పొట్టి డ్రెస్సులు వేసుకున్నార‌ని గ‌ర్ల్స్‌ను ఏడిపించిన మ‌హిళ‌లు. గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన వేరే గ‌ర్ల్‌..! రియ‌ల్ ఇన్సిడెంట్‌..!

”ఆ రోజు నేను బ‌స్‌లో వెళ్తున్నా. అందులో చాలా మంది వ‌ర‌కు ఆడ‌వారే ఉన్నారు. ఇద్ద‌రు గ‌ర్ల్స్‌ను చూశా. వారు అప్పుడే స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసి వ‌స్తున్న‌ట్టున్నారు. వారి దుస్తుల‌ను చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. వారు షార్ట్స్‌, లూజ్ టీ ష‌ర్ట్స్ వేసుకున్నారు. అలా వారిని చూసి అనుకున్నా. అప్పుడే ఏదైనా స్పోర్ట్ ప్రాక్టీస్ చేసి వ‌స్తున్నారని. ఇంత‌లో ఆ గ‌ర్ల్స్ ప‌క్క‌నే ఉన్న కొంద‌రు మ‌హిళ‌లు వారిని అదో ర‌కంగా చూడ‌డం మొద‌లు పెట్టారు. ఎలా అంటే… అలాంటి అస‌హ్య‌మైన దుస్తులు ఎందుకు వేసుకున్నారు..? అని అనిపించేలా ఆ గ‌ర్ల్స్‌ను ఆ మ‌హిళలు చూస్తున్నారు.

ఇంత‌లో ఆ మ‌హిళ‌లు, గ‌ర్ల్స్ మ‌ధ్య మాట‌లు మొద‌ల‌య్యాయి. మొద‌ట మ‌హిళ‌లు అన్నారు, చూడండి.. గ‌ర్ల్స్ ఇలా డ్రెస్సులు వేసుకోబ‌ట్టే రేప్‌లు జ‌రుగుతున్నాయి. వాళ్లు, వారి డ్రెస్‌లు. సిగ్గుండాలి, అలాంటి డ్రెస్ వేసుకున్నందుకు. అని మ‌హిళ‌లు గ‌ర్ల్స్‌ను అంటున్నారు. దీంతో ఆ గ‌ర్ల్స్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. అలాగే సిగ్గుతో నిలుచున్నారు. మొద‌ట నేనూ మాట్లాడ‌లేదు. కామ్‌గానే ఉన్నాను. కానీ ఆ గ‌ర్ల్స్‌ను వారు ఇంకా త‌మ మాట‌ల‌తో టార్చ‌ర్ పెట్ట‌డం ప్రారంభించారు. దీంతో తోటి గ‌ర్ల్ గా నేను ఆ గ‌ర్ల్స్‌కు స‌పోర్ట్‌నిద్దామ‌ని ముందుకు వెళ్లా.

అప్పుడు నేన‌న్నా… చూడండి, గ‌ర్ల్స్ ఇలాంటి డ్రెస్‌లు వేసుకున్నందుకు రేపిస్టులు త‌యారు కావ‌డం లేదు, మీ లాంటి వారి మాట‌ల‌వ‌ల్లే వారు త‌యార‌వుతున్నారు. అయినా ఒక‌రి డ్రెస్ ఇష్టాయిష్టాల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు. మీకు ఆ గ‌ర్ల్స్ ఏమీ కారుగా. మీ అమ్మాయి కాదు. క‌నుక మీరు మాట్లాడాల్సిన అవ‌స‌రం లేదు. అది వారి శ‌రీరం. వారి డ్రెస్‌. ఆ మాట‌కొస్తే అమ్మాయి లేదా అబ్బాయి ఎవ‌రైనా త‌మ ఇష్టానికి అనుగుణంగానే డ్రెస్‌లు వేసుకుంటారు. ఎదుటి వారు చూసే విధానంలో త‌ప్పు ఉంటుంది కానీ, డ్రెస్‌లో కాదు. ఇప్పుడు నేను బ‌స్ దిగి వెళ్లాక నా గురించి కూడా మీరు మాట్లాడుకోవ‌చ్చు. అది మీ ఇష్టం. కానీ అప్పుడు నేను ఉండ‌ను. ఎందుకంటే నేను మీకు ఏమీ కాను కాబ‌ట్టి. ఇంకెప్పుడూ గ‌ర్ల్స్ డ్రెస్‌ల గురించి ఇలా కామెంట్లు చేయ‌కండి. అని అంటూ.. బ‌స్ దిగా. ఆ స‌మ‌యంలో ఆ గ‌ర్ల్స్ నా వైపు హ్యాపీగా చూశారు..!”

— కేర‌ళ‌లోని కొచ్చిలో ఓ యువ‌తికి ఎదురైన య‌దార్థ సంఘ‌ట‌న ఇది. రియ‌ల్ స్టోరీ.

Comments

comments

Share this post

scroll to top