భార‌త దేశ స‌రిహ‌ద్దులో ఉన్న ఈ ఆల‌యాన్ని చూస్తే పాక్ సైనికుల‌కు హ‌డ‌ల్‌. ఎందుకో తెలుసా..?

పాకిస్థాన్‌తో మ‌న దేశానికి ఉన్న వైరం ఈనాటిది కాదు. స్వాతంత్ర్యం వ‌చ్చాక పాకిస్థాన్ భార‌త్ నుంచి విడిపోయి కాశ్మీర్ కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌డం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఆ అంశ‌మై ఇరు దేశాల మ‌ధ్య అనేక సార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. చిన్నపాటి యుద్ధాలు లెక్క‌లేన‌న్ని చోటు చేసుకున్నాయి. ఇక 1965తో పాక్‌తో జ‌రిగిన యుద్ధం గురించి అంద‌రికీ తెలిసిందే. ఆ యుద్ధం చాలా రోజుల పాటు జ‌ర‌గ్గా చివ‌ర‌కు ఐక్య‌రాజ్య‌స‌మితి చొర‌వ‌తో యుద్ధం ముగిసింది. అయితే ఆ యుద్ధంలో ఓ ర‌కంగా పాక్‌పై భార‌త్ విజ‌యం సాధించింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎలాగంటే…

1965లో పాకిస్థాన్ కాశ్మీర్‌ను ఆక్ర‌మించుకునేందుకు భార‌త్‌తో యుద్ధం ప్రారంభించింది. అప్ప‌టికే చైనాతో మ‌న‌కు యుద్ధం ముగిసింది. దీంతో మ‌న దగ్గ‌ర ఆయుధాలు లేవ‌నే విష‌యం తెలుసుకున్న పాకిస్థాన్ భార‌త్‌పై యుద్ధానికి పూనుకుంది. ఆ దేశ మొద‌టి లక్ష్యం.. కాశ్మీర్‌ను ఆక్ర‌మించుకుని దాని ద్వారా భార‌త్‌లోకి ఉగ్ర‌వాదుల‌ను పంప‌డ‌మే. కానీ.. వారు రాజ‌స్థాన్‌లోని జైస‌ల్మీర్‌కు 150 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న త‌నోట గ్రామంపై దాడి చేశారు. తనోట మాత మందిరానికి పది కిలోమీటర్ల దూరంలో తనోట బోర్డర్ ఔట్ పోస్టు ఉంటుంది. దానికి పది కిలో మీటర్ల ముందు లోంగే వాలా ఏరియా ఉంటుంది. యుద్ధం సమయంలో ఈ ప్రాంతం నుంచి భారత్ లోకి ప్రవేశించడానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. 4 డిసెంబర్ రాత్రి పంజాబ్ రెజమెంటుకు చెందిన ఒకే ఒక బెటాలియన్ అక్కడ ఉంది. దీంతో సమయం చూసుకున్న పాక్ మళ్ళీ కుతంత్రం పన్నింది. 2000 మంది పాక్ సైన్యం 90కి పైగా యుద్ధ ట్యాంకులు, ట్రక్కులు దండెత్తాయి. కానీ అనూహ్యంగా పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఒక్కటి కూడా ముందుకు కదల్లేదు.

యుద్ధం సమయంలో పాకిస్తాన్ టార్గెట్ కాశ్మీర్ అయినా పక్కా ప్లాన్ ప్రకారం తనోట గ్రామంపై ఎటాక్ చేసింది పాక్. కేవలం ఇక్కడ మాతా తనోట్ దేవి ఆలయం సమీపంలోనే 400కు పైగా బాంబులు పడ్డాయి. వందల బాంబులు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకుల నుంచి వ‌ర్షం రూపంలో వ‌చ్చాయి. కానీ ఇక్కడ అద్భుతం ఏమిటంటే ఒక్కటి కూడా పేలలేదు. ఒక్క చోట కూడా విధ్వాంసం జరగలేదు. ఒక అదృశ్య శక్తి బాంబులు చేరుకోక ముందే వాటిని నిర్వీర్యం చేసింది. ఇన్ని బాంబుల‌ను నిర్వీర్యం చేయడం మానవులకు తరం కాదని పాక్ సేనలకు నెమ్మ‌దిగా అర్థమైంది. శక్తి ఆలయాన్ని ధ్వంసం చేయడానికి పాక్‌ వందల బాంబులను కురిపించింది. కానీ అవ‌న్నీ తుస్సుమన్నాయి. 90 యుద్ద ట్యాంకులు ఒక్క అడుగు ముందుకు కదల్లేదు. చాలా బాంబులు పేల‌లేదు. ఇది క‌ల్పితం కాదు. య‌దార్థ గాథ‌.

నిజానికి సైన్స్ కు అందని కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయి అనడానికి అప్పుడు జ‌రిగిన ఆ ఘ‌ట‌నే ఒక నిదర్శనం. సరిహద్దుల్లో కాప‌లా కాస్తూ భారతావనిని రక్షించిన దేవీ మహిమ నిజంగా అమోఘ‌మే. ఎవ‌రు నమ్మినా నమ్మక పోయినా ఆ రోజు జరిగింది అద్భుతమే. ఇక అలా పాక్ ట్యాంకులు ప‌నిచేయ‌క‌పోయే స‌రికి దాన్ని అద‌నుగా తీసుకున్న భారత్ త‌న హంట‌ర్ విమానాలతో ఆ ట్యాంకులన్నింటినీ ధ్వంసం చేసింది. ఇక ఆ దాడిలో పేల‌కుండా దొరికిన ప‌లు బాంబుల‌ను మ‌నం ఇప్ప‌టికీ త‌నోట దేవి ఆల‌యంలో చూడ‌వ‌చ్చు. ఆ మాత‌కు ఉన్న అద్భుత‌మైన శ‌క్తిని పాక్ సైనికులు కూడా న‌మ్మ‌క త‌ప్ప‌లేదు. అందుకే యుద్ధం తర్వాత పాక్ ఆర్మీ కీలక సమావేశం జరిగింది. అన్ని బాంబులు పేలక పోవడానికి కారణం తనోట్ మాత అని వారికి అర్థమైంది. ఇదంతా ఆ దేవీ శక్తి అని పాకిస్తాన్ నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ‌హిరంగంగా ఏదీ ఒప్పుకోని పాక్ జనరల్ ఇక్కడికి వచ్చి ఆ మాతను ద‌ర్శించుకున్నాడ‌ట‌. అనంత‌రం త‌మ ఓటమిని వారు అంగీక‌రించార‌ట‌.

తనోట మాత ఆశీర్వాదంతోనే ఆ ట్యాంకులన్నీ ఆగిపోయాయని మన సైన్యం నమ్ముతుంది. అప్పటి నుంచి తనోట మాత మందిరం అద్భుతమేంటో అందరికీ అర్థ‌మైంది. అందుకే బీఎస్ఎఫ్‌ జవాన్లు ఎటువంటి కొత్త ఆపరేషన్ మొదలు పెట్టినా ముందు ఇక్కడికి వచ్చి శక్తి మాతా ఆశీర్వాదం తీసుకున్నాకే పని మొదలు పెడతారు. ఇటువైపు నుంచి వెళ్లే ప్రతి బీఎస్ఎఫ్‌ బెటాలియన్ అమ్మవారి దర్శనం చేసుకుని వెళుతుంది. అత్యంత శక్తిమంతమైనదిగా భావించే ఈ తనోట మాత దేవాలయానికి ఎంతో చరిత్ర ఉంది. 1920 కాలంలో ఇక్కడ దేవీ విగ్రహం ప్రతిష్ట జరిగిందని చెబుతారు. పాకిస్తాన్ తో ఈ యుద్ధాలు జరిగిన తర్వాత బీఎస్ఎఫ్ ఏర్పడింది. బీఎస్ఎఫ్‌ కు బోర్డర్ ను రక్షించే బాధ్యత‌ను అప్పగించారు. అదే సమయంలో ఈదేవాలయ బాగోగులు కూడా బీఎస్ఎఫ్‌ కు దక్కాయి. ఈదేవాలయంలో దైవ భక్తితో పాటు దేశభక్తి కూడా ఇక్కడ పూజలో మ‌న‌కు క‌నిపిస్తుంది. త‌నోట మాత దేవాలయం దగ్గర ఉన్న మట్టిని కొత్తవాహనాలకు బొట్టు పెట్టి పూజలు నిర్వహిస్తారు. ఏది ఏమైనా.. త‌నోట మాత శ‌క్తి ఉన్న దేవ‌త‌లాగే మ‌న‌కు క‌నిపిస్తుంది క‌దా..!

 

Comments

comments

Share this post

scroll to top