ప్రపంచపు ప్రసిధ్ధ ఉత్తరం! తప్పక చదవండి.

కొడుకు ఉజ్వల భవిష్యత్ కోసం ఓ తండ్రి ఎన్నెన్ని కలలు కంటాడో, ఎంతగా ఆరాటపడతాడో అచ్చుగుద్దినట్టు కనిపిస్తుంది ఈ  ఉత్తరంలో , ఇంతకీ ఈ ఉత్తరం ఎవరు ఎవరికి రాసారో తెలుసా…..? అమెరికా మాజీ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ తన కుమారుని స్కూల్ టీచర్ కు రాసాడు.

అమ్మా,

అతడింకా ఎంతో నేర్చుకోవాలి.ఈ లోకంలో మనుష్యులంతా దయామయులు, నీతిమంతులు,నిజాయితీ పరులు కారనే విషయం అతడు గ్రహించాలి. దుర్మార్గులతో పాటు, మంచివారుకూడా ఉంటారని శత్రువులతో పాటు మిత్రులూ ఉంటారనే యథార్థాన్ని అతనికి నేర్పండి.

నాకు తెలుసు వాడు ఇది తెలుసుకోవడానికి సమయం పడుతుంది. ఇతరత్రా లభించే 5 డాలర్ల కన్నా, కష్టపడి సంపాదించే 1 డాలర్ సంతృప్తినిస్తుంది.ఓటమి గురించి అతడు తెలుసుకోవాలి.గెలుపు సాధించి ఆనందించడం అతను నేర్చుకోవాలి.అయితే అసూయకు మాత్రం అతడిని దూరంగా ఉంచండి. నేర్పగలిగితే చిరునవ్వులోని రహస్యాన్ని అతనికి నేర్పండి.అలాగే పుస్తకాలు చేసే అద్బుతాలను గురించి అతనికి తెలియాలి.

abraham-lincoln-quotes-with-images

మోసంతో గెలవడం కన్నా, సన్మార్గంలో ప్రయత్నించి,విఫలం కావడమే ఎంతో గౌరవమని అతనికి బోధించండి. ఇతరులు తప్పుపడుతున్నా తన సొంత నిర్ణయాలపై అతడికి నమ్మకం ఉంచుకోమని తెలపండి. సౌమ్యులతో సౌమ్యంగా, కఠినాత్ములతో దృఢంగా వ్యవహరించే అలవాటు నేర్పండి…ఏడ్వడంలో, కన్నీటిని కార్చడంలో సిగ్గు పడాల్సిన అవసరం లేదని నేర్పండి.

తల్లీ,…… మీరతనితో మృదువుగా ప్రవర్తించండి, కానీ గారాబం చేయకండి. ఎందుకంటే బాగా కాలితేనే ఇనుము మెత్తబడి,రకరకాల పనిముట్లుగా ఉపయోగపడుతుంది. అతడెప్పుడూ ధైర్యసహాసాలతో మెలగాలని నా కోరిక. నిరంతరం తనపై గొప్ప విశ్వాసం ఉండేలా చూడండి….. అమ్మా…. దయచేసి మీరు నేర్పగలిగినంత వరకు శక్తివంచన లేకుండా పసివాడికి నేర్పండి.

                                                                                                                                           ఇట్లు:

                                                                                                                                          అబ్రహం లింకన్

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top