దుబాయ్ లో ఉన్న ఏకైక హిందూ ఆల‌యం ఇదే..! ఇక్క‌డి విశేషాలు ఇవే..!

దుబాయ్‌. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్ర‌ధాన న‌గ‌రం. అర‌బ్ దేశం. అయిన‌ప్ప‌టికీ ఇక్క‌డ అనేక దేశాల వాళ్లు ఎక్కువ‌గా నివాసం ఉంటారు. వారిలో భార‌త్‌కు చెందిన వారే ఎక్కువ‌గా నివ‌సించ‌డం విశేషం. అయితే దుబాయ్‌లో నివసించే హిందువుల‌ను దృష్టిలో ఉంచుకుని అక్క‌డ ఓ దేవాల‌యాన్ని క‌ట్టించారు. అది దుబాయ్‌లో ఉన్న ఏకైక హిందూ ఆల‌యంగా పేరు గాంచింది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దుబాయ్‌లోని దుబాయ్ క్రీక్ ప్రాంతంలో ఉన్న బుర్ దుబాయ్ వ‌ద్ద హిందూ ఆల‌యం ఉంది. ఇది దుబాయ్‌లోనే ఏకైక హిందూ ఆల‌యం. దీన్ని 1958లో నిర్మించారు. అప్పటి దుబాయ్ ఉపాధ్యక్షుడు షేక్ ర‌షీద్ బిన్ స‌యీద్ అల్ మ‌క్తూం దీని నిర్మాణానికి అంగీక‌రించారు. దీంతో అప్ప‌ట్లో ఈ ఆల‌యం నిర్మాణ‌మైంది. ఇందులో శ్రీ‌కృష్ణుడు, శివుడు కొలువై ఉంటారు. త‌రువాత కొన్ని సంవ‌త్స‌రాలకు ఈ ఆల‌యంలోనే ఓ ప‌క్క‌న షిరిడీ సాయి ఆల‌యం కూడా నిర్మించారు.

దుబాయ్‌లో ఉన్న ఈ హిందూ ఆల‌యంలో ఎక్కువగా స్థానికంగా ఉన్న హిందువులు పెళ్లిళ్లు చేసుకుంటారు. కానీ వారి వివాహ రిజిస్ట్రేష‌న్లు మాత్రం చేయ‌రు. ఇక రంజాన్ మాసంలో మాత్రం ఈ ఆల‌యంలో ఇఫ్తార్ వేళ‌ల త‌రువాతే ప్ర‌సాదాన్ని ఇస్తారు. దుబాయ్ లో ఈ ఆల‌యం శివ కృష్ణ మందిర్‌గా పేరు గాంచింది. దుబాయ్ వెళ్లేవారు చాలా మంది ఈ ఆల‌యాన్ని క‌చ్చితంగా సంద‌ర్శిస్తారు. అయితే 2015 ఆగ‌స్టులో మ‌న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దుబాయ్‌లో ప‌ర్య‌టించారు. ఆ త‌రువాత అక్క‌డి పాల‌కులు ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌రించారు. అదేమిటంటే… త్వ‌ర‌లో దుబాయ్‌లో మ‌రో హిందూ ఆల‌యాన్ని నిర్మిస్తార‌ట‌..!

Comments

comments

Share this post

scroll to top