రాణీ ప‌ద్మావతి వాస్త‌వ క‌థ‌కు, సినిమాకు క‌థ‌కు ఉన్న 5 తేడాలు ఇవే తెలుసా..?

దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కులంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ప‌ద్మావ‌తి. ప‌ద్మావ‌త్‌గా పేరు మార్చుకుని ఎట్ట‌కేల‌కు వీక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే సినిమా రిలీజ్ నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ పొందుతోంది. దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు మిన‌హా చాలా ప్రాంతాల్లో ఈ సినిమా న‌డుస్తోంది. క‌ర్ణిసేన బెదిరింపులు ఉన్నా, నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చేప‌ట్టినా సినిమాకు మాత్రం సుప్రీం కోర్టు స‌పోర్ట్ ఉండ‌డంతో దేశంలో అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ప‌ద్మావ‌త్ సినిమా విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. అయితే సినిమా విష‌యానికి వ‌స్తే దీన్ని రాణి ప‌ద్మావ‌తి వాస్తవ గాథ ఆధారంగా తీశామ‌నే ఓ టాక్ న‌డుస్తున్న‌ప్ప‌టికీ నిజానికి య‌దార్థ గాథ‌కు, సినిమా క‌థ‌కు చాలా తేడాలున్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాణీ ప‌ద్మావ‌తికి మాట్లాడే చిలుక ఒక‌టి స్నేహితురాలిగా ఉంటుంది. దాన్ని ఆమెకు ఆమె తండ్రి బ‌హుమతిగా ఇస్తాడ‌ట‌. అయితే స‌దరు మాట్లాడే చిలుక గురించి సినిమాలో ఎక్క‌డా చెప్ప‌లేదు. ఇదొక మేజ‌ర్ చేంజ్‌గా మ‌న‌కు సినిమాలో క‌నిపిస్తుంది.

2. సినిమాలో రాణీ ప‌ద్మావ‌తి, రాజా ర‌త‌న్ సింగ్‌లు చాలా సింపుల్‌గా క‌లుసుకోవ‌డం చూపించారు. కానీ వాస్తవ క‌థ విష‌యానికి వ‌స్తే రాణీ ప‌ద్మావ‌తి వ‌ద్ద ఉండే చిలుక త‌ప్పి పోతుంద‌ట‌. అలా త‌ప్పిపోయిన చిలుక‌ను వెతికి ప‌ట్టుకునే క్ర‌మంలో రాణీ ప‌ద్మావతి రాజా ర‌త‌న్ సింగ్‌ను అనుకోకుండా క‌లుస్తుంద‌ట‌. కానీ సినిమాలో వారి తొలి ప‌రిచ‌యాన్ని చాలా సింపుల్‌గా చూపించారు. దానికి, వాస్త‌వ క‌థ‌కు అసలు పొంత‌న లేదు.

3. రాణీ ప‌ద్మావతి స్త్రీ అనేగానీ యోధుడైన రాజుకి ఏమాత్ర తీసిపోని విధంగా యుద్ధ విద్య‌ల్లో నేర్ప‌రిగా ఉంటుంది. అయితే వాస్త‌వ క‌థ‌లో రాణిని యుద్ధ విద్య‌ల్లో ఓడించిన ర‌త‌న్ సింగ్‌కు ఆమెను ఇచ్చి వివాహం చేస్తారు. అలా స్వ‌యం వ‌రం ఏర్పాటు చేస్తారు. కానీ సినిమాలో వీరి పెళ్లి చాలా సింపుల్ గా జ‌రిగిపోతుంది. ఇలాంటి స్వ‌యం వ‌రం ఏదీ ఉండ‌దు.

4. అద్దంలో రాణి ప‌ద్మావ‌తి ప్ర‌తిబింబాన్ని చూసిన అల్లావుద్దీన్ ఖిల్జీ ఆమెను ద‌క్కించుకోవ‌డం కోసం రాజా ర‌త‌న్ సింగ్‌ను మోస‌పూరితంగా అప‌హ‌రిస్తాడు. త‌న బందీగా ఉంచుకుంటాడు. అనంత‌రం జ‌రిగే యుద్ధంలో ర‌త‌న్ సింగ్ మ‌ర‌ణిస్తాడు. దీంతో రాణీ ప‌ద్మావ‌తి ఆమె చెలిక‌త్తెలు స‌తీ స‌హ‌గ‌మ‌నం చేస్తారు. ఇది వాస్త‌వ క‌థ‌లో ఉంది. కానీ సినిమాలో కొంత మార్పుతో దీన్ని చూపిన‌ట్టుగా మ‌న‌కు తెలుస్తుంది.

5. ఇక చివ‌రిగా చెప్పాలంటే అస‌లు రాణీ ప‌ద్మావ‌తి చ‌రిత్ర‌కు సంబంధించి 5 నుంచి 8 ర‌కాల క‌థలు ప్ర‌చారంలో ఉన్నాయి. రాణీ ప‌ద్మావ‌తి 16వ శతాబ్దానికి చెందిన‌దిగా చెబుతుండ‌గా, ఆమె తరువాత 250 సంవ‌త్స‌రాల‌కు గానీ ఆమె క‌థ జ‌నాల‌కు తెలియ‌లేదు. దీంతో అస‌లు ఆమె క‌థ నిజ‌మేనా లేక క‌ల్ప‌నా అన్న వాద‌న కూడా ఉంది.

ఏది ఏమైనా వాస్త‌వ క‌థ‌ను ప‌క్క‌న పెడితే ద‌ర్శ‌కుడు సంజయ్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ప‌ద్మావ‌త్ చిత్రం మాత్రం ఒక క‌ళాఖండంగా మిగిలిపోతుంద‌ని సినీ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top