బ‌రువు త‌గ్గ‌డం కోసం వాడే …ఈ 14 ట్యాబ్లెట్స్ , శృంగార సామ‌ర్థ్యంకోసం వాడే ఈ 19 ట్యాబ్లెట్స్ ను నిషేదించారని మీకు తెలుసా?

స్లిమ్‌గా అవడానికి మాత్రలు వాడుతున్నారా..? సెక్స్ సామర్థ్యం పెరగడానికి టాబ్లెట్స్ ఉపయోగిస్తున్నారా..? నీరసాన్ని పోగొట్టుకోవాలనో, శరీర సౌష్టవం కోసమో..మెడిసిన్స్ ఉపయోగిస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే. సాధ్యమయినంత వరకూ వీటికి దూరంగా ఉండాలని దుబాయి ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. లావు తగ్గి స్లిమ్‌గా మారేందుకు 14 రకాల మెడిసిన్స్, శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు 19 రకాల మాత్రలను.. దేశ వ్యాప్తంగా దుబాయి పౌరులు అధికంగా ఉపయోగిస్తున్నారని ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో వెల్లడయింది.
స్లిమ్‌గా అవడానికి వాడే మాత్రల్లో ఉండే నిషేధిత ఔషధాల వల్ల రక్తపోటు అధికమయి, గుండె వేగం పెరుగుతుందట. నోటిలో వెంటవెంటనే తడి ఆరిపోవడం, నిద్ర రాకపోవడం వంటి విపత్కర పరిణామాలకు కారణమవుతాయి. శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు వాడుతున్న మాత్రల వల్ల దీర్ఘకాలంలో నపుంసకత్వానికి దారితీసే ప్రమాదం లేకపోలేదన్నారు. గుండె పనితీరును ఈ మాత్రలు విపరీతంగా ప్రభావితం చేసి గుండెపోటుకు కారణమవుతాయని హెచ్చరించారు. ఏ ఏ మాత్రలు వాడకూడదో వాళ్లొక లిస్టు విడుదల చేసారు..
స్లిమ్‌గా అయేందుకు వాడుతున్న నిషేధిత మెడిసిన్స్:
 • Idol Slim Coffee
 • Super Slimming Herb
 • Refwa Royal Power
 • AB Slim- Cellulose Capsule
 • Slimming Body Capsule Plus
 • Miaomiao Slimming Capsule
 • Natural Chinese Medicine Magic Slim
 • Super Fat Burning
 • Quick Slimming Capsule Plus
 • Sliming Bomb
 • Health Slimming Capsules
 • Natural Max Slimming
 • Health Aid-Hoodia Gordonii-Kalahari Desert Capsules
 • Burning Fat Slimming Capsule Diet
శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు వాడుతున్న నిషేధిత మాత్రలు: 
 • Refwa Royal Power
 • Power Male Sexual Stimulant
 • King of Romance
 • CONTROL All Natural Sexual Enhancement
 • Boss Number #Six
 • Bull’s Genita
 • Golden Night
 • Mamba is Hero
 • Neophase Natural Sex Enhance
 • Salute Capsules
 • Sextra
 • Weekend Prince
 • Wonder-Erect Male Gum
 • Old Chinese
 • XtraHRD
 • African Viagra
 • Black 3K Plus
 • Rhino 7K 9000
 • Rhino 8 Platinum 8000
మన దగ్గర కూడా స్లిమ్ గా అవడానికి,పొడుగు అవ్వడానికి అంటూ అనేక రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటాం..వాటికంటే ముందుగా మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటే ఆటోమేటిక్ గా ఇతరులకు నచ్చుతాం..మన ఆహారంలో,జీవనశైలిలో మార్పులు తెచ్చుకుని ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి అంతే తప్ప మందులపై ఆధారపడితే మరిన్ని సమస్యలు కొనితెచ్చుకున్నవారమవుతాం..

Comments

comments

Share this post

scroll to top