కోరిన కోర్కెలు తీర్చే కామ‌ధేనువు ఎలా ఉద్భవించిందో తెలుసా?

అమృతం కోసం దేవ‌త‌లు, రాక్ష‌సులు ఆదిశేషువు తాడుగా మంధ‌ర పర్వ‌తాన్ని క‌ర్ర‌గా చేసుకుని క్షీర సాగ‌రాన్ని మ‌థిస్తారు. ఈ విష‌యం దాదాపుగా అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ క్షీర సాగ‌ర మ‌థ‌నంలో అనేక ర‌కాల వ‌స్తువులు వ‌స్తాయి. వాటితోపాటు కామ‌ధేనువు కూడా మ‌థ‌నం నుంచి ఉద్భ‌విస్తుంది. ఈ ఆవునే సుర‌భి అని కూడా పిలుస్తారు. అయితే మ‌హాభార‌తం ప్ర‌కారం ఈ క‌థ ప్ర‌చారంలో ఉంది. కానీ సుర‌భి ఆవు ఉద్భ‌వించ‌డం వెనుక ప‌లు ర‌కాల భిన్న‌మైన క‌థ‌నాలు కూడా ప్ర‌చారంలో ఉన్నాయి. అవేమిటంటే…

kamadhenuvu

రామాయ‌ణం ప్ర‌కార‌మైతే రుషి క‌శ్య‌పుడు, అత‌ని భార్య క్రోధ‌వ‌శ‌ల కుమార్తె సుర‌భి. ఆమెకు మ‌ళ్లీ ఇద్ద‌రు కూతుళ్లు జ‌న్మిస్తారు. వారు రోహిణి, గోదావ‌రి. ప‌శువుల‌న్నింటికీ మూలం వీరే అని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలో సుర‌భి కోరిన కోర్కెలు తీర్చే కామ‌ధేనువుగా మారింద‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే దేవీ భాగ‌వతం చెబుతున్న దాని ప్ర‌కార‌మైతే శ్రీ‌కృష్ణుడే స్వ‌యంగా సుర‌భి ఆవును బృందావ‌నంలో సృష్టించాడ‌ట‌.

ఓ రోజు శ్రీకృష్ణుడు రాధ‌, ఇత‌ర గోపిక‌ల‌తో బృందావ‌నంలో నాట్య‌మాడుతుండ‌గా అక‌స్మాత్తుగా కృష్ణునికి తీవ్ర‌మైన దాహం వేస్తుంద‌ట‌. దీంతో శ్రీ‌కృష్ణుడు అప్ప‌టిక‌ప్పుడే సుర‌భిని సృష్టించి దాని పాల‌ను తాగుతాడ‌ట‌. అయితే ఒకానొక రోజు సుర‌భి ఆవు పాల‌ను ఇవ్వ‌డం మానేస్తుంద‌ట‌. దీంతో అంద‌రూ బ్ర‌హ్మ వ‌ద్ద‌కు వెళ్లి స‌మ‌స్య‌ను ప‌రిష్కరించ‌మ‌ని అడ‌గ్గా అప్పుడు బ్ర‌హ్మ‌, ఓమ్ సుర‌భాయి న‌మః అనే మంత్రం ప‌ఠించండ‌ని చెబుతాడ‌ట‌. దీంతో అంద‌రూ అలాగే చేస్తారు. అప్పుడు సుర‌భి మళ్లీ పాలివ్వ‌డం మొద‌లు పెడుతుంద‌ట‌. అప్ప‌టి నుంచి ఆ ఆవు పాలు అత్యంత తియ్యగా ఉండేవ‌ని చెబుతున్నారు.

kamadhenuvu-1

అయితే శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడు ఓ సారి సుర‌భి ఆవు పాల‌ను గిన్నెలో ప‌ట్ట‌గా అప్పుడు కృష్ణుడికి ఓ ఆలోచ‌న వ‌చ్చి పెద్ద చెరువు లాంటి ప్ర‌దేశాన్ని సృష్టిస్తాడ‌ట‌. దాంట్లో ర‌త్నాలు, రాశులు కుప్ప‌లుగా నింపుతాడ‌ట‌. అనంత‌రం సుర‌భిని కోరిన కోరిక‌లు తీర్చే కామ‌ధేనువుగా మారుస్తాడ‌ట‌. అంతే కాకుండా శ్రీ‌కృష్ణుడు రాజ్యం చేసిన స‌మ‌యంలోనే కామ‌ధేనువు మూత్రాన్ని అనేక వ్యాధుల‌ను న‌యం చేయ‌డం కోసం ఉప‌యోగించేవార‌ట‌. కాగా నిజానికి కామ‌ధేనువు ఆవు ఇప్ప‌టి ఆవులా కాక‌, స్త్రీ త‌ల‌తో, స్త‌నాల‌తో ముందు భాగంలో ఉండి, వెనుక అంతా ఆవులాగే ఉండేద‌ట‌. ఇక చివ‌రిగా ఇంకో విష‌యం ఏమిటంటే కామ‌ధేనువు ఆవునే అన్ని ఆవుల‌కు త‌ల్లిగా భావించ‌డం అప్ప‌టి నుంచే మొద‌లైంద‌ట‌.

Comments

comments

Share this post

scroll to top