మ‌నిషి చితాభ‌స్మం నుంచి వ‌జ్రాలు…. వెలికితీతలో బిజీగా స్విట్జర్లాండ్ సైంటిస్ట్ లు.!

వ‌జ్రం… దీనికి ఎంత విలువ ఉంటుందో ఎవ‌రైనా ఇట్టే చెప్ప‌గ‌లుగుతారు. ధ‌న‌వంతులు మాత్ర‌మే కొన‌గ‌లిగే ఎంతో విలువైన రాయి ఇది. కొన్ని వేల ఏళ్ల కింద‌ట భూమిలో జ‌రిగిన కొన్ని ప్ర‌త్యేక క్రియ‌ల ద్వారా ఏర్ప‌డ్డ ఖ‌నిజాల నుంచి వ‌జ్రాల‌ను వెలికి తీస్తారు. ఈ ప్ర‌క్రియ గురించి అంద‌రికీ తెలుసు. అయితే ఈ భూ ప్ర‌పంచంలో వ‌జ్రాల‌ను ఎవ‌రు వెలికి తీసినా ఆ ప్ర‌క్రియంతా ఒకేలా ఉంటుంది. కానీ మాన‌వుడి చితాభ‌స్మం నుంచి కూడా వ‌జ్రాల‌ను వెలికి తీయ‌వ‌చ్చ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మీరు ఎంత ఆశ్చ‌ర్య‌పోయినా మేం చెబుతోంది నూటికి నూరుపాళ్లు నిజం. అమెరికాకు చెందిన ఓ సంస్థ ఇదే ప‌ద్ధతిలో వ‌జ్రాల‌ను వెలికి తీయ‌వ‌చ్చ‌ని నిరూపించింది కూడా. ఇంత‌కీ ఏంటా సంస్థ‌..? వారు ఏ ప‌ద్ధ‌తిలో వ‌జ్రాల‌ను వెలికి తీస్తున్నారు..?

ash

స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన అల్గోడ్డాంజా అనే కంపెనీ వారికి 33 దేశాల్లో పెద్ద పెద్ద ల్యాబొరేట‌రీలు ఉన్నాయి. వారికి ఉన్న అమెరికా బ్రాంచ్ ల్యాబ్‌లో అక్క‌డి సైంటిస్టులు ఇటీవ‌లే ఓ కొత్త ప‌ద్ధ‌తిని క‌నుగొన్నారు. అదేమిటంటే, వారు చ‌నిపోయిన మ‌నుషులను ద‌హ‌నం చేశాక వ‌చ్చే చితాభ‌స్మం నుంచి వ‌జ్రాల‌ను వెలికితీసే విధానాన్ని క‌నిపెట్టారు. దీనికి మ్యాన్‌-మేడ్ డైమండ్ అనే పేరు కూడా పెట్టేశారు. సాధార‌ణంగా ఒక వ‌జ్రం స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తిలో భూమిలో ఏర్ప‌డాలంటే అందుకు కొన్ని వేల ఏళ్లు ప‌డుతుంద‌ట‌. కానీ ఆ ల్యాబ్ వారు మాత్రం కేవ‌లం కొన్ని వారాల్లోనే మ‌నిషి చితాభ‌స్మం నుంచి వ‌జ్రాన్ని త‌యారు చేస్తున్నార‌ట‌.

lab

diamond-making

బ‌తికి ఉన్న మ‌నిషిలో 18 శాతం కార్బ‌న్ అనే మూల‌కం ఉంటుంద‌ట‌. అయితే అదే మ‌నిషి చ‌నిపోయాక అత‌న్ని ద‌హ‌నం చేశాక దాన్నుంచి వ‌చ్చే చితాభ‌స్మంలో దాదాపుగా 2 శాతం కార్బ‌న్ ఉంటుంద‌ట‌. దీన్నుంచే వ‌జ్రం తయారు చేస్తార‌ట‌. అయితే ముందుగా మ‌నిషి చితాభ‌స్మాన్ని సేక‌రించాక దాన్ని అత్యంత అధిక స్థాయి ఉష్ణోగ్ర‌తల వ‌ద్ద వేడి చేస్తార‌ట‌. అది గ్రాఫైట్‌గా మారుతుంది. అనంత‌రం దానిపై దాదాపుగా 8.70 ల‌క్ష‌ల పీఎస్ఐ బ‌రువు క‌లిగిన పీడ‌నాన్ని క‌లిగిస్తారు. అనంత‌రం వ‌చ్చే ప‌దార్థాన్ని 2700 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్ర‌త‌ల వ‌ద్ద మ‌ళ్లీ వేడి చేస్తారు. అలా వేడి చేయ‌గా తెలుపు లేదా నీలి రంగులో ఉండే వ‌జ్రం త‌యార‌వుతుంద‌ట‌. ఇలా త‌యారైన వ‌జ్రం 1 క్యారెట్ నాణ్య‌త‌ను క‌లిగి ఉంటుంద‌ట‌. ఇలా వ‌జ్రం త‌యారు చేయ‌డానికి కొన్ని వారాల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంద‌ట‌. అయితే ఇలా వ‌జ్రం కావాల‌నుకునే వారు 4,474 డాల‌ర్లు (సుమారు రూ.3ల‌క్ష‌లు) చెల్లించాలి.

diamonds

తెలుసుకున్నారుగా, మ‌నిషి చితాభ‌స్మం నుంచి వ‌జ్రాన్ని ఎలా త‌యారు చేయ‌వచ్చో. అయితే రానున్న 4 ఏళ్ల‌లో ఎక్కువ మంది అమెరిక‌న్లు ఈ ప‌ద్ధ‌తి ద్వారా త‌మ కుటుంబీకుల చితాభ‌స్మాల నుంచి వ‌జ్రాల‌ను త‌యారు చేయించుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. ఎందుక‌య్యా అంటే, చనిపోయాక త‌మ కుటుంబ స‌భ్యులెవ‌రైనా స‌మాధిలోనో, లేదంటే బూడిద రూపంలో ఉంటారు కానీ, ఇలా డైమండ్ చేయించుకుంటే వారు ఎంచ‌క్కా త‌మ‌తోనే ఉన్నార‌న్న భావ‌న క‌లుగుతుంది క‌దా… అందుకోస‌మ‌ట‌. అంతేలే… ఎవ‌రి ఆనందం వారిది మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top