అంపైర్ బిల్లీ బౌడెన్ వంక‌ర వేలి వెనుక ఉన్న అస‌లు రీజ‌న్ తెలిస్తే… మీరు బాధ‌ప‌డ‌తారు..!

బిల్లీ బౌడెన్‌..! ఈ పేరు చెబితే చాలు, క్రికెట్ చూసే ప్ర‌తి అభిమానికి అత‌ని శైలి గుర్తుకు వ‌స్తుంది. క్రికెట్ మ్యాచుల్లో వికెట్లు ప‌డిన‌ప్పుడు, లేదంటే బ్యాట్స్‌మెన్ సిక్స్ కొట్టిన‌ప్పుడు బిల్లీ బౌడెన్ త‌నదైన శైలిలో సంజ్ఞ‌లు చేస్తాడు. వికెట్ ప‌డిన‌ప్పుడైతే ఇత‌ర అంపైర్లు చేతి చూపుడు వేలును నిటారుగా చూపిస్తారు. అదే మ‌న బౌడెన్ అయితే వంక‌ర‌గా చూపుతాడు. ఇక సిక్స్ కొట్టిన‌ప్పుడు కూడా రెండు చేతుల‌ను పైకెత్తి చూపుడు వేళ్ల‌ను వంచి సిక్స్ గా అనౌన్స్ చేస్తాడు. అయితే మీకు తెలుసా..? ఆయ‌న హాస్యం కోసం అలా చేయ‌డం లేదు. దాని వెనుక ఓ పెయిన్‌ఫుల్ రీజ‌న్ ఉంది. అదేమిటంటే…

బిల్లీ బౌడెన్ నిజానికి క్రికెట్ ఆట‌గాడే. కాక‌పోతే అత‌నికి 21 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు రుమ‌టాయిడ్ ఆర్థ‌రైటిస్ అనే వ్యాధి వ‌చ్చింది. దీన్నే కీళ్ల వాతం అంటారు. ఈ క్ర‌మంలో బిల్లీ మోచేతులు, రెండు చేతుల మ‌ణిక‌ట్లు, వేళ్లకు చెందిన జాయింట్ల‌ను క‌దిలించ‌డంలో ఇబ్బందులు ప‌డ్డాడు. దీంతో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి అంపైర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను అంపైరింగ్ చేసేట‌ప్పుడు అలా చేయాల్సి వ‌చ్చేది.

ఇత‌ర అంపైర్ల‌లా చేతి చూపుడు వేలును బిల్లీ నిటారుగా ఉంచ‌లేడు. అలా ఉంచితే విప‌రీత‌మైన నొప్పి క‌లుగుతుంది. అందుకే అత‌ను వేలిని అలా వంక‌రగా పెడ‌తాడు. దాన్ని చూసిన వారు తెగ న‌వ్వుకునే వారు. మొద‌టి సారిగా అలా బిల్లీ 1995లో న్యూజిలాండ్‌, శ్రీ‌లంక‌ల మ‌ధ్య హామిల్ట‌న్‌లో జ‌రిగిన మ్యాచ్ లో అంపైరింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌గా ఆ మ్యాచ్‌లోనే బిల్లీ అలా సంజ్ఞ‌లు చేయ‌డంతో అంద‌రూ హాస్యానికి అనుకున్నారు. ఇప్ప‌టికీ చాలా మందికి ఈ విష‌యం గురించి తెలియ‌దు. కానీ తెలిస్తే మాత్రం… పాపం బిల్లీ బౌడ‌న్‌… అని అన‌క మాన‌రు..!

Comments

comments

Share this post

scroll to top