టీమిండియాకు రిక్వెస్ట్ : ప్లీజ్ 2 నిమిషాల కంటే ఎక్కువసేపు స్నానం చేయకండి.! ఎందుకంటే.?

విదేశీ టూర్లకు మ‌న భార‌త క్రికెట‌ర్లు వెళ్లిన‌ప్పుడు అక్క‌డి ప‌రిస్థితుల‌ను త‌ట్టుకోవ‌డం నిజంగా వారికి కొంత క‌ష్టంగానే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. వాతావ‌ర‌ణం, ఆహారం, ఇత‌ర సౌక‌ర్యాల విష‌యంలో క్రికెట‌ర్లు ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న ఇండియ‌న్ క్రికెట‌ర్ల‌కు మాత్రం కొత్త చిక్కులు వ‌చ్చి ప‌డ్డాయి. అయితే అవి ఆహారం, వాతావ‌ర‌ణం విష‌యంలో కాదు, నీటి విష‌యంలో. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. నీటి వ‌ల్లే ఇప్పుడు మ‌న క్రికెటర్లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

టీమిండియా క్రికెట‌ర్లు ఇప్పుడు సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు క‌దా. అయితే వారికి నీటి విష‌యంలో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌స్తుతం మ్యాచ్ జ‌రుగుతున్న కేప్‌టౌన్‌లో గ‌త కొంత కాలంగా తీవ్ర‌మైన నీటి స‌మ‌స్య ఉంది. దీంతో చాలా త‌క్కువ నీళ్ల‌తో స్నానం చేయాల‌ని, ష‌వ‌ర్ల కింద గంట‌ల త‌ర‌బ‌డి గ‌డ‌ప‌కూడ‌ద‌ని, వీలున్నంత త్వ‌ర‌గా స్నానం ముగించుకుని బ‌య‌టికి రావాల‌ని సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారులు మ‌న క్రికెట‌ర్ల‌కు చెప్పారు.

అయితే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారులు చెప్పిన సూచ‌న‌ల ప‌ట్ల కొంద‌రు భార‌త క్రికెట‌ర్లు విమ‌ర్శలు చేస్తున్నారు. తాము సౌతాఫ్రికా వ‌చ్చింది ఆ జ‌ట్టుతో క్రికెట్ ఆడి గెలిచేందుకు కానీ.. ఇలాంటి చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను అస్స‌లు ప‌ట్టించుకోమ‌ని చెబుతున్నారు. ఇంకా కొంద‌రు అయితే సౌతాఫ్రికా అధికారులు చెప్పిన‌ట్టుగా కేవ‌లం 2 నిమిషాల్లోనే ష‌వ‌ర్ బాత్ ముగించుకుని స్నానం చేశామా, లేదా అన్నంత వేగంగా వ‌స్తున్నార‌ట‌. అయితే నీటి కొర‌త స‌మ‌స్య ఉన్న మాట వాస్త‌వేమ‌న‌ని, అందువ‌ల్లే పిచ్‌పై ప‌చ్చిక పెంచ‌లేక‌పోతున్నామ‌ని, కౌప్‌టౌన్ క్రికెట్ స్టేడియం క్యురేట‌ర్ కూడా చెప్పాడు. అయినా.. నీటి స‌మ‌స్య ఎక్క‌డ లేదు చెప్పండి..! అంత‌టా ఉంది. కానీ ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇరు వ‌ర్గాలు కొంత ప‌ట్టువిడుపులు ఉండాలి. వివాదాల‌కు దిగ‌కూడ‌దు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top