సొల్లు క‌బుర్లు చెప్పుకోడానికే హోట‌ల్స్ కు  వ‌చ్చే వారికి దిమ్మ తిరిగే షాకిచ్చే బోర్డ్ ను పెట్టించిన‌ య‌జ‌మాని.!

కేఫ్‌లు,హోటల్స్,రెస్టారెంట్లు, పిజ్జా పార్లర్లు,బేకరీలు..ఇలా ఏ ప్రదేశానికి వెళ్లినా సాధారణంగా మనం మన పక్కన ఉన్నవారితో పిచ్చాపాటి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం.కేఫ్‌లలో అయితే ఈ గోల కొంచెం ఎక్కువగా ఉంటుంది. మిగిలిన ప్రదేశాల్లో ఈ గోల కొంచెం తక్కువగా మనకు వినిపిస్తుంది.అయితే బెంగళూరులోని ఓ హోటల్‌లో మాత్రం ఇలా పిచ్చాపాటి సంభాషణ మాట్లాడుకునే వారి గోల ఎక్కువైందట.దీంతో ఆ హోటల్ యజమాని ఏం చేశాడో తెలుసా..?
తమ హోటల్‌లో తిండి కోసం కాకుండా చాలా మంది పిచ్చాపాటి మాట్లాడుకునేందుకు,రియల్ ఎస్టేట్,ఇతర వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు నిర్వహించుకునేందుకు వస్తున్నారని తెలిసి ఆ హోటల్ యజమాని తమ హోటల్‌లో ఓ బోర్డు పెట్టించాడు.అందులో ఏముందంటే…తమ హోటల్ ఉంది తిండి తినడానికేనని, రియల్ ఎస్టేట్ లావాదేవీలు,రాజకీయ చర్చలు,పిచ్చాపాటి సంభాషణలు మాట్లాడుకునేందుకు కాదని,దయచేసి అర్థం చేసుకోవాలిన ఆ హోటల్ యజమాని బోర్డు పెట్టాడు.
అలా ఆ హోటల్‌లో బోర్డు పెట్టే సరికి దాన్ని ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ ఫొటో కాస్తా ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో ఇది కామన్ అయిపోయింది.అసలు చుట్టూ ఉన్నవారికి ఇబ్బంది కలుగుతుందని కూడా కొందరు చూడడం లేదు. దీంతో పెద్ద పెద్దగా అరుస్తూ మారి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అలాంటి వారికి ఝలక్ తగలాలంటే..ఇలాంటి బోర్డులు పెట్టాల్సిందే కదా.ఏమంటారు..!

Comments

comments

Share this post

scroll to top