కుటుంబం కోసం 5 సంవ‌త్సరాల వ‌య‌స్సునుండే క‌ష్ట‌ప‌డ్డ సినిమా తార‌లు!

టాలీవుడ్ లో స్టార్లు గా ఎదిగిన చైల్డ్ ఆర్టిస్టులు ఒకప్పుడు కుటుంబ బాద్యత మీదేసుకుని కుటుంబాన్ని పోషించారు..ఆడుతూ  పాడుతూ  సాగాల్సిన బాల్యం యాక్షన్ ,స్టార్ట్,కెమేరా ల మద్య మగ్గిపోయింది..వాళ్లు నటిస్తే తప్ప ఇల్లుగడవని పరిస్థితి .. ఆ స్టార్లు ఎవరో తెలుసుకోండి…

శ్రీదేవి..

అతిలోక సుందరి గా మన అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్న శ్రీదేవి బాల్యం చాలా కష్టాల్లో గడిచింది.వాళ్లమ్మ జూనియర్ ఆర్టిస్టు..తల్లి అరకొర సంపాదనతో నడుస్తున్న కుటుంబం..ఒకసారి తల్లితోపాటు షూటింగ్ స్పాట్ కి వెళ్లిన శ్రీదేవిని చూసిన డైరెక్టర్ ఒక సీన్ ఇచ్చి చేయమంటే..అప్పటివరకు నటన అంటే తెలియని శ్రీదేవి నటన చూసి షాక్ అయ్యారట..అలా స్టార్ట్ అయిన శ్రీదేవి నటప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగింది.NTR,ANR లాంటి ఆనాటి నటులే కాదు,చిరంజీవి ,నాగార్జున లతో కూడా నటించి అభిమానులను అలరించింది.

షాలిని,షామిలి:

అక్కాచెల్లెల్లది ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలి.. పూట గడవని పరిస్థతిలో ఇంటికి దగ్గరలో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ షాలినిని చూసి సినిమా అవకాశాలు ఇప్పించాడు..అయినా అంతంతమాత్రమే షాలిని చెల్లెలు షామిలి తో మణిరత్నం తీసిన అంజలి సినిమా వాళ్ల దశ మార్చేసింది. చైల్డ్ సూపర్ స్టార్ అంజలి రెమ్యునరేషన్ అప్పటి స్టార్ హీరోల రెమ్యునరేషన్కి సమానంగా ఉండేది.  షామిలి జగదేకవీరుడు అతిలోకసుందరి,కిల్లర్,జోకర్ తదితర సినిమాల్లో నటించింది.సఖి సినిమా ద్వారా శాలిని హీరోయిన్ గా పరిచయం అయి,తర్వాత అజిత్ ను పెళ్లి చేసుకుంది.ఓయ్ సినిమాలో సిద్దు పక్కన నటించిన షామిలి తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో నటించిన రిషి వీళ్లిద్దరి బ్రదర్.

తనీష్ :

అమ్మా,నాన్న ఇద్దరు తమ్ముల్లు ఇదీ తనీష్ ఫ్యామిలి.తనీష్ నటనే కాకుండా,చైల్డ్ ఆర్టిస్ట్స్ కు డబ్బింగ్ చెప్పడం ద్వారా వచ్చే సంపాదనే ఆధారం.నచ్చావులే సూపర్ హిట్ వరకు వాళ్ల పరిస్థితి  చాలా కష్టంగా గడిచేది.దేవుళ్లు లో అయ్యప్ప స్వామిగా,మన్మధుడు లో సోనాలి తమ్ముడిగా ఇతర సినిమాల్లో నటించిన తనీష్ రైట్,మేం వయసుకు వచ్చాం సినిమాల్లో హీరోగా నటించాడు.పాండవులు పాండవులు తుమ్మెదా సినిమాలో మోహన్ బాబు,విష్ణు,మనోజ్,వరుణ్ సందేశ్ లతో కలిసి నటించాడు.

భరత్..

ఇతరులతో పోలిస్తే భరత్ పడిన కష్టాలు తక్కువే.కానీ తల్లిదండ్రుల ఇన్ కం తో పోలిస్తే భరత్ సంపాదనే ఎక్కువ.రెడీ,ఢీ,నమో వెంకటేశా,దూకుడు,రామ రామ క్రిష్ణ క్రిష్ణ,మిష్టర్ ఫర్ఫెక్ట్,రగడ,సిద్దు ఫ్రం సికాకులం ఇంకా అనేక హిట్ సినిమాలలో భరత్ నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది

Comments

comments

Share this post

scroll to top