మొట్ట మొద‌టి హిజ్రా ఇత‌నే అట‌. మ‌హాభారతంలో ఇతనిది చాలా ముఖ్య‌పాత్ర‌..!

మ‌హాభారతంలో అనేక పాత్ర‌లు, ఘ‌ట్టాలు ఉన్నాయ‌ని అందరికీ తెలిసిందే. దాంతోపాటు ఎన్నో క‌థ‌లు కూడా అందులో ఉన్నాయి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అందులోని ఒక కథ గురించే. అది అర్జునుడి కుమారుడైన అర‌వ‌న్ గురించి. గిరిజ‌న రాజు కుమార్తె అయిన ఉలుపికి, అర్జునుడికి పుట్టిన‌వాడే అర‌వ‌న్‌. అయితే మ‌హాభార‌తంలో కురుక్షేత్రం యుద్ధం జ‌రగ‌డానికి ముందు పాండ‌వుల‌కు విజ‌యం క‌ల‌గ‌డం కోసం అర‌వ‌నుడు త‌నను తాను బ‌లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతాడు.

కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీ‌కృష్ణుడు పాండ‌వుల‌తో స‌మావేశ‌మ‌వుతాడు. యుద్ధంలో విజ‌యం సాధించాలంటే న‌ర‌బ‌లి ఇవ్వాల్సిందే అని శ్రీ‌కృష్ణుడు చెబుతాడు. అందుకు బ‌ల‌య్యేందుకు కృష్ణుడు ముందుకు వ‌స్తాడు. కానీ పాండ‌వులు వ‌ద్దంటారు. యుద్ధంలో త‌మ వైపు ఉన్న ఏకైక వ్య‌క్తి కృష్ణుడే. అలాంట‌ప్పుడు అత‌నే లేక‌పోతే యుద్ధం ఎలా చేస్తామ‌ని భావించిన పాండ‌వులు ఆత్మ బ‌లిదానం చేయ‌వ‌ద్ద‌ని కృష్ణున్ని ఆపుతారు. అయితే ఇది గ‌మ‌నించిన అర్జునుడి కొడుకు అర‌వ‌నుడు ముందుకు వ‌స్తాడు. ఆత్మ త్యాగానికి సిద్ధ‌ప‌డ‌తాడు. దీంతో కృష్ణుడు అర‌వ‌నుడికి 3 వ‌రాలు ఇస్తాడు.

ఈ క్ర‌మంలో అర‌వ‌నుడు 3 వరాలు కృష్ణున్ని కోరుతాడు. అందులో మొద‌టిది.. తన‌ను తాను బ‌లి చేసుకోవ‌డం అంటే, అది ఆత్మ‌హ‌త్య అవుతుంది. అది మ‌హాపాపం. కనుక ఆ పాపం అంట‌కుండా యుద్ధంలో వీర‌మ‌ర‌ణం పొందిన వ్య‌క్తి స్థాయి త‌నకు కావాల‌ని అర‌వ‌నుడు అడుగుతాడు. ఇంక రెండో వ‌రం ఏమిటంటే… యుద్ధానికి ముందే తాను చ‌నిపోయినా యుద్ధం మొత్తం తాను చూడాల‌ని కోరుకుంటాడు. మూడో వ‌రం ఏం కోరుతాడంటే… త‌న‌కు పెళ్లి కాలేదు కాబ‌ట్టి, పెళ్లి అయి గృహ‌స్తుగా మ‌ర‌ణించాల‌ని కోరుకుంటాడు. అందుకు కృష్ణుడు ఒప్పుకుంటాడు. అయితే 3వ వ‌రం మాత్రం నెర‌వేర‌దు. ఎందుకంటే ఎలాగూ ఆత్మ బ‌లిదానం చేసుకుని చ‌నిపోతాడు కాబ‌ట్టి అలాంటి వాడ్ని పెళ్లి చేసుకునేందుకు ఏ అమ్మాయి ముందుకు రాదు. దీంతో కృష్ణుడు మోహిని వేషంలోకి మారి అర‌వ‌నున్ని పెళ్లాడ‌తాడు. ఒక రోజు రాత్రి అత‌నితో గ‌డుపుతాడు. దీంతో అప్ప‌టి నుంచి అర‌వనున్ని హిజ్రాగా భావించ‌డం మొద‌లు పెట్టారు. ఆ త‌రువాతే హిజ్రా అనే ప‌దం వాడుక‌లోకి వచ్చింది. హిజ్రాలంద‌రూ అత‌ని వంశానికి చెందిన వారే అని నమ్ముతారు. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణ భార‌త దేశంలో కొన్ని చోట్ల ఏటా ఏదైనా ఒక నెల‌లో 18 రోజుల పాటు వ‌రుస‌గా హిజ్రాలు ఉత్స‌వాలు జ‌రుపుకుంటారు. త‌మ వంశానికి మూల పురుషుడైన అర‌వ‌నున్ని వారు కొలుస్తారు. కొన్ని చోట్ల‌నైతే అరవ‌నుడి విగ్ర‌హాల‌కు పూజ‌లు కూడా చేస్తారు.

Comments

comments

Share this post

scroll to top