ఏయే రాశుల వారు కొత్త సంవత్సరంలో ఏయే రిజల్యూషన్‌లను తీసుకోవాలో తెలుసా..?

కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు.. చాలా మంది చాలా రిజల్యూషన్‌లను తీసుకుంటూ ఉంటారు. కానీ వాటిని వారు పాటంచరు లెండి. అది వేరే విషయం. కొత్త సంవత్సరంలో మద్యం తాగడం మానేయాలని, స్మోకింగ్‌ చేయకూడదని, డైరీ రాయాలని, కొన్ని అలవాట్లు మార్చుకోవాలని చాలా మంది నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అలా చేయరు. అయితే సరే ఆ విషయం అటుంచితే.. ఎవరైనా కింద చెప్పిన విధంగా తమ రాశుల ప్రకారం కొత్త సంవత్సరంలో రిజల్యూషన్‌ తీసుకుంటే చాలా లక్‌ కలసి వస్తుందట. మరి ఏయే రాశి వారు కొత్త సంవత్సరంలో ఏయే రిజల్యూషన్‌లు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

1. మేష రాశి
కొత్త ఏడాదిలో ఈ రాశి వారు తమ హృదయం చెప్పినట్టు వినండి. వేరే వారి మాటలను వినకండి. చేసే పనిపై దృష్టి పెట్టండి. అంతా మంచే జరుగుతుంది. లక్‌ కలసి వస్తుంది.

2. వృషభ రాశి
కొత్త కొత్త కలలు కనండి. వాటిని సాకారం చేసుకునేందుకు ముందకు సాగండి. వెకేషన్‌కు వెళ్లండి. న్యూ ఇయర్‌లో కొత్త ఫ్యాషన్‌తో ఉన్న దుస్తులు ధరించండి.

3. మిథున రాశి
మీలో ఉన్న భయాలను ఈ న్యూ ఇయర్‌లో పారదోలండి. ధైర్యంగా ఉండండి. మీకు ఉన్న బలహీనతల నుంచి కొత్త ఇయర్‌లో దూరంగా ఉండేందుకు యత్నించండి. అంతా మంచే జరుగుతుంది.

4. కర్కాటక రాశి
ఏ విషయానికి కూడా కాదు, లేదు అనే సమాధానాన్ని ఈ ఏడాది చెప్పకండి. ఏ పని అయినా సాధిస్తాం అనే ఆలోచనతో ముందుకు సాగండి. మీకు తృప్తి వచ్చే వరకు ఏ పనీ విడిచిపెట్టకండి. చేస్తూనే ఉండండి.

5. సింహ రాశి
కొత్త విషయాలను కనిపెట్టే దిశగా ఈ ఏడాది ముందుకు సాగండి. మీ జీవితంలో మీకు తోడయ్యే కొత్త వ్యక్తులను ఆహ్వానించండి. రిస్క్‌లను తీసుకునే ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతమవుతుంది.

6. కన్యా రాశి
మీలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వాటికి పదును పెట్టండి. అసలైన లీడర్‌గా ఎదిగేందుకు ఈ ఏడాది కృషి చేయండి. విజయం వరిస్తుంది.

7. తుల రాశి
మిమ్మల్ని మీరు నమ్మండి. ఇతరులు చెప్పే విషయాలను పట్టించుకోవాల్సిన పనిలేదు. ధైర్యం శ్వాసగా ముందుకు సాగండి. ఈ ఏడాదిలో మీరు అనుకున్న పనులు చేయండి. ఫలితం ఎలా వచ్చినా సరే ధైర్యంగా ఉండండి.

8. వృశ్చిక రాశి
మీ ఆలోచనలు, తెలివి తేటలకు ఈ ఏడాది సానబెట్టండి. కొత్త ఆవిష్కరణలు చేపట్టేందుకు ముందుకు సాగండి. విజయం సిద్ధిస్తుంది.

9. ధనుస్సు రాశి
మీ లైఫ్‌ మీరు జీవించండి. ఇతరుల చేతుల్లో ఉండవద్దు. స్వేచ్ఛంగా జీవించేందుకు ఈ ఏడాదిలో యత్నించండి. మీకు స్వతంత్రంగా జీవించే హక్కు ఉందని గుర్తుంచుకోండి. మీ కలలను నెరవేర్చుకోండి.

10. మకర రాశి
జీవితంపై నియంత్రణ సాధించండి. జీవితంపైనే దృష్టి పెట్టండి. ఇతర విషయాలు అవసరం లేదు. మ్యూజిక్‌ వినడం, సామాజిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారించండి.

11. కుంభ రాశి
మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్లాన్‌ చేసుకోండి. పక్కా ప్రణాళికతో వ్యవహరించండి. రిస్క్‌లు తీసుకోవడం కన్నా ప్లాన్డ్‌గా పని చేసేందుకే ఇంపార్టెన్స్‌ ఇవ్వండి.

12. మీన రాశి
మీరు మీ హృదయం చెప్పినట్టు చేయండి. అది ఏం చెబితే ఆ మాట వినండి. ఇతరుల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న శక్తిని ఈ ఏడాది బయటకు తీయండి. కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయండి.

Comments

comments

Share this post

scroll to top