మొదటి భార్య ఉండగానే గుట్టు చప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు… భార్య ఎంట్రీతో బయటికి వచ్చిన అసలు విషయం…

అతడికి గతంలోనే పెళ్లయింది. కానీ నవ వరుడిగా మరి మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. తాళి కూడా కట్టేశాడు. షట్ డ్యామిట్ ఇంతలో అతని ప్లాన్ ఫెయిల్ అయ్యింది. మొదటి భార్య పెళ్లి సీన్ లో ఎంటర్ అయ్యింది. ఇంతకు ముందే భార్య ఉందనే విషయం తెలిసి కంగుతిన్నారు అమ్మాయి తరపు బంధువులు.

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం తిరుమలపూర్ గ్రామానికి చెందిన దులం రాజశేఖర్ కి గతేడాది ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరుకు చెందిన యువతితో పెళ్లయింది. అయితే పెళ్ళైన విషయం ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఆ యువతితో రహస్యంగా కాపురం చేస్తున్నాడు. ఇంతలోనే కుటుంబ సభ్యులు రాజశేఖర్ కి ఓ సంబంధం చూశారు. అయితే పెళ్లి జరిగిన విషయం చెప్పకుండా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు ఈ ప్రబుద్ధుడు. జగిత్యాల జిల్లాలోనే పోరండ్ల గ్రామానికి చెందిన అమ్మాయితో రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. బంధువులంతా వచ్చారు. వైభవంగా వివాహం జరిగింది. ఇంతలో మొదటి భార్య వచ్చి పెళ్ళికొడుకుని నిలదీయడంతో అసలు బండారం బయటపడింది. ఇంతలో నవ వధువు తరపు బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Comments

comments

Share this post

scroll to top