ఒకే మందు ఎక్కువ రోజులుగా వాడుతున్నారా..? అయితే కొద్ది రోజులు తరవాత అవి మీ శరీరానికి పని చేయవంట..!

సూప‌ర్ బ‌గ్స్ అంటే మీకు తెలుసా..? అవును, కంప్యూట‌ర్ల సాఫ్ట్‌వేర్ల‌కు సంబంధించిన‌వే క‌దా..! అని అన‌బోతున్నారా..? అయితే ఆగండి. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్ప‌బోయేది ఆ సూప‌ర్ బ‌గ్స్ కాదు. వేరేవి. మ‌నం విప‌రీతంగా యాంటీ బ‌యోటిక్స్‌తోపాటు వివిధ ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల‌ను పార‌దోలేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను వాడుతాం క‌దా. ఆ… అవును. అయితే అవే మెడిసిన్లు కొంత కాలానికి ప‌నిచేయ‌కుండా పోతున్నాయి. ఎందుకంటే స‌ద‌రు ఇన్‌ఫెక్ష‌న్ల‌ను క‌లిగించే బాక్టీరియా, వైర‌స్‌లు ఆ మందుల‌కు అల‌వాటు ప‌డిపోయి అలా త‌యార‌వుతున్నాయ‌ట‌. అందుకే మ‌నం వాడే మందులు కొంత కాలం త‌రువాత ప‌నిచేయ‌డం లేదు. అప్పుడు కొత్త‌గా మందులు క‌నిపెట్టి రోగుల‌కు ఇవ్వాల్సి వ‌స్తుంది. ఇది ప్ర‌స్తుతం సైంటిస్టుల‌కు త‌ల‌నొప్పిగా మారింది. అయితే ఈ క్ర‌మంలోనే అలా మ‌నం వాడే మందుల‌ను త‌ట్టుకునే ప‌లు బాక్టీరియా, క్రిముల‌నే సూప‌ర్ బ‌గ్స్ అని వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Acinetobacter baumannii
మ‌న శ‌రీరంలో ఏర్ప‌డే ఇన్‌ఫెక్ష‌న్ల‌ను న‌యం చేయ‌డం కోసం యాంటీ బ‌యోటిక్స్ మందుల‌ను వాడుతాం క‌దా. వాటి వ‌ల్ల ఈ సూప‌ర్ బ‌గ్ ఏర్ప‌డుతుంది. ఇది మ‌న శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ఫై అటాక్ చేసి దాన్ని దెబ్బ తీస్తుంది.

2. Pseudomonas aeruginosa
శ‌రీరంలో ఏర్ప‌డే విష ప‌దార్థాల‌ను తొల‌గించ‌డం కోసం ఇచ్చే మందుల వ‌ల్ల ఈ సూప‌ర్ బ‌గ్ వృద్ది చెందుతుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఇన్‌ఫెక్ష‌న్లు కూడా వ‌స్తాయి.

3. Enterobacteriaceae
carbapenem అనే విభాగానికి చెందిన మందుల‌ను వాడ‌డం వ‌ల్ల ఈ సూప‌ర్ బ‌గ్ వృద్ధి చెందుతుంది.

4. Enterococcus faecium
పేగుల్లో ఏర్ప‌డే ఇన్‌ఫెక్ష‌న్ల‌ను నయం చేయ‌డం కోసం ఇచ్చే యాంటీ బ‌యోటిక్ మందుల వ‌ల్ల ఈ సూప‌ర్ బ‌గ్ వృద్ధి చెందుతుంది.

5. Staphylococcus aureus
vancomycin, methicillin అనే రెండు ర‌కాల యాంటీ బ‌యోటిక్స్‌ను వాడే వారిలో ఈ సూప‌ర్ బ‌గ్ పెరుగుతుంది. ఇది ఎక్కువ‌గా ముక్కు, శ్వాస‌కోశ అవ‌య‌వాల్లో ఉంటుంది.

6. Helicobacter pylori
జీర్ణాశ‌యంలో ఏర్ప‌డే అల్స‌ర్ల‌ను న‌యం చేసేందుకు వాడే మందుల వ‌ల్ల ఈ సూప‌ర్ బ‌గ్ పెరుగుతుంది. ఇది ఎక్కువ‌గా జీర్ణాశ‌యంలోనే ఉంటుంది.

7. Campylobacter
మూత్రాశ‌య‌, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను తీర్చేందుకు వాడే మందుల వ‌ల్ల ఈ సూప‌ర్ బ‌గ్ వృద్ధి చెందుతుంది.

8. Salmonellae
fluoroquinolone మందును త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల ఈ సూప‌ర్ బ‌గ్ దానికి వ్య‌తిరేకంగా త‌యార‌వుతుంది. అప్పుడు ఆ మందును మళ్లీ వాడినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

9. Neisseria gonorrhoeae
శ‌రీరంలో ఏర్ప‌డే ఇన్‌ఫెక్ష‌న్ల‌ను తొలగించేందుకు వాడే cephalosporin అనే మందు వ‌ల్ల ఈ సూప‌ర్ బ‌గ్ పెరుగుతుంది. దీని వ‌ల్ల గ‌నేరియా వంటి సుఖ వ్యాధులు కూడా వ‌స్తాయి.

10. Streptococcus pneumoniae
పెన్సిల‌న్ త‌ర‌హా యాంటీ బ‌యోటిక్స్ వాడే వారిలో ఈ సూప‌ర్ బ‌గ్ వృద్ధి చెందుతుంది. దీని వ‌ల్ల న్యుమోనియా వంటి వ్యాధులు వ‌స్తాయి.

11. Haemophilus influenzae
ampicillin అనే మందును త‌ర‌చూ వాడే వారిలో ఈ త‌ర‌హా సూప‌ర్ బ‌గ్ పెరుగుతుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఇత‌ర ఇన్‌ఫెక్ష‌న్లు కూడా వ‌స్తాయి.

12. Shigella
fluoroquinolone అనే మందును త‌ర‌చూ వాడే వారిలో ఈ త‌ర‌హా సూప‌ర్ బ‌గ్ వృద్ధి చెందుతుంది. దీని వ‌ల్ల డ‌యేరియా, డీసెంట్రీ వంటి అనారోగ్యాలు క‌లుగుతాయి.

Comments

comments

Share this post

scroll to top