మైకెల్ జాక్సన్ ఇంటి సీక్రెట్స్ 2700 ఎకరాలలో ఇల్లు!!

మైకేల్‌ జాక్సన్‌ ఈ పేరు వినగానే ఓ డ్యాన్సర్ గుర్తొస్తాడు. అంతే కాదు మ్యూజిక్‌ అభిమానులు పడి చచ్చేవారు. ఆయన పాటల కోసం, రూపాయలు ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ పాప్ సింగర్ ని ఇష్టపడేవారు. ఎంతంటే దేశానికి అధిపతులు కూడా ఆయన కోసం వచ్చేవారు. ఈ భూమిమీద పాప్‌ రారాజుగా వెలుగు వెలిగిన మైకేల్‌ జాక్సన మరణ వార్త తరువాత ఆయన గడిపిన జీవితం వివాదాస్పదం అయ్యింది. చిన్న పిల్లలను లైంగికంగా వేదించాడంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు మైఖేల్. ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలంత కూడా తన మరణంతోనే కాల గర్భంలో కలిసిపోయాయి.

మైకేల్‌ జాక్సన్‌ ఇల్లు అంటే అలాంటి ఇలాంటి ఇల్లు కాదు. ప్రస్తుతం ఇదొక్కటే మైకేల్ ఆస్తులలో మిగిలింది. అయితే అది అలాంటి, ఇలాంటి ఇల్లు కాదు… 2700 ఎకరాల్లో ఆ ఇల్లు ఉంది. ఆ మొత్తం సామ్రాజ్యంను కూడా మైకేల్‌ నిర్మించుకున్నాడు. తన ఇంటి ఆవరణలో జూ, పార్క్‌లు, చిన్న పెద్ద థియేటర్లు ఎన్నో ఏర్పాటు చేయించుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఇల్లుగా మైకేల్‌ జాక్సన్‌ ఇల్లు అయిన నెవర్‌ ల్యాండ్‌కు గుర్తింపు ఉంది.

అయితే ఇక్కడ పేద పిల్లలకు అక్కడ ఉచితంగా ప్రవేశం కల్పించి ప్రతి వారం జూ, పార్క్‌, థియేటర్లలో సినిమాలు చూపించే వారట. అయితే మైకేల్‌ అలా చేయడానికి కూడా కారణం ఉందని అప్పట్లో పుకార్లు లేచాయి. పిల్లలను అక్కడకు రప్పించుకుని, వారిపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడు అంటూ ఆరోపణలు వ్యక్తం అయ్యాయి.ఇక అప్పటి నుంచి మైకేల్‌ జాక్సన్‌ పతనం ప్రారంభం అయ్యింది. మెల్ల మెల్లగా నెవర్‌ ల్యాండ్‌ ప్రభావం కోల్పోవడం మొదలు అయ్యింది.

అయితే మైకేల్‌ జాక్సన్‌ మరణంకు ముందు నెవర్‌ ల్యాండ్‌ వేలం వేశారు అప్పుడు దాని విలువ వేల కోట్లలో ఉండేది. కాని ప్రస్తుతం నెవర్‌ ల్యాండ్‌ను కేవలం 220 కోట్ల విలువనే పలికింది. 2015వ సంవత్సరంలో నెవర్‌ ల్యాండ్‌ను వేలం వేసేందుకు సిద్దం అవ్వగా 640 కోట్ల రూపాయల ధరకు వచ్చింది. అయితే అప్పుడు ఆ రేటు తక్కువగా భావించారు. రోజు రోజుకు మైకేల్‌ ఇల్లు విలువ పడిపోవడం, మళ్ళీ చిన్న పిల్లలపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఇంటి ప్రముఖ్యత కోల్పోయిందని అందరూ చర్చించుకుంటున్నారు. ఆ ఇంటిని ఆధీనంలో ఉంచుకున్న బ్యాంకులు మాత్రం ఎంతో కొంత వచ్చిన అమ్మేసేందుకు సిద్దం అయ్యాయి. ఒకప్పుడు రాజభవనంలా వెలుగు వెలిగిన మైకెల్ ఇల్లు ఇప్పుడు బూత్ బంగ్లాలగా విలువ పడిపోయింది.

 

Comments

comments

Share this post

scroll to top