మార్కండేయుడు…..సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఇతనికోసం శివుని తపస్సు చేశాడు. ( పురాణ శిశువులు-5)

మార్కండేయుడు మృకండ మహర్షి సంతానం. చిన్నతనంలోనే యముడిని ఎదిరించి, శివుని ఆశీస్సులతో చిరంజీవిగా నిలిచాడు.  మృకండ మహర్షి, మరుద్వతి భార్యభర్తలు…. వీరికి సంతానం లోటు. పుత్రప్రాప్తి కోసం వారణాసి వెళ్లి రెండు శివలింగాలను ప్రతిష్టించి శివుడుని తప్పసు చేస్తారు. వీరి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై, మంచి గుణాలతో 16 ఏళ్ళు జీవించే పుత్రుడు కావాలా? లేక చిరకాలం చిరంజీవిలా జీవించే దుర్గుణుడుని ప్రసాదించాలా అని అడుగుతాడు. మృకండ మహర్షి 16 ఏళ్ళు బ్రతికే సద్గుణుడే కావాలని కోరతాడు. అటువంటి బిడ్డను ప్రసాదించి శివుడు మాయమవుతాడు. మార్కండేయుడు జన్మించిన తర్వాత సప్తఋషులు మార్కండేయుడు అని నామకరణం చేసి చిరంజీవా అని దీవిస్తారు.మార్కండేయుడు బ్రహ్మ దగ్గరకు తీసుకెళ్లగా ఆయన చిరంజీవా అని దీవిస్తాడు.
dsc00583
శివుడికి,మృకండ మహర్షికి మధ్య జరిగిన సంభాషణ తెలుసుకున్న బ్రహ్మ, మార్కండేయుడు మృత్యుంజయుడు కావాలంటే శివుడి తపస్సు చేయమని,అలాగే మార్కందేయుడిని చిరంజీవిగా ఉంచమని శివుణ్ణి తపస్సు చేస్తాడు బ్రహ్మ. మార్కండేయుడికి 16 సంవత్సరాలు పూర్తికాగానే యముడు అతడి ప్రాణాలు తీయడానికి బయలుదేరుతాడు. శివుడి తపస్సులో ఉన్న మార్కండేయుడిపై యమపాశం వదులుతాడు యముడు. శివయ్యా నన్ను కాపాడుదేవా అంటూ శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు. శివుడు ప్రత్యక్షమై మార్కండేయుడిని కాపాడుతాడు. అలా యముడి నుండి ప్రాణాలు కాపాడుకుంటాడు. అయితే మృకండ మహర్షికి 16 ఏళ్ళు బ్రతికే సద్గుణాల పుత్రుడిని వరంగా ఇవ్వలేదని, చిరంజీవిలా బ్రతికే పుత్రుడిని ప్రసాదించానని శివుడు మార్కండేయుడికి అసలు సంగతి చెబుతాడు.

Comments

comments

Share this post

scroll to top