ఈ వీడియో మన దృక్ఫథాన్నే మార్చేస్తుంది. తప్పక చూడండి…ఆ కుర్రాళ్లు నేర్పిన పాఠం.!

దక్కితే నాకు దక్కాలి..లేకపోతే సర్వనాశనం అయిపోవాలి…. నాకు దక్కంది ఎవ్వరికీ దక్కనివ్వను…ఈ డైలాగ్ లు ఇటీవల కాలంలో చాలా సినిమాల్లో విన్నాం…ఇక నిజ జీవితానికి వస్తే చాలా దగ్గరగా చూస్తూనే ఉన్నాం. స్వార్థం…స్వార్థం….అంతా స్వార్థం అన్నట్టు మారింది లోకం… అదిగో అలాంటి పరిస్థితినే కథా వస్తువుగా తీసుకొని అధ్భుతమైన మెసేజ్ ను అందించాడు ఈ షార్ట్ ఫిల్మ్ నిర్వాహకుడు… గాంధీ సిద్దాంతం ఆధారంగా రూపొందించబడిన ఈ షార్ట్ ఫిల్మ్ కు అంతర్జాతీయ అవార్డ్ వచ్చింది.

కథ ప్రకారం….. రైల్వే స్టేషన్ లో ఉన్న  ఓ కుర్రాడి  చెప్పు తెగిపోతుంది. దానిని జాయింట్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటాడు, కానీ అప్పటికే దాని సర్వీస్ అయిపోవడంతో అది ఎంత జాయింట్ చేసినా మళ్లీ ఊడుతూనే ఉంటుంది..అదే టైమ్ లో తండ్రితో కలిసి రైల్వే స్టేషన్ కు వచ్చిన మరో పిల్లాడు  తను వేసుకున్న కొత్త షూస్ ను ప్రతిసారీ  తుడుచుకుంటూ వాటి మీద తన ఇష్టాన్ని ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాడు…. అంతలోనే ట్రైన్ రావడం..దానిని ఎక్కడం కోసం చాలా పెద్ద రష్ ఉండడంతో తోసుకుంటూనే ఆ రైల్ ఎక్కుతారు తండ్రీ కొడుకులు…..ఈ క్రమంలో తను అమితంగా ఇష్టపడే షూస్ లో ఓ షూ కిందపడిపోతోంది…మళ్లీ కిందికి వచ్చి షూ తీసుకొని వెళదామనుకునే సమయంలోనే ట్రైన్ ముందుకు కదులుతుంది.

దీన్నంతా గమనించిన మొదటి  పిల్లాడు ..కిందపడ్డ షూను తీసుకొని అతనికి ఇవ్వడం కోసం ట్రై చేస్తాడు…తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియోలో చూడాల్సిందే ..ఎందుకంటే మాటల్లో పలికించలేని భావాలు వీడియో ద్వారా  ప్రత్యక్ష అనుభూతిని కల్గిస్తాయి.

Watch Video: (Wait 3 Sec For Video  To Load)

Simply Superb! (-.-)

Posted by బతుకమ్మ on Saturday, January 9, 2016

Comments

comments

Share this post

scroll to top