ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకునేందుకు ఈ 10 టిప్స్ ఉపయోగపడతాయి. అవి ఏమిటో తెలుసా .?

ఈ రోజుల్లోఅబద్ధం చెప్పడం సాధారణమై పోయింది. కొన్ని సందర్భాలలో పర్వాలేదు కానీ ఒక్కొక్క సారి నిజం తెలుసుకోలేక పోవడం వల్ల చాలా ఇబ్బందులు పడవలసి రావచ్చు.ఎదుటి వ్యక్తి ఏదైనా విషయం దాచి పెడుతున్నప్పుడు లేదా అబద్ధం చెబుతున్నప్పుడు అతడి బాడీ తీరుని బట్టి పసిగట్టవచ్చు.ఎదుటి వ్యక్తి చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకునేందుకు ఈ 10 టిప్స్ ఉపయోగపడతాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.

అబద్ధం చెప్పాల్సి వచ్చిన సందర్భంలో అవసరాని కంటే ఎక్కువగా మాట్లాడుతుంటారు. అనవసరమైన పొంతనలేని వివరణలు ఇస్తుంటారు. చెప్పే అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటంలో భాగంగానే ఇలా జరుగుతుంటుంది. చెప్పిన విషయాన్ని పదే పదే చెప్తుంటారు. ఎక్కడ దొరికి పోతామో అనే భయం వారిలో కనిపిస్తుంది.

అబద్ధం చెప్పే వారి మాటలు ఒక్కోసారి కన్ఫ్యూజన్ గా ఉంటాయి. మీరు అడిగే ప్రశ్నలకు నేరుగా బదులు ఇవ్వరు. అస్సలు విషయం కంటే మిగతా విషయాల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. అబద్ధం చెప్పేటప్పుడు తమకు తెలియకుండానే కాసేపైనా నోటికి చేతిని అడ్డు పెడతారు. ఎవరైనా మీతో మాట్లాడేటప్పుడు ముఖాన్ని చేతులతో తాకుతున్నారా ? లేదా పెదాలను తాకుతున్న వారు అబద్ధాలు చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అర్ధం.

ఒక్కసారి ఎదుటి వ్యక్తి బాడీ తీరుని పరిశీలించండి. ఈ విషయానికి భయపడవలసిన అవసరం లేనప్పుడు రిలాక్స్ గా ఉంటారు. ఏదైనా విషయాన్ని దాచిపెట్టాలని భావించినప్పుడు చాలా మంది తమ చేతులను ఛాతికి అడ్డు వచ్చేలా క్రాస్ గా పెట్టి కూర్చుంటారు. అదే పనిగా పాదాలను కదుపుతూ ఉంటారు. సదరు వ్యక్తిలో భయం పెరుగుతుంది అనడానికి ఇది సూచికం .అబద్ధం చెప్పే వాళ్ళు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడలేరు. మీరు చూసినా కూడా వారు చూపు తిప్పుకుంటారు. మీరు వారి వైపుకు చూసినప్పుడల్లా పక్కకు చూపు తిప్పుకోవడానికి ప్రయత్నింస్తుంటారు. నిశింతంగా పరిశీలించే శక్తి మీకుంటే అబద్ధం చెప్పే వ్యక్తి ముఖంలో భయాన్ని గమనించ వచ్చు. వారు ఎక్కువగా నవ్వుతుంటారు. వారి కను బొమ్మలు వణుకుతూ ఉంటాయి.

చాలా కాలంగా తెలిసిన వ్యక్తిలో ఇలాంటి మార్పులను మీరు ఈజీగా పట్టేయవచ్చు. మీరు ఏదైనా ట్రిక్కి గా ఉన్న ప్రశ్న అడిగితే వారి బాడీ తీరులో మార్పు రావడం స్పష్టంగా గమనించ వచ్చు. అబద్ధం చెప్పేవారు తలను అసంకల్పితంగా ఎక్కువగా కదిలిస్తుంటారు. గట్టిగా శ్వాస తీసుకోవడం అనేది అబద్ధం చెప్పే వారిలో సాధారణంగా కనిపించే లక్షణం. వారి మాటలోనూ ఆందోళన కనిపిస్తుంది. వారు శ్వాస తీసుకునే క్రమం మారుతుంటుంది.

Comments

comments

Share this post

scroll to top