కుమారస్వామిని వెంటాడుతున్న సెంటిమెంట్ ..ఏంటో తెలుసా..?

Krishna

దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కర్ణాటక ఎన్నికలు అయిపోవడం..ఫలితాలు కూడా రావడం జరిగింది.ఎక్కువ ఓట్లు వచ్చిన కాంగ్రెస్,ఎక్కువ సీట్లోచ్చిన బిజెపి రెండూ పక్కకు పోయి జెడిఎస్ కుమారస్వామి సిఎం కుర్చీ ఎక్కారు.కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హేమాహేమీలు వచ్చిన సంగతి తెలిసిందే…ఇంతవరకు బాగానేవుంది.. ఇక్కడే ఒక విషయం రాజకీయ నాయకుల దగ్గరనుండి రాజకీయ పండితులనువరకూ ఎవర్ని ఉండనివ్వడం లేదు. సీఎం అయిన కుమారస్వామి ఐదేళ్లూ ఆ పదవిలో ఉంటారా? లేదా  అనేది ఆ ప్రశ్న..ఎందుకు ఈ ప్రశ్న వచ్చిందంటే..దానికి  కారణం అక్కడి విదానసౌథ…ఇక చదవండి..

కర్ణాటక విధాన సౌథ ముందు ప్రమాణ స్వీకారం చేసిన ఏ ఒక్క ముఖ్యమంత్రీ పూర్తికాలం కుర్చీలో కొనసాగలేదు.  గతంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో సాదాసీదాగా ప్రమాణ స్వీకారం నిర్వహించేవారు. కానీ, 1993లో అప్పటి జనతాదళ్ నేత రామకృష్ణ హెగ్డే తొలిసారి విధాన సౌథ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. మద్యం కాంట్రాక్టుల ఆరోపణలతో యేడాదిలోపే పదవిని కోల్పోయారు. అదే యేడాది మరోమారు ముఖ్యమంత్రి అయినా కూడా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పదవి చేజార్చుకున్నారు.

అంతకంటే ముందు 1990లో బంగారప్ప కూడా ఇలాగే విధాన సౌథ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. కావేరీ నదీ జలాల విషయంలో అల్లర్లు చెలరేగడంతో రెండేళ్లలోనే పదవి నుంచి తప్పుకున్నారు. 2006లో కుమారస్వామి కూడా ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేసి 20 నెలలకే పదవిని కోల్పోయారు. 2008లో యడ్యూరప్పకూ ఇదే అనుభవం ఎదురైంది. అవినీతి ఆరోపణలతో మూడేళ్లకే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు కుమారస్వామి కూడా విధాన సౌథ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. మరి గత చరిత్రను ఆయన మారుస్తారో.. లేదో వేచి చూడాల్సిందే.

 

Comments

comments