90 ఏళ్ల వ‌య‌స్సులోనూ ఆ గ్రామ మ‌హిళ‌లు చ‌దువుకుంటున్నారు..!వారికి చదువు చెప్పేది ఎవరో తెలుసా?

నేర్చుకోవాల‌నే త‌ప‌న ఉండాలే గానీ అందుకు వ‌య‌స్సుతో ప‌నిలేదు. ఎవ‌రు ఏ వ‌య‌స్సులో ఉన్నా, ఏ అంశాన్నైనా నేర్చుకోవ‌చ్చు. చ‌దువు రాని వారు చ‌దువుకోవ‌చ్చు కూడా. అందుకు వ‌య‌స్సు అడ్డంకి కాదు. స‌రిగ్గా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు ఆ గ్రామ మ‌హిళ‌లు… కాదు బామ్మ‌లు..! వారంతా 60 నుంచి 90 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సున్న బామ్మ‌లు. ఒక‌ప్పుడు చ‌దువుకోలేదు. కానీ… ఇప్పుడు ఓ వ్య‌క్తి ప్రోత్సాహంతో ఏకంగా బ్యాంకు ఫాంలు నింప‌డం, సంత‌కాలు పెట్ట‌డం వంటి చిన్న చిన్న ప‌నులు కూడా అల‌వోక‌గా చేసుకోగ‌లుగుతున్నారు. దీంతో ఆ బామ్మ‌లు ఉంటున్న గ్రామం ఇప్పుడు 100 శాతం అక్ష‌రాస్య‌త‌ను సాధించింది.

ajibainchi-shala

fangane-women

అది మ‌హారాష్ట్ర‌లోని థానేలో ఉన్న ఫంగానే గ్రామం. అక్క‌డ ఓ సారి యోగేంద్ర బంగ‌ర్ అనే ఓ 45 ఏళ్ల వ్య‌క్తి స్థానికంగా ఉన్న మ‌హిళ‌ల‌ను చూశాడు. వారు సుల‌భ‌త‌ర‌మైన వాక్యాల‌ను మాట్లాడేందుకే చాలా ఇబ్బందులు ప‌డ‌డం గ‌మ‌నించాడు. దీనికి తోడు వారికి చ‌దువు అస్స‌లే రాదు, దీంతో చ‌దువు రాని కార‌ణంగా ఆ మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను అన్నింటినీ అత‌ను స్వ‌యంగా చూశాడు. ఈ క్ర‌మంలోనే ఆ మ‌హిళ‌ల‌కు చ‌దువు నేర్పించ‌డం కోసం ఆ గ్రామంలో అజిబైంచి శాల అనే ఓ ఓల్డేజ్ పాఠ‌శాల‌ను ప్రారంభించాడు. అందులో 60 నుంచి 90 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న వృద్ధ మ‌హిళ‌ల‌కు చ‌దువు చెప్ప‌డం ప్రారంభించాడు. అయితే యోగేంద్ర వారికి చ‌దువు చెప్ప‌డం కోసం నిత్యం 75 కిలోమీట‌ర్ల‌కు పైగా ప్ర‌యాణం చేసి ఆ గ్రామానికి వ‌స్తుండ‌డం విశేషం.

fangane-women-1

fangane-women-2

fangane-women-3

అలా యోగేంద్ర చాలా నెలల నుంచి ఆ గ్రామంలో ఉన్న వృద్ధ మ‌హిళ‌లు చ‌దువు చెబుతున్నాడు. మ‌రాఠీ అక్ష‌రాలు రాయ‌డం, చ‌ద‌వ‌డం, మాట్లాడ‌డం, ఆంగ్లం, హిందీ, లెక్క‌లు వంటి అన్ని అంశాల‌ను బోధించేవాడు. దీంతో ఆ మ‌హిళ‌లు కూడా శ్ర‌ద్ధ‌గా నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఇప్పుడు ఆ స్కూల్‌లో మొత్తం 29 మందికి పైగానే మ‌హిళ‌లు చ‌దువు నేర్చుకుంటున్నారు. వారిలో అత్యంత ఎక్కువ వ‌య‌స్సున్న మ‌హిళ పేరు రాంబాయి. ఆమె వ‌య‌స్సు 87 సంవ‌త్స‌రాలు. అయినా ఎంతో ఓపిగ్గా ఆ వృద్ధురాలు చ‌దువు నేర్చుకుంటూ ఉంటుంది. అయితే ఆ మ‌హిళ‌లు స్కూల్ పిల్లల్లాగే యూనిఫాం ధ‌రిస్తారు. ఏక‌రూపంగా ఉండే చీర‌ల‌ను ధ‌రించి నిత్యం ఉద‌యాన్నే స్కూల్‌కు వ‌చ్చి ప్రార్థ‌న చేసి అనంత‌రం విద్యార్థులు నేర్చుకున్న‌ట్టే పాఠాలు నేర్చుకుంటారు. దీంతో ఇప్పుడు ఆ గ్రామం 100 శాతం అక్ష‌రాస్య‌త‌ను సాధించింది. అంతేకాదు, చ‌దువుకోవ‌డం వ‌ల్ల‌నో ఏమో గానీ, ఇప్పుడా గ్రామ ప్ర‌జ‌లు శుభ్రంగా ఉంటున్నారు. ఆ గ్రామంలో అంద‌రూ మ‌రుగుదొడ్ల‌ను కూడా నిర్మించుకున్నారు. అదీ… చ‌దువు గొప్ప‌త‌నం… ఇదంతా యోగేంద్ర చ‌ల‌వే అంటే న‌మ్మ‌గ‌ల‌రా..!

Comments

comments

Share this post

scroll to top