జ‌మీందారీ జీవితాన్ని వ‌ద్ద‌నుకుని.. దూరంగా అడ‌విలో గుడిసెలో నివాసం ఉంటోంది ఆమె. ఎందుకో తెలుసా..?

చుట్టూ ఎప్పుడు చూసిన ప‌దుల సంఖ్య‌లో నౌక‌ర్లు. పిలిచిన వెంటనే ప‌రిగెత్తుకుని వ‌చ్చి ఏ ప‌నంటే ఆ ప‌ని చేయ‌డానికి అందుబాటులో ఉంటారు. దీనికి తోడు విలాస‌వంతమైన జీవితం. ఖ‌రీదైన భ‌వ‌నాలు, కార్లు. ఒక ర‌కంగా చెప్పాలంటే… ఆమెది రాచ‌రిక జీవితం అనే చెప్ప‌వ‌చ్చు. తండ్రి జ‌మీందార్. ఇంకేముందీ, ఆమె పుట్టుక‌తోనే ధ‌నికురాలు అయింది. అయిన‌ప్ప‌టికీ వాట‌న్నింటిని వ‌ద్ద‌నుకుంది. అడ‌వుల్లో నివాసం ఉంటోంది. అది కూడా ఏనుగుల మ‌ధ్య‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే…

ఆమె పేరు ప‌ర్బ‌తి బారువా. అస్సాంలో జ‌మీందార్ కుటుంబంలో పుట్టింది. ఆమె తండ్రి జ‌మీందార్‌. అయితే అత‌నికి అడ‌వుల్లో జీవించ‌డం అంటే చాలా ఇష్టం. అందులో భాగంగానే ఎప్పుడూ నౌక‌ర్ల‌ను వెంట బెట్టుకుని రోజుల త‌ర‌బ‌డి అడ‌వుల్లో ఉండేవాడు. అదే అల‌వాటు ప‌ర్బ‌తి కూడా వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే తండ్రి లాగే ఆమెకు కూడా ఏనుగులు అంటే విప‌రీత‌మైన ఇష్టం ఏర్ప‌డింది. వారు ఉంటున్న ధుబ్రి అనే జిల్లా కేంద్రంలోని గౌరీపుర్ అనే గ్రామానికి ఆనుకుని ఉన్న అడ‌వుల్లో తిరిగే ఏనుగుల‌తో స్నేహం చేసింది. అలా ప‌ర్బ‌తి త‌న 14వ ఏట నుంచే ఏనుగుల‌తో స్నేహంగా మెలిగేది.

ఈ క్ర‌మంలో ఏనుగులు ఆమెకు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యేవి. అనేక అడ‌వుల్లో ఉన్న మ‌దపుటేనుగుల‌ను సైతం చాలా తక్కువ స‌మయంలోనే త‌న మ‌చ్చిక చేసుకునేది. వాటితో క‌లిసి జీవించేది. వాటికి తిండి పెట్ట‌డం, నీరు తాగించ‌డం, న‌దుల్లో స్నానం చేయించ‌డం వంటి ప‌నులు చేస్తూ మ‌హిళా మావ‌టిగా మారింది. దీంతో ప్ర‌పంచంలోనే మొద‌టి మ‌హిళా మావ‌టిగా ఆమె పేరు గాంచింది. తాను ఉంటున్న ప్రాంతంలోని మోతియాబాగ్ కొండపై ఉన్న జ‌ల‌పాతం వ‌ద్ద ప్రారంభ‌మైన ఆమె జీవితం ఇప్పుడు అలాగే కొన‌సాగుతోంది. అయితే ఇప్పుడు ఆమె ఎక్క‌డ ఉంటుందో తెలుసా..? అడ‌విలోనే… చిన్న గుడిసెలో ఉంటుంది. నేల‌పై ప‌డుకుంటుంది. అడ‌విలో దొరికిన వాటిని తింటుంది. ఇక ఆమె గుడిసెలో తాళ్లు, క‌త్తులు (త‌న‌కు ప‌నికివ‌చ్చేవి) త‌దితర ప‌నిముట్లు కొన్ని ఉంటాయి. టూత్‌పేస్ట్‌కు బ‌దులుగా బూడిద‌ను వాడుతుంది. ఇదీ.. ప‌ర్బతి జీవితం. విలాస‌వంత‌మైన జీవితాన్ని వదులుకుని అలా నివ‌సిస్తున్నందుకు ఆమె హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top