నేరాలు పెరగడానికి అవే కారణమా?కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన మద్రాస్ కోర్టు

ఇటీవలి కాలంలో నేరాలు ఘోరంగా పెరుగుతున్నాయి. వీటికి తోడు వివాహేతర సంబంధాలు, గొడవలు ఇలా సమాజాన్ని పట్టి పిడిస్తున్నాయి. అయితే విటన్నింటిపై మీడియా ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగే నేరాలు అచ్చం సినిమాలోలాగే జరుగుతున్నాయి. సినిమాలలో కూడా నేరం, దొంగతనం ఎలా చేయాలో సన్నివేశాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. సినిమాలు విడిచి పెట్టి సీరియల్స్ విషయానికి వస్తే ప్రతి ఇంట్లో ఏదో ఒక ఛానెల్లో ఎప్పుడు ఏదో ఒక సీరియల్ అయితే వస్తూనే ఉంటుంది. అయితే తాజాగా దేశంలో వివాహేతర సంబంధాలు, నేరాలు పెరిగిపోవడానికి వివిధ టీవీ చానళ్లలో ప్రసారం అవుతున్న సీరియళ్లే ప్రధాన కారణమా అని కోర్టులకి కూడా అనుమానం వచ్చింది. ఇది చాలదా మీడియా అనేది ప్రజలలో ఎంతలా పతుకుపోయిందో చెప్పడానికి.

చెన్నైలోని కొరటూరుకు చెందిన ఒక యువతితో రంజిత్‌కుమార్‌ అనే వ్యక్తి వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. అయితే ఆ యువతి రంజిత్‌కుమార్‌ స్నేహితుడు లోకేశ్‌తో సైతం వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. దీంతో రంజిత్ కుమార్ కి కోపం వచ్చి లోకేశ్‌పై దాడిచేశాడు. మళ్ళీ సత్యానగర్‌కు చెందిన మరో యువతితో కూడా రంజిత్‌కుమార్‌ వివాహేతర సంబంధాన్ని నె
నడిపాడు. అయితే లోకేష్ మాత్రం తనపై దాడిచేసిన రంజిత్‌కుమార్‌పై కోపం పెంచుకొని చంపడానికి హతమార్చడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. అనుకున్నదే తడవుగా ఐదుగురితో కలిసి రంజిత్‌కుమార్‌పై వేటకొడవళ్లతో దాడిచేసి హతమార్చాడు లోకేష్. ఈ కేసులో లోకేష్‌తోపాటు అరెస్టయిన అజిత్‌కుమార్‌ తనను గూండా చట్టం కింద అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశాడు. అయితే ఈ కేసును జూన్ 3కి వాయిదా వేశారు.

ఇటువంటి నేరాలు జరగడానికి కూడా కొన్ని కారణాలున్నాయి. భార్య,భర్తలు ఇద్దరూ సంపాదిస్తూ ఎవరి పనులలో వాళ్ళు ఉండటం, జీవిత భాగస్వామితో సంతృప్తికరమైన లైంగిక సంబంధాలు లేకపోవడమా. సామాజిక మాధ్యమాల గొడవలో పడి వేరే కల్చర్ కి ఆకర్షితులవడం, ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకోకపోవడం ఇలాంటి విషయాల వలన వివాహేతర సంబంధాలు పెరిగే అవకాశం ఉంది.

పై విషయాలపై అనుమానాలను లెవనెత్తుతూ మద్రాస్ హై కోర్ట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని సూచనలు కూడా చేసింది. వివాహేతర కేసులు దృష్టికి వచ్చినప్పుడు సుప్రీం అనుమతి తీసుకొని భార్య,భర్తలకు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇద్దరిని పరస్పర విషయంలో అంగీకరించడం వంటివి చేయాలని ఇందుకోసం రిటైర్డ్ జడ్జితో ఒక కమిటీ వేయాలని హైకోర్టు నిర్ణయించింది. అంతే కాక పైన అడిగిన ప్రశ్నలన్నింటికి రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని కోరింది.

Comments

comments

Share this post

scroll to top