర్య‌పోతారు!!

స్కూల్‌కి వెళ్లే పిల్ల‌ల‌కు కేజీల కొద్దీ బ‌రువుండే పుస్త‌కాల‌తో కూడిన బ్యాగులు… మెదడుపై అధికంగా ఒత్తిడిని కలిగించే చ‌దువులు, హోం వ‌ర్క్‌… భ‌య‌పెట్టే ప‌రీక్ష‌లు… ఇవ‌న్నీత‌ప్ప‌వు. జీవితంలో ఉన్న‌త స్థానాల‌కు ఎద‌గాలంటే ఆ మాత్రం క‌ష్ట‌ప‌డాల్సిందే. అయితే ఏ ప్రాంతంలో ఉండే పిల్ల‌ల‌కైనా ఈ భారాలు మామూలే. కానీ ఇప్పుడు మేం చెప్ప‌బోయే ప్రాంతాల్లో నివాసం ఉండే పిల్ల‌ల‌కు మాత్రం వీటితోపాటు మ‌రో భారం కూడా ఎదుర‌వుతోంది. అది స్కూల్‌కి వెళ్లే ప్ర‌యాణం రూపంలో. ఎందుకంటే వారు పాఠ‌శాల‌కు వెళ్లే దారులు అంత‌టి ప్ర‌మాద‌క‌రంగా ఉంటాయి క‌నుక‌. ఈ క్ర‌మంలోనే అలాంటి ప్రమాద‌క‌ర‌మైన దారులు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

china-gulu

1. చైనాలోని గులు అనే ప్రాంతంలో ఉన్న ఆ స్కూల్‌కు వెళ్లాలంటే విద్యార్థులు ప‌ర్వ‌తాల అంచుల‌పై న‌డుస్తూ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన స్థితిలో ప్రయాణం చేయాల్సిందే. అందుకు గాను వారికి రాను పోను దాదాపుగా 5 గంట‌ల‌కు పైగానే స‌మయం ప‌డుతుంది.

Zhang-Jiawan

2. ద‌క్షిణ చైనాలో ఉన్న జాంగ్ జియావాన్ అనే గ్రామంలో స్కూల్ కొండ‌ల‌పై ఉంది. దానికి చేరుకునేందుకు పిల్ల‌ల‌కు నిచ్చెన‌లే గ‌తి. నిచ్చెన‌ల‌పై వెళ్తూ ప్ర‌మాద‌క‌ర‌మైన స్థితిలో వారు రోజూ స్కూల్‌కు వెళ్తుంటారు.

Zanskar

3. హిమాల‌య ప‌ర్వ‌తాల్లో ఉండే జంస్క‌ర్ అనే ప్రాంతంలో ఉన్న స్కూల్‌కు వెళ్లాలంటే విద్యార్థులు ప్రమాద‌క‌ర‌మైన మంచు కొండ‌ల మ‌ధ్య న‌డ‌వాల్సి ఉంటుంది.

lebak

4. ఇండోనేషియాలో లెబాక్ అనే ప్రాంతంలో ఉన్న స్కూల్‌కు వెళ్లాలంటే పిల్ల‌లు న‌దిపై ఉన్న ఓ వైపు తెగిన వంతెన‌పై ప్రాణాపాయ స్థితిలో ప‌య‌నించాల్సి ఉంటుంది.

negro

5. కొలంబియాలోని రియో నెగ్రో అనే న‌దిపై 400 మీట‌ర్ల ఎత్తులో ఉండే ఓ తాడు వంతెన‌పై పిల్ల‌లు క‌ప్పీ స‌హాయంతో జారుతూ అవ‌త‌లి ఒడ్డుకు చేరుకుని స్కూల్‌కు వెళ్తారు.

Riau

6. ఇండోనేషియాలోని రియావు అనే ప్రాంతంలో పిల్ల‌లు బోటుపై న‌దిలో స్కూల్‌కు వెళ్తారు.

tree-bridge

7. మ‌న దేశంలో ఉన్న ఓ ప్రాంతంలోని పిల్ల‌లు న‌దిపై ఉన్న చెట్ల వేర్ల బ్రిడ్జిపై నుంచి ప్ర‌యాణించి స్కూల్‌కు వెళ్తారు.

Sichuan-Province

8. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉన్న డుజియంగ్యాన్ స్కూల్‌కు పిల్ల‌లు వంతెన‌పై మంచు తుపాన్‌లో న‌డుచుకుంటూ వెళ్తారు.

kerala-boat

9. మ‌న దేశంలోని కేర‌ళలోనైతే కొన్ని పాఠ‌శాల‌ల విద్యార్థులు బోట్ల‌పైనే స్కూళ్ల‌కు వెళ్తారు.

srilanka-road

10. శ్రీ‌లంక‌లో ఓ ప్రాంతంలో రెండు కొండ‌ల మ‌ధ్య వేసిన ఓ చెక్కపై న‌డుచుకుంటూ అక్క‌డి విద్యార్థులు అత్యంత ప్ర‌మాద‌క‌ర స్థితిలో స్కూల్‌కు వెళ్తారు.

Cilangkap-village

11. ఇండోనేషియాలో సిలాంగ్ క్యాప్ అనే గ్రామంలో ఉన్న స్కూల్‌కు వెళ్లాలంటే పిల్లలు వెదురు బొంగుల‌తో చేసిన ఓ స‌మ‌త‌లంగా ఉన్న ప‌డ‌వ‌లాంటి చెక్క‌పై ప్ర‌మాద‌క‌ర స్థితిలో ప్రయాణిస్తారు.

china-pili

12. చైనాలోని పిలి అనే ప్రాంతంలో ఉన్న బోర్డింగ్ స్కూల్‌కు వెళ్లాలంటే పిల్లలు 125 మైళ్ల పొడ‌వు ఉన్న ప‌ర్వ‌తాల అంచుల‌పై ప్ర‌మాద‌క‌ర స్థితిలో ప్ర‌యాణం చేయాల్సిందే.

padang

13. ఇండోనేషియాలోని ప‌డంగ్ అనే ప్రాంతంలో ఉన్న స్కూల్‌కు వెళ్లాలంటే విద్యార్థులు న‌దిపై 30 మీట‌ర్ల ఎత్తులో క‌ట్ట‌బ‌డిన ఓ తాడుకు వేళ్లాడుతూ ప్ర‌మాద‌క‌ర స్థితిలో న‌దిని దాటి స్కూల్‌కు వెళ్తారు.

Comments

comments

Share this post

scroll to top