దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను చక్కగా ఫాలో అవుతుంటారు సినిమా వాళ్లు..ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఆయా వ్యాపారాల్లో కూడా తమ అదృష్టాన్ని పరిక్షించుకుంటారు..ఏమో సినిమా అవకాశాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం..ఎవరు ఓవర్ నైట్ స్టార్ అవుతారో..ఎవరూ ఏ సినిమాతో చతికిలపడతారో అస్సలు అర్దం కాదు…అందుకే సినిమా అవకాశాలకి తోడు వేరే ఆదాయమార్గాలు చూసుకోవడం తప్పేం కాదుగా..సినిమా వాళ్లు ఎక్కువగా హీరోయిన్స్ ఇంటీరియర్స్ అటువైపు దృష్టిపెడితే, హీరోస్ రెస్టరెంట్స్,ఈవెంట్స్ ఇటువైపుగా కాన్సన్ట్రేషన్ చేస్తుంటారు..అలాంటి వాళ్లలో ప్రముఖ హీరోలు ఉండడం విశేషం..
#1. నవదీప్
జై సినిమాతో పరిచయం అయిన నవదీప్ చందమామతో సూపర్ హిట్టు కొట్టారు..ఆ తర్వాత బాద్షా,ధృవ సినిమాల్లో నటించారు..ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టంట్ గా ఉన్నారు..మరొవైపు గచ్చిబౌలిలో బిపిఎమ్ అనే పబ్ ఉంది నవదీప్ కి..బిపిఎం అంటే బీట్స్ ఫర్ మినిట్..ఇక్కడ ఎక్సోటిక్ డ్రింక్స్ తో పాటు టేస్టీ స్ట్రాటర్స్ కూడా ఉంటాయి.
#2. శర్వానంద్
ఇటీవల శతమానంభవతితో హిట్ కొట్టిన శర్వానంద్ మహానుభావుడుగా మన ముందుకు రాబోతున్నాడు..సినిమాల్లోకి వచ్చాక మొదటి నుండి కూడా ఆచితూచి అడుగులేస్తూ మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అరకు లాంటి ప్రాంతాల్లో ఉండే వాతావరణాన్ని హైదరాబాద్ లో ప్రతిబింబించేలా బాంబూ స్టిక్స్ తో ,పచ్చటి చెట్లమధ్య ఉన్నట్టు ఏర్పాటు చేసిన కాఫీ షాప్ నిర్వహణ చూసుకుంటున్నాడు..దీని పేరు బీన్జ్ కాఫీ షాప్..తెలుగువంటకాలైన బజ్జీలు ,పునుగులు ఇక్కడ బాగా ఫేమస్..
#3. అల్లు అర్జున్
మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా జూబ్లీహిల్స్ లో పబ్ ఉంది.అదే 800జూబ్లీ..వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి ఇది మంచి ప్లేస్..ఇక్కడ పలు రకాల డ్రింక్స్ తో పాటు ఫుడ్ ఐటెంస్ కూడా అందుబాటులో ఉంటాయి.
#4. నాగార్జున
యువసామ్రాట్ నాగార్జున రెస్టారెంట్ పేరు ఎన్ గ్రిల్..ఈ రెస్టారెంట్ ని మీరు మనం సినిమాలో చూడొచ్చు.అందులో నాగార్జున సమంతాకి పాఠాలు చెప్పే సీన్ ఈ రెస్టరెంట్ లోనే తీశారు..చాలా చాలా లగ్జీరియస్ ఇంటీరియర్ తో ఉన్న ఈ రెస్టరెంట్ ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే ప్లేసుల్లో ఇది ఒకటి..
#5. సందీప్ కిషన్
వివాహ భోజనంబు..వింతైన వంటకంబు కాన్సెప్ట్ ని సందీప్ కిషన్ ఫాలో అవ్వడమే కాదు తన రెస్టరెంట్ కు కూడా అదే పేరుపెట్టుకున్నాడు..వివాహ భోజనంబు అని..రాయలసీమ రుచులు,తెలంగాణా ,ఆంధ్రా వంటకాలు అన్నీ ఇక్కడ దొరుకుతాయి..నాన్ వెజ్ థాలీ ఇక్కడ స్పెషల్ ..అండ్ వెరీ టేస్టీ అని టాక్..
#6. సురేందర్ రెడ్డి
అతనొక్కడే తో దర్శకుడిగా పరిచయం అయి కిక్ ,రేసుగుర్రం,ధృవ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా మారిన సురేందర్ రెడ్డి కూడా రెస్టరెంట్ రంగంలో కి అడుగుపెట్టారు..మొదట కొత్తగా ఏదన్నా రెస్టారెంట్ ని ప్రారంబించాలనుకున్న ఆయన రిస్క్ ఎందుకు అని ..సౌత్ ఇండియన్ రెస్టరెంట్ ఉలవచారు ఫ్రాంచైజీ తీసుకున్నారు..
#7. శశాంక్
సై సినిమాతో మంచి గుర్తింపు పొందిన శశాంక్.. అనుకోకుండా ఒక రోజు లో ఛార్మీ తో నటించారు,.అడపాదడపా క్యారెక్టర్ ఆర్టీస్టుగా నటిస్తూనే ఉన్నారు.మరోవైపు మాయాబజార్ రెస్టరెంట్ నిర్వహణ చూసుకుంటున్నారు..సింపుల్ ఇంటీరియర్స్,మాయాబజార్ థీమ్స్ తో ఫ్యామిలిస్ ని అట్రాక్ట్ చేసే ఈ రెస్టరెంట్ లో మొగలాయి ఫుడ్ చాలా ఫేమస్..
#8. సారా డే జేన్స్
పంజాలో పవన్ కళ్యాణ్ సరసన నటించిన సారా కి ది బటర్ ఫ్లై బేకరి అనే బేకరీ ఉంది..ఇది కప్ కేక్స్ కి బాగా ఫేమస్..కప్ కేక్స్ తో యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న ఈ బేకరికి వెళ్లాలంటే మీరు ముంబై వెళ్లాలి..