ప‌నిచేయ‌కుండానే జీతం తీసుకుంటున్న జ‌పాన్ పోలీసులు.!

మ‌నుషుల‌న్నాక చెడ్డ వారు ఉంటారు. మంచి వారు ఉంటారు. మంచి వారుంటే ఫ‌ర్లేదు. చెడ్డ‌వారుంటే నేరాలు పెరుగుతాయి. ప్రపంచంలో మ‌నుషులు ఉండే ఏ ప్రాంతాన్ని తీసుకున్నా అక్క‌డ నేరాలు చేసే వారుంటారు. హ‌త్య‌లు, దోపిడీలు, దాడులు, కిడ్నాప్‌లు.. ఇలా నేరాలలో చాలా ర‌కాలు ఉంటాయి. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆయా దేశాల్లోని న‌గ‌రాల్లో ఏ న‌గ‌రంలో నేరాలు చాలా త‌క్కువ‌గా జ‌రుగుతున్నాయో, ఏది ప్ర‌జ‌ల‌కు అత్యంత సుర‌క్షిత‌మైన న‌గ‌ర‌మో మీకు తెలుసా..? టోక్యో..! అవును, అదే. జ‌పాన్ రాజ‌ధాని. అక్క‌డ నేరాల సంఖ్య చాలా త‌క్కువ‌ట‌. ఎంత‌గా అంటే అక్క‌డ గ‌త 13 సంత్స‌రాలుగా నేరాల రేటు చాలా త‌క్కువ‌గా ఉంద‌ట‌.

జ‌పాన్‌లోని టోక్యోలో మాత్ర‌మే కాదు, ఆ దేశ‌మంత‌టా ఏ ప్రాంతాన్ని తీసుకున్నా అక్క‌డ ఏటా ల‌క్ష‌ల మందిలో కేవ‌లం ఒక్క‌రు మాత్ర‌మే నేరాల‌కు పాల్ప‌డుతున్నార‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. గ‌త 13 సంవ‌త్స‌రాలుగా జపాన్‌లో నేరాల రేటు బాగా త‌గ్గింద‌ట‌. దీంతో ఇప్పుడ‌క్క‌డ పోలీసుల‌కు అస్స‌లు పనిలేకుండా పోయింద‌ట. ఇక గ‌తేడాది కాలంలో జ‌పాన్‌లో కేవ‌లం ఒక్క హ‌త్య కేసు మాత్ర‌మే న‌మోదైంద‌ట‌. ఇక జ‌పాన్‌లో టీచ‌ర్ల త‌రువాత ప్ర‌జ‌లు గౌర‌విస్తున్న వృత్తి పోలీస్ వృత్తేన‌ట‌. జ‌పాన్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికైతే పోలీసులంటే అమిత‌మైన గౌర‌వ‌మ‌ట.

మరి ప‌నిలేక‌పోతే పోలీసులు ఇప్పుడ‌క్క‌డ ఏం చేస్తున్నారు..? అని మీరు అడ‌గ‌వ‌చ్చు. అయితే వారికి పోలీస్‌గా ప‌నిలేద‌న్న మాట నిజ‌మే. కానీ వారు స‌మాజానికి ప‌నికొచ్చే ప‌నులు మాత్రం చేస్తూనే ఉన్నారు. అక్క‌డి పోలీసులు ప్ర‌జ‌ల‌కు జూడో, క్యాలిగ్ర‌ఫీల‌లో శిక్ష‌ణ ఇస్తున్నారు. అందుకు గాను దేశ వ్యాప్తంగా 15వేల కొబ‌న్ పోలీస్ బాక్స్‌ల‌ను ఏర్పాటు చేశారు. అంతేకాదు, జ‌పాన్ పోలీసులు త‌మ స్వ‌ద‌స్తూరితో న్యూస్ పేప‌ర్లు రాస్తార‌ట‌. వాటిల్లో నేరాలు, యాక్సిడెంట్లు, ప‌లు మంచి నీతి క‌థల గురించి ఉంటుంద‌ట‌. కాగా జ‌పాన్ పోలీసుల గురించి మ‌న‌కు తెలుస్తున్న ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. వారి వ‌ద్ద ఉండే తుపాకుల‌ను కూడా వారు వాడ‌ర‌ట‌. ఏడాదికి కేవ‌లం 6 బుల్లెట్లు మాత్ర‌మే ఫైర్ చేస్తార‌ట‌. అదీ అవ‌స‌రం అనుకుంటేనే. లేదంటే లేదు. ఇంత‌టి ప్ర‌శాంత‌మైన దేశం కాబ‌ట్టే జపాన్ రాజ‌ధాని టోక్యో ప్ర‌పంచంలోనే అత్యంత సుర‌క్షిత‌మైన న‌గ‌రంగా పేరు గాంచింది.

Comments

comments

Share this post

scroll to top